`
pizza

Peddi Bangalore press meet
రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. పెద్ది చిత్రం ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది: కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్

You are at idlebrain.com > News > Functions
Follow Us


25 May 2026
Hyderabad


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

బెంగళూరు ప్రెస్ మీట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. కన్నడ ప్రేక్షకులందరికీ నమస్కారం. అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు నచ్చిన పని, తెలిసిన పని చేస్తూ ఇంత ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ, దేవుడికి నమస్కరిస్తున్నాను. దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో నిజాయితీగా, ప్రాణం పెట్టి పనిచేశాం. రాసిపెట్టుకోండి... ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతుంది. శివన్న నాకు ఒక ఫాదర్, ఒక అంకుల్, ఒక బ్రదర్‌లాంటి వారు. ఆయన భారతీయ సినీ పరిశ్రమలో ఒక లెజెండ్, కన్నడ చిత్రసీమకు చక్రవర్తి. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఏఆర్ రెహమాన్ గారు ఈ చిత్రంలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. జాన్వీ గారు కూడా ఈ సినిమా కోసం ఎంతో నిజాయితీగా పనిచేశారు. మా నిర్మాత సతీష్ గారికి ఇది తొలి చిత్రం. ఆయన హార్ట్ ఫుల్ గా చేశారు. బుచ్చిబాబు లేకపోతే ఈ సినిమా లేదు. అలాగే జగపతిబాబు గారికి, డీవోపీ రత్నవేలు గారికి ధన్యవాదాలు. ఈ సినిమా జరగడానికి ప్రధాన కారణమైన సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా జీవితంలో నేను చేసిన మోస్ట్ ఇన్స్పైరింగ్ ఫిలిం ‘పెద్ది’. జూన్ 4న మీరందరూ తప్పకుండా థియేటర్లలో ఈ సినిమాను చూస్తారని కోరుకుంటున్నాను.

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ వచ్చారు. తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్ గారు, అభిమానుల ఆశీర్వాదాలు ఆయనకు ఎప్పుడూ వుంటాయి. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఒక కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చున్నారు. వారి మధ్య ఆప్యాయత నన్ను ఎంతో హత్తుకుంది. నాకు పునీత్‌తో ఉన్న అనుబంధం లాంటిదే. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. నిర్మాత సతీష్ గారు, దర్శకుడు బుచ్చిబాబు గారు, రత్నవేలు గారు అందరూ నాకు ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ గారికి కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. చిరంజీవి గారంటే మనందరికీ ఎంతో అభిమానం. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొని రక్తదానం చేశాను. ప్రేక్షకులు చిరంజీవి గారి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ఆప్యాయతను నేను ఎక్కడా చూడలేదు. మన మధ్య భాషా భేదాలు లేవు. మంచి కళాకారులను మనం ఎప్పుడూ ప్రేమతో ఆదరిస్తాం. ఈ సినిమాలో ఒక పాత్ర ఉందని చెప్పగానే నేను వెంటనే చేస్తానని చరణ్ గారికి చెప్పాను. బుచ్చిబాబు గారు నా పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బలమైన భావోద్వేగం ఉంది. బుచ్చిబాబు గారు చెప్పిన కథ ప్రతి ప్రేక్షకుడిని కచ్చితంగా కనెక్ట్ చేస్తుంది. ‘పెద్ది’ పాత్ర ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది. జూన్ 4 కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

హీరోయిన్ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నమస్తే బెంగళూరు. జూన్ 4న మా ‘పెద్ది’ సినిమా విడుదల కానుంది. ఇది చాలా ప్రత్యేకమైన కథ. అందరూ తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దర్శకుడు బుచ్చిబాబు గారు అద్భుతమైన కథను తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారితో కలిసి నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మన కన్నడ సూపర్ స్టార్ శివన్న గారితో ఒక సీన్‌లో నటించే అవకాశం రావడం నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. జూన్ 4న మీరందరూ థియేటర్లలో ‘పెద్ది’ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.

నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ‘పెద్ది’లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా. కుటుంబ సమేతంగా చూసే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఆయన అంకితభావం, శ్రమ స్క్రీన్‌పై ప్రతి క్షణంలో కనిపిస్తుంది. మేమంతా ఎంతో ప్రేమతో ఈ సినిమాను రూపొందించాం. జూన్ 4న మీరందరూ థియేటర్లలో ‘పెద్ది’ని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved