pizza
Thandel Movie Launch
Allu Aravind Presents- Naga Chaitanya Akkineni, Sai Pallavi, Chandoo Mondeti, Bunny Vasu, Geetha Arts- Thandel Muhurtham Ceremony held Grandly
అల్లు అరవింద్ ప్రెజెంట్స్ - నాగ చైతన్య అక్కినేని, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్- ఘనంగా జరిగిన 'తండేల్' ముహూర్తం వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us


9 December 2023
Hyderabad

Yuva Samrat Naga Chaitanya and director Chandoo Mondeti joined forces for the third time for a crazy project Thandel to be produced by Bunny Vasu and presented by Allu Aravind on the Geetha Arts banner. This high-budget film, which is the most expensive one for Naga Chaitanya, had its grand launching ceremony today. King Nagarjuna and Victory Venkatesh attended the Pooja ceremony which was also graced by numerous film celebrities.

Nagarjuna switched on the camera for the muhurtham shot, while Venkatesh sounded the clapboard. Allu Aravind handed over the script to the director.

While speaking at the event, Allu Aravind said, “We wanted to organise this event in a big way, and thanks to Nagarjuna and Venkatesh for gracing the occasion. We started this journey of Thandel one and a half years ago. We are happy that we completed the pooja ceremony today. The director and hero were so patient and worked vigorously to take us to the world of Thandel. After delivering a blockbuster, directors will usually have many offers. But Chandoo honoured the commitment. Usually, Rajamouli does that. Both Naga Chaitanya and Sai Pallavi got excited when they first heard the story. We wanted to release the movie in other languages as well. Devi Sri Prasad who attained Pan India success is part of the movie, and we are content with it. Shamdat is on board to take care of the camera. I feel very positive and auspicious for this film to get all of them on board. I got very excited after a long time, when the board discussion was happening. Let’s discuss the meaning of the title Thandel later.”

Chandoo Mondeti said, “It’s a one-and-a-half year of hard work. Why would a director go out, when we get so much love and care in this production house? Naga Chaitanya and Sai Pallavi are ready to give their best. They are motivating me. I promise my team to give my best.”

Sai Pallavi said, “Happy to see you all after one year. There’s so much positivity here. The director, writer, and producers all have a vision for this film. It has to come and reach you the right way. We all are hoping for the same.”

Naga Chaitanya said, “I’m happy, the pooja was performed today. As Aravind Garu said, we have been travelling with the script for one and a half years. I enjoyed every step of the pre-production process. The work happened collaboratively, starting from interacting with the locals in Srikakulam. We worked on Srikakulam slang. I haven’t had this much of an elaborate planning for any of my previous movies. I enjoyed this process. I still remember, Aravind garu came to my house 3-4 months back and suggested that this movie should be made properly. ‘This script has a lot of potential,’ he told me. ‘100%’ Love from this banner is one of the most memorable successes in my career. More than a director, Chandoo is a good friend. This is our third movie together. I’m looking forward to this journey. Sai Pallavi is such an encouraging actor. She is such a positive energy. We have a good team. I’m happy to associate with Devi Sri Prasad after a long time. We are planning to start the shooting after December 15th.”

Bunny Vasu said, “It’s a very special script for our Geetha Arts. While this movie started one and half years ago for almost everyone, the script came to us 3 years back. I don’t think this kind of research was done before for a film. Heartfelt thanks to the writers' team. We felt something was missing, but Chandoo changed the shape of the movie. We narrated the story to Naga Chaitanya during Dhootha’s shoot. We were initially worried whether his skin tone would set for the character of a fisherman. But we were surprised to see the first look poster. Hats off to Chay, he's been working on it for 1 year and moulded himself for the character. He has put in 200% effort. When a team pumps in positive energy, the project never fails.”

Naga Chaitanya switched beast mode to play a fisherman in the movie and he has done intense workouts for the last few months to gain this muscular look. He sports a rugged look with long hair and beard.

The story of the movie is based on real incidents and the shoot will mostly take place in original locations. Paired opposite Naga Chaitanya in the movie is Sai Pallavi and this is their second movie together, after the superhit Love Story. Thandel is also a love story with a completely different backdrop.

The makers zeroed in on well-known technicians to handle different crafts. As the story has a good scope for music, National-award-winning composer- Rockstar Devi Sri Prasad is roped in to beautify the love story with his soundtracks and score. Shamdat will crank the camera to offer a visual spectacle. National Award winning Editor Navin Nooli will take care of the editing. Srinagendra Tangala will look after the art department.

