.
pizza
‘బందిపోటు’ ప్లాటినం డిస్క్ ఫంక్షన్
You are at idlebrain.com > News > Functions
Follow Us

16 February 2015
Hyderabad

ఇవివి సినిమా బ్యానర్ పై అల్లరి నరేష్, ఈషా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ’బందిపోటు‘. ఇప్పటి వరకు డిఫరెంట్ కామెడితో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన టాలీవుడ్ కామెడి హీరో అల్లరి నరేష్ రాబిన్ హుడ్ తరహా కథాంశంతో ‘దొంగల్ని దోచుకో’ అనే కాన్సెప్ట్ తో మరోసారి నవ్వులు విరబూయించనున్నారు. ‘అష్టాచమ్మా’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అంతకు ముందు...ఆ తర్వాత’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెరకెక్కించిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రాజేష్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. కల్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదలై మంచి సక్సెస్ అయింది. ఈ సందర్భంగా ఈ నెల 14, 15వ తేదిల్లో చిత్రయూనిట్ ప్రమోషనల్ టూర్ చేసింది. 15వ సాయంత్రం విజయవాడలో ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహనరావు, ధూళిపాళ నరేంద్ర సహా అల్లరి నరేష్, మోహనకృష్ణ ఇంద్రగంటి, ఈష, సంపూర్ణేష్ బాబు, అవసరాల శ్రీనివాస్, అనిల్ సుంకర, స్మిత, కళ్యాణ్ కోడూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ‘’తెలుగు వారందరూ ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సినిమా పరిశ్రమ రెండు చోట్ల అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఏ సినిమా విడుదలైనా ముందుగా విజయవాడలో సక్సెస్ అయితే సినిమా సక్సెస్ అయినట్లే కాబట్టి ఇక్కడ కూడా కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతున్నాను. ఇప్పుడిప్పుడే ఇటువంటి ఫంక్షన్స్ జరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. బందిపోటు ఆడియో సక్సెస్ అయిన విధంగానే సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ ‘’ఒకప్పుడు ప్రధాని నరసింహారావుగారు రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూసి ఎంజయా చేసేవారు. అలాగే ఇప్పటి తరంలో మేమందరం అల్లరి నరేష్ సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాం. ఇ.వి.వి. గారి బ్యానర్ లో వస్తున్న ఈ బందిపోటు సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ధూళిపాళ నరేంద్ర మాట్లాడుతూ ‘’ఇ.వి.వి. గారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన తనయులు రాజేష్, నరేష్ లు కలిసి ఆయన బ్యానర్ లో సినిమా చేయడం అనేది చాలా అనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఆర్యన్ రాజేష్ మాట్లాడుతూ ‘’నాన్నగారి స్థాపించిన బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాపై ఎన్ని అంచనాలుంటాయో తెలుసు. ఆ అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుంది. ఇకపై ఈ బ్యానర్ పై వరుసగా సినిమాలు నిర్మిస్తాం. బందిపోటు ఆడియో సక్సెస్ చేసినట్లే సినిమాని కూడా పెద్ద సక్సెస్ చేయాలని భావిస్తున్నాం’’ అన్నారు.

స్మిత మాట్లాడుతూ ‘’రాజేష్, నరేష్ నాకు బ్రదర్ లాంటివారు. వాళ్లింట్లో ఆడపిల్లలు లేకపోవడంతో నాకు వారితో మంచి అనుబంధం ఏర్పడింది. బందిపోటు ఆడియో సక్సెస్ అయిన విధంగానే సినిమా కూడా పెద్ద హిట్టవుతుంది‘‘ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ ‘’ రెండు రోజులుగా రెస్ట్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం. కళ్యాణ్ కోడూరి గారి మ్యూజిక్ అల్రెడి పెద్ద సక్సెస్ అయింది. మోహన కృష్ణగారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కూడా అలాగే అందరినీ నవ్విస్తుంది. మా బ్యానర్ లో రానున్న సినిమాలన్నీ నాన్నగారి పేరుని నిలబెట్టే విధంగానే ఉంటాయి. బందిపోటు సినిమాని ఈ నెల 20న మీ ముందుకు తీసుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

కళ్యాణ్ కోడూరి మాట్లాడుతూ ‘’ఆడియో సక్సెస్ చేసినట్లే సినిమాని కూడా పెద్ద సక్సెస్ చేస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ‘’ఇ.వి.విగారి బ్యానర్లో సినిమా చేయడం అదృష్టం. చాలా మంచి క్యారెక్టర్. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’ నేను ఇక్కడ చదువుకునే రోజుల్లో సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. విజయవాడ కారణంగానే సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచన వచ్చింది. బందిపోటు సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ ‘’ఇ.వి.వి. సినిమా బ్యానర్ లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నరేష్ డిఫరెంట్ కామెడితో నవ్విస్తాడు. సంపూర్ణేష్ బాబు కూడా కీ రోల్ చేశాడు. కళ్యాణ్ కోడూరి గారి సంగీతం సక్సెస్ అయింది. సినిమా కూడా తప్పకుండా హిట్టవుతుంది’’ అన్నారు.

కార్యక్రమంలో భాగంగా యూనిట్ సభ్యులకు ప్లాటినమ్ డిస్క్ షీల్డ్స్ ను అందజేశారు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved