pizza
Bhadram Be Careful Brother platinum disc function
29న `భ‌ద్రం బీకేర్‌ఫుల్ బ్ర‌ద‌రూ` విడుద‌ల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

21 April 2016
Hyderabad

చ‌ర‌ణ్‌, రాజ్‌, సంపూర్ణేష్ బాబు, హ‌మీదా, రోష‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సినిమా భ‌ద్రం బీకేర్‌ఫుల్ బ్ర‌ద‌రూ. మ‌ల్లిపూడి రామ్‌జీ స‌మ‌ర్పిస్తున్నారు. మారుతి టీమ్ వర్క్స్, శ్రీ వెంక‌ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రూపొందుతోంది. రాజేష్ పులి ద‌ర్శ‌కుడు. బోనం కృష్ణ స‌తీశ్‌, అడ్డ‌గార్ల జ‌గ‌న్‌బాబు, ఉప్పులూరి బ్ర‌హ్మాజీ నిర్మాత‌లు. ఈ చిత్రం ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక హైద‌రాబాద్‌లో గురువారం ఉద‌యం జ‌రిగింది.

మారుతి మాట్లాడుతూ ``ముగ్గురు షార్ట్ ఫిల్మ్ చేసే యువ‌కులు సంపూర్ణేష్ బాబు హీరోగా ఒక చిత్రాన్ని తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుంద‌నేదే ఈ సినిమా. పూర్తి స్థాయి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఈ క‌థ‌లో సంపూర్ణేష్ బాబు పాత్ర కీల‌క‌మైంది. ఈ సినిమాకు సంగీతం పెద్ద ఎస్సెట్‌. ఏప్రిల్ 29న విడుద‌ల చేస్తున్నారు`` అని అన్నారు.

రాజేష్ పులి మాట్లాడుతూ ``కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. సినిమాలో సంపూ గెట‌ప్స్ అంద‌రీ అల‌రిస్తాయి. టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి చేశాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది`` అని చెప్పారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ``ఈ సినిమాలో నేనొక మంచి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఏప్రిల్ 29న విడుద‌ల కానుంది`` అని తెలిపారు.

ఈ సినిమాకు క‌థ‌: మారుతి అండ్ టీమ్‌, మాట‌లు: వై.నివాస్‌, ఎడిటింగ్‌: కార్తిక్ శ్రీనివాస్‌, సంగీతం: జె.బి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved