
25 August 2025
Hyderabad
అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ సూపర్ హిట్ 'పరదా'. సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇచ్చారు. దర్శన రాజేంద్రన్‌తో పాటు, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 22న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు.
థాంక్యూ మీట్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. తెలుగు సినిమాలో పరదా ఒక డేరింగ్ స్టెప్. ఇలాంటి కథని బిలీవ్ చేసి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాత విజయ్ గారికి ముందుగా ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని చేసినందుకు గర్వపడుతున్నాను .పరదా నా కెరీర్ లో మోస్ట్ ఫేవరెట్ ఫిలిం. కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చానని రివ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. నేషనల్ మీడియా సినిమా గురించి చాలా అద్భుతంగా రాస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి. ప్రవీణ్ గారు చాలా జెన్యూన్ గా సినిమా తీశారు. ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా బాగుంది. ఇలాంటి సినిమా తీసినందుకు థాంక్యూ అని చెప్తున్నారు. అది చాలా గొప్ప అప్రిసియేషన్. ఈ సినిమా చూసి బయటికి వచ్చాక ఇందులో ప్రతి సీన్ గుర్తు ఉంటుంది. అలా చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంది. అందుకే దీన్ని స్పెషల్ సినిమా అని చెప్తున్నాను. ఈ సినిమా కొన్ని సంవత్సరాలు పాటు గుర్తుండిపోతుంది. దర్శన సంగీత గారు, ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా విషయంలో నేను ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాను. మంచి సినిమాని ప్రోత్సహించాలి అనుకునే వారు తప్పకుండా పరదా సినిమా చూడండి. థాంక్యూ సో మచ్.
డైరెక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ...అందరికి నమస్కారం. ఈ సినిమాకి నేషనల్ వైడ్ గా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. సినిమాకి సపోర్ట్ చేసిన రివ్యూ రైటర్స్ అందరికీ థాంక్యూ. ఇందులో కొన్ని తప్పులు గురించి కూడా రాశారు. వాటిని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అయితే ఇందులో చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది. సినిమా చూసిన వాళ్ళు చాలామంది అప్రిషియేట్ చేశారు. సినిమా రిలీజ్ అయి మూడు రోజులు అవుతుంది. ఇంకా ఈ సినిమా అద్భుతంగా ముందుకెళ్లబోతుంది. ఈ సినిమా స్లో పాయిజన్. చాలా బ్యూటిఫుల్ సినిమా చేశాం. ఆడియన్స్ కొత్తరకమైన సినిమాని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. తెలుగు సినిమాలో పరదా అనే ఒక ప్రత్యేకమైన సినిమా ఉందంటే దానికి కారణం నిర్మాత విజయ్. మా టీమ్ అందరినీ బిలీవ్ చేశారు. ఇలాంటి డేరింగ్ క్యారెక్టర్ ఒప్పుకున్న అనుపమ గారికి థాంక్యూ సో మచ్. తన భుజాల మీద వేసుకుని ఈ సినిమాని ముందుకు నడిపించింది. రివ్యూలో అందరూ కూడా అనుపమ పర్ఫార్మెన్స్ ని మెచ్చుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమాకి తనకి నేషనల్ అవార్డు వస్తుందని నమ్మకంగా ఉన్నాను. తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎడిటర్ ధర్మేంద్ర గారు అద్భుతంగా ఈ సినిమాని కట్ చేశారు. గోపీసుందర్ గారి బిజిఎంస్ గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. మృదుల్ కెమెరా గురించి అందరూ కూడా అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాగ్ మయూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్. తనతో కలిసి మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను. దర్శన గారు సంగీత గారు ఈ సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ సినిమా మొదలైనప్పుడు ఎలాగున్నామో, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంతే హ్యాపీగా ఉన్నాం. అది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సందర్భంగా మా టీమ్ అందరికీ థాంక్యూ చెప్తున్నాను. ఆడియన్స్ ఈ సినిమా చూసి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ చాలా జెన్యూన్ గా అనిపించాయి. ఈ సందర్భంగా ఆడియన్స్ కి అందరికీ థాంక్యూ. ఈ సినిమా చాలా మంది అమ్మాయిల్ని అమ్మాయిల జీవితాన్ని గుర్తు చేసిందని ఒక పెద్దావిడ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాకి చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి థాంక్యూ. అనుపమ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిందని ఆడియన్స్ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎడిటర్ ధర్మేంద్ర గారు లేకపోతే ఈ విజన్ కట్ ఉండేది కాదు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చేసినందుకు ఆనంద మీడియా తరఫున ఒక నిర్మాతగా చానా గర్వపడుతున్నాను. నేను ఎన్ని సినిమాలు చేసిన పరదా నా మొదటి సినిమా అని చెప్పుకునే అంత ఆనందాన్ని ఈ సినిమా ఇచ్చింది. ఆడియన్స్ అందరికి థాంక్యూ సో మచ్.
రాగ్ మయూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా ఆడియన్స్, క్రిటిక్స్ కి థాంక్యూ. నేను గత నాలుగేళ్లుగా ఏ క్యారెక్టర్ చేసిన ఎంతగానో ప్రోత్సహించి అభినందించారు. మీ ప్రశంసలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. పరదా చాలా స్పెషల్ ఫిలిం.ఈ కథలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. నా వంతు కాంట్రిబ్యూషన్ చేశానని భావిస్తున్నాను. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ కి థాంక్యూ. సినిమాకి అద్భుతమైన రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా గురించి అందరూ హానెస్ట్ గా రాయడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అందరు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది.
ఎడిటర్ ధర్మేంద్ర మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతకి చాలా ధైర్యం కావాలి. అందుకు ముందుగా నిర్మాత విజయ్ గారిని అభినందిస్తున్నాను. అనుపమ గారు సంగీత గారు దర్శన గారు ఈ ప్రాజెక్టులో చేరడం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. రాయ్ మయూర్ సపోర్ట్ కి థాంక్యూ. ప్రవీణ్ ఏ సిమ్నిమ చేసిన ఒక మంచి విజన్ తో చేస్తాడు. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. థాంక్ యూ మీట్ లో పరదా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