Cast: Naga Chaitanya, Sai Pallavi

Technical Crew:
Writer, Director: Chandoo Mondeti
Presents: Allu Aravind
Producer: Bunny Vasu
Banner: Geetha Arts
Music: Devi Sri Prasad
DOP: Shamdat
Editor : Navin Nooli
Art: Srinagendra Tangala
Marketing: FirstShow

అల్లు అరవింద్ ప్రెజెంట్స్ - నాగ చైతన్య అక్కినేని, చందూ మొండేటి, బన్నీ వాసు, గీతా ఆర్ట్స్- ఘనంగా జరిగిన 'తండేల్' ముహూర్తం వేడుక

యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని, దర్శకుడు చందూ మొండేటి గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించనున్న క్రేజీ ప్రాజెక్ట్ 'తండేల్' కోసం ముచ్చటగా మూడోసారి చేతులు కలిపారు. నాగ చైతన్య కు హయ్యస్ట్ బడ్జెట్ చిత్రమైన 'తండేల్' ఈరోజు గ్రాండ్ ముహూర్తం వేడుకను జరుపుకుంది. కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌, పలువురు సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

ముహూర్తం షాట్‌కు నాగార్జున కెమెరా స్విచాన్ చేయగా, వెంకటేష్ క్లాప్ ఇచ్చారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు.

మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించి ఎప్పుడూ ప్రోత్సహిస్తున్న ప్రేక్షకదేవుళ్ళకు నమస్కారం. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం. ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా వుంది. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనేదానిపై ప్రత్యేక ద్రుష్టిపెట్టారు. ఈ కథని ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళి చూపించాలి. ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ఒక సినిమా హిట్ అయితే దర్శకుడికి చాలా అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని ఆఫర్లు వచ్చినా ఇచ్చిన కమిట్మెంట్ కోసం గీతా ఆర్ట్స్ లోనే సినిమా చేయాలని నిర్ణయించుకొని, ఈ కథకు నాగచైతన్య సరిపోతారని ఆయన్ని దగ్గరకి తీసుకెళ్ళినపుడు ఆయన ఎక్సయిట్ అయ్యారు. నాగచైతన్యకు సరైన జోడిగా మా బంగారు తల్లి సాయిపల్లవి వచ్చారు. ఈ మధ్య సినిమాని పెద్దగా చూడటం అలవాటైయింది. అలాగే పెద్దగా తీయాలి, పెద్దగా రిలీజ్ చేయాలి. ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైనపుడు పాన్ ఇండియా సౌండ్ అలవాటు చేసిన దేవిశ్రీ ప్రసాద్ రావడం, ఆలాగే అద్భుతమైన కెమరామ్యాన్ షామ్‌దత్, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇలా అద్భుతమైన టీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించడం చాలా అనందంగా వుంది. ఈ కథని భాను రియాజ్ కార్తిక్ మా వద్దకు తీసుకొచ్చారు, నిజంగా జరిగిన కథ ఇది. ఇలాంటి కథ గీతా ఆర్ట్స్ లో తీస్తే బావుటుందని వాసు దగ్గరకి తీసుకొచ్చారు. ప్రీప్రొడక్షన్ వర్క్ లో టీం అంతా కూర్చొని ప్రతి విషయాన్ని చర్చించుకున్నపుడు చాలా సంతోషంగా అనిపించింది. సినిమాని ఇలా తీయాలి కదా అనే తృప్తి వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చి టీంని అభినందించిన నాగార్జున గారు, వెంకటేష్ గారికి ధన్యవాదాలు’ తెలిపారు.

దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా కథపై వర్క్ చేశాం. వాసు గారు అరవింద్ గారు అద్భుతంగా ప్రోత్సహించారు. నాగచైతన్య గారు, సాయి పల్లవి గారు, మిగతా టెక్నిషియన్స్ అందరూ బెస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. వాళ్ళంతా నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతో కొలబరేట్ అయ్యి నా బెస్ట్ ఇస్తాను’’ అన్నారు

సాయి పల్లవి మాట్లాడుతూ.. దర్శకుడు రచయిత నిర్మాతలు అందరికీ ఈ సినిమా పట్ల ఒక విజన్ వుంది. ఆ విజన్ మీ అందరికీ సరిగ్గా చేరుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి ’’అని కోరారు

