1 August 2016
Hyderabad
కన్నడంలో రూపొందిన చిత్రం నాని. ఈ హర్రర్ చిత్రాన్ని తెలుగులో భీమవరం టాకీస్ బ్యానర్‌పై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు. మనీష్ ఆర్య, ప్రియాంకరావు, బేబి సుహాసిని, బై జగదీష్, కల్పన, రాధ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సుహాసిని కీలకపాత్రలో నటించారు.సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతుంది. త్యాగరాజ్-గురుకిరణ్ సంగీతం అందించిన ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో...
సి.కల్యాణ్ మాట్లాడుతూ ``కన్నడలో ఈ మధ్య రిలీజై మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. సినిమాను మంచి ప్లానింగ్‌తో రిలీజ్ చేస్తే థియేటర్స్ బాగా దొరుకుతాయని శివగామి సినిమా రిలీజ్ చేసింది. డెఫనెట్‌గా సినిమా ఘన విజయం సాధించాలని, రామసత్యనారాయణకు ఈ సినిమాతో శివగామి రామసత్యనారాయణ అని పేరు రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ `` నిజానికి సినిమాను ఆగస్ట్ 19న రిలీజ్ చేద్దామనుకున్నాం కానీ ఓ సినిమా రావడం లేదని తెలిసి సినిమాను ఆగస్ట్ 5నే రిలీజ్ చేయడానికి సిద్ధం అయ్యాను. ఒక మంచి సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికితే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపిస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే కన్నడంలో సూపర్‌హిట్ అయ్యింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను`` అన్నారు.
కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ``ఈ సినిమా కన్నడలో విజయం సాధించినట్టుగానే తెలుగులో కూడా విజయం సాధిస్తుంది. రామసత్యనారాయణకు మంచి పేరు, లాబాలను తీసుకొచ్చే చిత్రమవుతుంది`` అన్నారు.
కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ``మంచి పేరు, డబ్బులు వస్తాయని చెబితే ట్రాఫిక్ సినిమాను రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న రామసత్యనారాయణ ఈ సినిమాతో మరింత పెద్ద లాభాలను, పేరును సంపాదించుకోవాలి. ఈ సినిమా శాటిలైట్ విషయంలో నావంతుగా సపోర్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను``అన్నారు.
శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ``అన్నింటికి ఓ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగే నిర్మాతలకు రామసత్యనారాయణ ఓ కోర్సును స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తనకు నిర్మాణ మెళుకువలు అంత బాగా తెలుసు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి`` అన్నారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ ``సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
నిర్మాత రమేష్ కుమార్ జైని మాట్లాడుతూ ‘’గుజరాత్ ఓ ఇంటిని 17 సంవత్సరాల పాటు మూసి వేశారు. ఆ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను కన్నడంలో నాని అనే పేరుతో విడుదల చేసి సక్సెస్ సాధించాం. ఇప్పుడు శివగామి అనే పేరుతో ఈ చిత్రం తెలుగులో ఆగస్ట్ 5న విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో జి.వి.చౌదరి, నాగరాజ్ గౌడ్, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్రయూనిట్ సభ్యులకు ప్లాటినమ్ డిస్క్‌లను అందజేశారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సురేష్, సంగీతంః త్యాగరాజ్-గురుకిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః డా.శివ వై.ప్రసాద్, సమర్పణః రమేష్ కుమార్ జైన్, నిర్మాతః తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుమంత్.