pizza
Nara Rohit releases new year Calendar
You are at idlebrain.com > News > Functions
Follow Us

27 December 2015
Hyderabad

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన నారారోహిత్
నూతన సంవత్సరం పురస్కరించుకుని చిత్తూరు, గుంటూరు, అనంతపురం జిల్లాల నుండి విచ్చేసిన నారా రోహిత్ అభిమానులతో రాజా చెయ్యి వేస్తే చిత్రం షూటింగ్ ప్రాంతం సందడిగా మారింది.


నూతన సంవత్సరం 2016 క్యాలండర్ ని నారారోహిత్, వారి అభిమానులు, నారారోహిత్ చిత్ర నిర్మాతలు, దర్శకులు మధ్య ఎంతో అహ్లాదకరమైన వాతావరణంలో ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా నారారోహిత్ మాట్లాడుతూ నాకోసం అహర్నిశలు ఆలోచిస్తూ నేను నటించిన చిత్రాలను ఆదరిస్తూ నా వెన్నంటే ఉంటున్న నా అభిమానులు, నా నిర్మాతలు, దర్శకులు, శ్రేయోభిలాషులు అందరూ ఆయురారోగ్యాలతో, ఆష్టైశ్వర్యాలతో నూతన సంవత్సరం ఉండాలని ఆకాంక్షించారు.


నూతన సంవత్సరంలో విడుదలవుతున్నవిడుదలవుతున్న విభిన్న చిత్రాలను ఆదరించి 2016 సంవత్సరం నారా నామ సంవత్సరంగా ఉంటుందని, నా జీవితంలో మరుపురాని సంవత్సరం అవుతుందని అకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లానుండి ధను, బాలాజీ, అనీల్, చిత్తూరు జిల్లా నుండి నారా ప్రశాంత్, రవినాయుడు, మునీంద్రనాయుడు, భాను రాయల్, దొరరాజ్ రెడ్డి, రాకేష్ చౌదరి, నవీన్, సత్తెనపల్లి నుండి పవన్, అనీల్ పాల్గొన్నారు.

 



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved