బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తూ కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన చిత్రం "శరణం గచ్చామి`. ప్రేమ్‌రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో...
నిర్మాత మురళి బొమ్మకు మాట్లాడుతూ - ``సినిమా రెండు సంవత్సరాల జర్నీ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాతగా నా తొలి చిత్రమిది. అందరి సపోర్ట్‌తో సినిమాకు అనేక అవాంతరాలు ఏర్పడినా, వాటిని దాటి ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. ప్రేమ్‌రాజ్‌గారు అందరినీ కులుపుకుపోయి సినిమా అద్బుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో అంబేద్కర్‌గారిపై సుద్ధాల అశోక్‌తేజ్‌గారు రాసిన పాటకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది. పరుచూరి వెంకటేశ్వరరావుగారి విలువైన సలహాలతో ముందుకెళ్ళాం. రవికళ్యాణ్ సంగీతంం, కల్యాణ్ సమీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా కుదిరింది. మేం చేసిన ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
ప్రేమ్ రాజ్ మాట్లాడుతూ - ``పరుచూరి బ్రదర్స్ నా గురువులు. వారు కమర్షియల్ సినిమాలకు పనిచేసినా, వారు మెసేజ్‌తో కూడిన చిన్న సినిమాలకు దర్శకత్వం వహించారు. వారి నుండే నేను మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడాన్ని నేర్చుకున్నాను. నాతో పాటు ప్రొడ్యూసర్‌గారు కూడా అలాంటి ఆలోచనతో ఉండటం వల్ల సినిమా చేయడం సులభమైంది. ఏప్రిల్ 7న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని సూపర్‌హిట్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో నవీన్ సంజయ్ మాట్లాడుతూ - ``అదృష్టం వల్లనే ఇలాంటి ఓ మెసేజ్ ఉన్న చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
సుద్ధాల అశోక్ తేజ్ మాట్లాడుతూ - ``కథ వినగానే రిజర్వేషన్స్ పై సినిమా చేయడమంటే చిన్న విషయం కాదనే సంగతి తెలుసు. కాబట్టే ముందు కాస్తా భయమేసినా, నిర్మాత మురళిగారు చెప్పిన సమాధానంతో పాటు, పరుచూరి వెంకటేశ్వరరావుగారి వంటి సీనియర్ రైటర్ సినిమాకు పనిచేస్తున్నారని తెలియడంతో నేను ధైర్యంగా అడుగేశాను. ఈ సినిమాలో రెండు సాంగ్స్ రాసే అవకాశం కలిగింది. అంబేద్కర్‌పై పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``మేం కమర్షియల్ సినిమాకు రచయితలుగా పనిచేసినా, మెసేజ్‌లతో కూడిన చిత్రాలకు దర్శకత్వం చేస్తూ వచ్చాం. ఇప్పుడు మా శిష్యుడు ప్రేమ్‌రాజ్ అదే బాటలో ముందుకు సాగుతుండటం ఆనందంగా ఉంది. హీరో నవీన్ లుక్ బావుంది. తను మంచి హీరోగా ఎదుగుతాడు. అంబేద్కర్‌లాంటి గొప్ప వ్యక్తి సమాజం కోసం ఏం చేశాడనేదే ఈ సినిమాలో చెప్పాం. 67 సంవత్సరాలకు ముందు రూపొందించిన ఈ రిజర్వేషన్ చట్టం అప్పట్లో అందమైన బొమ్మలా కనపడింది. కానీ ఇప్పుడు భూతంలా కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుందనేది, దానికి కారణమెవరనేదే అసలు కథ. ఏప్రిల్ 7న విడుదలవుతున్న ఈ `శరణంగచ్చామి` తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
ఈ కార్యక్రమంలో రవికళ్యాణ్, కళ్యాణ్ సమీ తదితరులు పాల్గొన్నారు. చిత్రయూనిట్ ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.