16 August 2016
Hyderabad
నూతన నిర్మాణ సంస్థ యాదాద్రి ఎంటర్ టైన్మెంట్స్ తొలి ప్రయత్నంగా తమిళంలో ఘనవిజయం సాధించిన `కయల్` చిత్రాన్ని `తొలిప్రేమలో` అనే పేరుతో తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ప్రేమఖైదీ, గజరాజు వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో గౌళీకార్ శ్రీనివాస్ సమర్పణలో తమటం శ్రీనివాస్, జయారపు రామకృష్ణ నిర్మాతలుగా ఈ సినిమా రూపొందుతుంది. చంద్రన్, ఆనందిని, ప్రభు ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా ఆగస్ట్ 26న విడుదలవుతుంది. డి.ఇమాన్ సంగీతం అందించిన ఆడియో గ్రాండ్ ప్లాటినమ్ వేడుక మంగళవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా....
నిర్మాతల్లో ఒకరైన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ``పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2016లో బిచ్చగాడు ఎంత సక్సెస్ సాధించిందో అంతటి సక్సెస్‌ను మా చిత్రం సాధిస్తుందని భావిస్తున్నాం. సినిమా విడుదల విషయంలో సి.జె.శోభారాణిగారు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు`` అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ ``సాంగ్స్ విజువల్‌గా ఎంతో బావున్నాయి. నా పెళ్ళిచూపులు చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రతి చిత్రం కూడా అదే విధంగా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటాను. ఈ సినిమా కూడా అంత పెద్ద విజయాన్సి సాధించాలి. ఇమాన్‌గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు`` అన్నారు.
దర్శకుడు ప్రభు మాట్లాడుతూ ``ఫీల్ గుడ్ టైటిల్. నేను ఈ చిత్రాన్ని తమిళంలో చూసి స్పెల్ బౌండ్ అయ్యాను. రచయితలు మంచి మాటలు, పాటలు అందించారు. నిర్మాతలు ప్రతి అడుగులో చాలా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే సునామీ సీన్ సినిమాకు చాలా హైలైట్ అవుతుంది`` అన్నారు.
Anandhi Glam gallery from the event |
|
|
|
సి.జె.శోభారాణి మాట్లాడుతూ ``ప్రతి సీన్ కళాత్మకంగా ఉంది. ప్రభుసాల్మన్ వెర్సటైల్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన మరో అద్భుతమైన కావ్యమే ఈ చిత్రం. మంచి ఫీల్ గుడ్ మూవీ. డెఫనెట్‌గా పెద్ద సక్సెస్ అవుతుంది`` అన్నారు.
ఆనంది మాట్లాడుతూ ``ఈ సినిమాను తమిళంలో కయల్ అనే పేరుతో రూపొందించారు. తమిళంలో చాలా పెద్ద హిట్టయ్యింది. 80 రోజుల పాటు చిత్రీకరణ చేశాం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ కోసం చాలా కష్టపడ్డాం. సునామీ వచ్చినప్పుడు కన్యాకుమారిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మధ్య సాగే ఎమోషనల్ మూవీ. తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్న నిర్మాతలకు పెద్ద థాంక్స్`` అన్నారు.
ఈ కార్యక్రమంలో సముద్ర, సత్యనారాయణ, సాయివెంకట్, అంజిశ్రీను, అశ్లేష తదితరులు పాల్గొన్నారు.