సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌లో ...
దర్శకుడు వంశీకృష్ణ అకెళ్ళ మాట్లాడుతూ``దర్శకుడుగా నాకు ఇది రెండవ సినిమా. జక్కన్న అనే టైటిల్ ప్రేక్షకుల్లో బాగా పాపులర్ అయ్యింది. అలాగే దినేష్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు. పాటలు చాలా పెద్ద విజయాన్ని అందుకున్నాయి. నిర్మాత సుదర్శన్ రెడ్డిగారు నన్ను నమ్మి ఈ సినిమాలో దర్శకత్వ అవకాశం ఇచ్చారు. మంచి సినిమా చేశాననే అనుకుంటున్నాను. సినిమా చూశాం. అందరూ హ్యాపీగా ఉన్నాం. సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. తప్పకుండా అందరినీ ఎంటర్ టైన్ చేసే చిత్రంగా నిలుస్తుంది`` అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ``సాంగ్స్ చాలా బావున్నాయి. సునీల్ తనదైన స్టైల్‌లో కామెడి హీరోగా రాణిస్తున్నాడు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా జక్కన్నతో మళ్ళీ పుంజుకుంటాడని భావిస్తున్నాను. అప్పట్లో ఎన్టీఆర్‌కు పోటాపోటీగా చలం తనదైన మార్కు కామెడితో సినిమాలు చేసేవాడు. ఇప్పుడు సునీల్ కూడా విలక్షణమైన కామెడితో హీరోగా రాణిస్తున్నాడు. తను నవ్విస్తూ ఏడిపించగల నటుడు. తను భవిష్యత్‌లో ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. జక్కన్న సునీల్ మార్కు సినిమాగా నిలిచి అందరికీ మంచి పేరు తెస్తుంది.తనకు ఎవరూ పోటీకాదు, తన సినిమాలే తనకు పోటీగా నిలవాలని భావిస్తున్నాను`` అన్నారు.
Mannara Chopra Glam gallery from the event
మారుతి మాట్లాడుతూ``నిర్మాత సుదర్శన్ రెడ్డిగారితో ప్రేమకథా చిత్రం చేసే సమయం నుండి మంచి అనుబంధం ఉంది. ఆయన మంచి కథ కోసం చాలా రోజులు వెయిట్ చేసి జక్కన్న సినిమా చేస్తున్నారు. సునీల్‌గారు చాలా యాక్టివ్‌గా నటించారు. ఈ సినిమాకు తనకు మరో హిట్ చిత్రంగా నిలిచి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. సినిమా జూలై 29న విడుదలవుతుంది. ఎంటైర్ టీంకు అభినందనలు`` అన్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ``మాటలు మంచి ఆదరణ పొందాయి. దినేష్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సినిమా జూలై 29న విడుదలవుతుంది. డైరెక్టర్ వంశీకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. ఆయన చెప్పిన దానికంటే సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు. సునీల్ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. మంచి ఎంటర్‌టైనింగ్‌తో ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు నవ్వుతూ ఉండేలా సినిమా సాగుతుంది. మా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ``జక్కన్న నా మార్కు కామెడితో సాగే చిత్రం. డైలాగ్స్ అన్నీ చక్కగా కుదిరాయి. ఎంజాయ్ చేస్తూ చేశాను. మన్నార్ చోప్రా చక్కగా నటించింది. నేను వెనుక బెంచీలో కూర్చొని సినిమాను ఎంజాయ్ చేసినవాడిని. అందుకే నా లక్ష్యం ఎప్పుడూ ఆడియెన్సే. ఆడియెన్స్ ఆదరణ అందరికీ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉండాలని కష్టపడ్డాను. నిర్మాత సుదర్శన్ రెడ్డిగారు అందించిన సపోర్ట్ మరచిపోలేనిది. యూనిట్‌లో ప్రతి ఒక్కరూ సినిమా కోసం చాలా కష్టపడి సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. జూలై 29న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ మాట్లాడుతూ ``ఈ సినిమాలో నాపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన సునీల్, దర్శకుడు వంశీకృష్ణ అకెళ్ళ, నిర్మాత సుదర్శన్‌రెడ్డిగారికి థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. యూనిట్ సభ్యులకు ప్లాటినం డిస్క్‌లను అందజేశారు.
కబీర్ సింగ్, సప్తగిరి, పృథ్వీ, పోసాని, నాగినీడు, రాజ్యలక్ష్మి, చిత్రం శ్రీను, అదుర్స్ రఘు, రాజా రవీంద్ర తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, మ్యూజిక్: దినేష్, ఫైట్స్: కనల్ కణ్ణన్, డ్రాగన్ ప్రకాష్,ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, డైలాగ్స్: భవాని ప్రసాద్, కో ప్రొడ్యూసర్స్: ఆయుష్ రెడ్డి, అక్షిత్ రెడ్డి, నిర్మాత: ఆర్.సుదర్శన్ రెడ్డి, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ అకెళ్ళ.