4 September 2016
Hyderabad
కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ జంటలుగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జాకి అతిక్ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం'లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి`. శ్రీకోటి సంగీతం అందించిన సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సునీల్, మారుతి సహా చ చిత్ర దర్శకుడు జాకీ అతిక్, నిర్మాత మేరువ సుబ్బారెడ్డి, హీరో కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
హీరో సునీల్ మాట్లాడుతూ -``ఈ ఫంక్షన్‌కు నేను రావడం నా బాధ్యత. ఎందుకంటే నేను కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో నటించడానికి అవకాశాల కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు గౌతంరాజుగారు నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి ఆదరించిన వ్యక్తి. అలాగే నన్ను పద్మాలయా బ్యానర్‌కు తీసుకెళ్ళి టీవీ సీరియల్‌లో అవకాశం ఇప్పించిన వ్యక్తి గౌతంరాజుగారు. ఆయన కుమారుడు కృష్ణ నా కంటే పెద్ద హీరో కావాలి. కృష్ణ నటించిన ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
Glam galleries from the event |
|
|
మారుతి మాట్లాడుతూ ``టైటిల్ చాలా కొత్తగా ఉంది. లైన్ విన్నాను. కాన్సెప్ట్ ఇన్నోవేటివ్‌గా అనిపించింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. టీం పడ్డ కష్టం తెరపై కనపడుతుంది. తెలుగు ఇండస్ట్రీలోని ఉన్నంత కమెడియన్స్ ఇంకే ఇండస్ట్రీలోనూ లేరు. అలాంటి కమడియెన్స్‌లో గౌతంరాజుగారు ఒకరు. ఆయన కోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయన కుమారుడు కృష్ణకు మంచి బ్రేక్ రావాలి. డెఫనెట్‌గా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
నటుడు గౌతంరాజు మాట్లాడుతూ - ``సినిమాలో ఓ పాత్ర కోసం నిర్మాతలు నా వద్దకు వచ్చారు. హీరో కోసం వెతుకుతున్నారని తెలిసి మా అబ్బాయి గురించి చెప్పాను. వారు మా అబ్బాయిని చూడగానే నచ్చడంతో హీరోగా చేయమని అడిగారు. అలా తను ఈ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాతలు సినిమాను చక్కగా నిర్మించారు. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం`` అన్నారు
అనీల్ సుంకర మాట్లాడుతూ - ``టైటిల్ వినడానికే బావుంది. లైన్ విన్నాను. దేవతలు వచ్చి సినిమాను తీయడమనే కాన్సెప్ట్ చాలా బావుంది. ఇలాంటి సినిమాలు పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాత యం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ `` కొత్త లైన్‌తో చేసిన సినిమా. సెప్టెంబర్ మూడో వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. సినిమా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, ఫొటోగ్రఫీ: రఘు.ఆర్.బళ్ళారి, సహనిర్మాత : సిరాజ్, నిర్మాత : మేరువ సుబ్బారెడ్డి, కథ,మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: జాకి అతిక్.
యూనిట్ సభ్యులకు హీరో సునీల్, అనీల్ సుంకర, మారుతి డిస్క్‌లను అందజేశారు.