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. ఏడాదిన్నరగా ఈ కథతో ట్రావెల్ అవుతూవస్తున్నాం. ప్రీప్రొడక్షన్ లో ప్రతి అడుగుని చాలా ఎంజాయ్ చేశాను. చాలా కొలబరేటివ్ గా పనులు జరిగాయి. శ్రీకాకుళం వెళ్లి మత్స్యకార కుటుంబాలని కలవడం, చందూ, నేను కథ పై చర్చించడం, శ్రీకాకుళం యాసపై వర్క్ అవుట్ చేయడం ఇలా చాలా విషయాలపై ప్రత్యేక ద్రుష్టితో పని చేశాం. ఏ సినిమాకి ఇంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రోసస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాను. ఇది ప్రతి సినిమాలా కాదు చాలా ప్రత్యేకమైనదని, బలమైన కథ, కావాల్సిన సమయం తీసుకొని పక్కాగా ప్లాన్ చేసుకొని వెళ్దామని అరవింద్ గారు ముందు నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. కథకు కావాల్సిన బడ్జెట్, సపోర్ట్ ఇస్తున్న అరవింద్ గారికి ధన్యవాదాలు. నా కెరీర్ లో గుర్తుండిపోయే సక్సెస్ 100% లవ్ అరవింద్ గారే ఇచ్చారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం చాలా ఆనందంగా వుంది. అలాగే వాసు గారికి ధన్యవాదాలు. చందూ దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితుడు. తనతో ప్రతి విషయాన్ని ఓపెన్ గా చర్చించగలుగుతాను. మా ఇద్దరం కలసి చేస్తున్న మూడో సినిమా ఇది. సాయి పల్లవి చాలా పాజిటివ్ ఎనర్జీ వున్న యాక్టర్. తను ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా వుంది. దేవిశ్రీ ప్రసాద్ గారు, షామ్‌దత్, శ్రీనాగేంద్ర ఇలా అద్భుతమైన టీం ఈ చిత్రానికి పని చేస్తుంది. డిసెంబర్ 15 తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలి’ అని కోరారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది గీతాఆర్ట్స్ కి చాలా ప్రత్యేకమైన స్క్రిప్ట్. ఇంత రీసెర్చ్ ఏ సినిమాకి జరిగుండదు. ఈ కథకు సంబధించిన ప్రతి అంశాన్ని చాలా లోతుగా వెళ్లి క్యాప్చర్ చేయడంలో టీం చాలా ఎఫర్ట్ పెట్టింది. మూడేళ్ళ క్రితం ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ కి వచ్చింది. అప్పటి నుంచి కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఏడాదిన్నరగా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చందు గారు కథని అద్భుతంగా మలిచారు. ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి. ఆయన్ని దూత షూటింగ్ లో కలిసినప్పుడు ఈ కథ గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇది ఫిషర్ మ్యాన్ క్యారెక్టర్. దినికి చైతుగారి స్కిన్ టోన్ తో పాటు అన్నీ ఎలా కుదురుతాయో అనే ఆలోచన వుండేది. అయితే తండేల్ ఫస్ట్ లుక్ చూసి ఆడియన్స్ తో పాటు నేను షాక్ అయ్యాను. ఒక నటుడు ఒక పాత్రని బలంగా నమ్మి చేస్తే ఎలా వుటుందో అర్ధమైయింది. పోస్టర్ చూసిన తర్వాత వచ్చిన నమ్మకం, సంతోషం మాటల్లో చెప్పలేను. నాగచైతన్య గారి హార్డ్ వర్క్ కే హ్యాట్సప్. దీనికి చైతు గారు 200 పర్సెంట్ ఇస్తున్నారు. దిని రిజల్ట్ కూడా అంత బావుటుంది. సాయి పల్లవి గారికి రెండేళ్ళ క్రితం కథ చెప్పాం. వారి ఇన్పుట్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. చందూ అద్భుతమైన క్యాలిటీతో ప్రోడక్ట్ ని ఇస్తారు. ఆయన గత చిత్రాలకు మించి ఈ చిత్రాన్ని చేయడానికి అరవింద్ గారు మేము మా తోడ్పాటు అందిస్తాం’’ అన్నారు

నాగ చైతన్య ఈ చిత్రంలో మత్స్యకారునిగా నటించడానికి బీస్ట్ మోడ్‌కి మారారు. కండలు తిరిగి దేహం కోసం గత కొన్ని నెలలుగా చాలా హార్ట్ వర్క్ చేశారు. పొడవాటి జుట్టు, గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపిస్తారు.

యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఒరిజినల్ లొకేషన్లలోనే జరగనుంది. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా సాయి పల్లవి నటిస్తున్నారు. సూపర్‌హిట్ 'లవ్ స్టోరీ' తర్వాత ఇది వారి రెండవ చిత్రం. 'తండేల్' కూడా పూర్తిగా భిన్నమైన నేపథ్యంలో సాగే ప్రేమకథ.

అత్యున్నత సాంకేతిక నిపుణులను ఈ చిత్రానికి పని చేస్తున్నారు. కథలో సంగీతానికి మంచి స్కోప్ ఉన్నందున, జాతీయ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ట్రాక్‌లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేమకథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విజువల్ వండర్ ని అందించడానికి షామ్‌దత్ కెమెరామ్యాన్ గా పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.

తారాగణం: నాగ చైతన్య, సాయి పల్లవి
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: చందూ మొండేటి
సమర్పణ: అల్లు అరవింద్
నిర్మాత: బన్నీ వాసు
బ్యానర్: గీతా ఆర్ట్స్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
డీవోపీ: షామ్‌దత్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

 


Photo Gallery

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved