pizza
18 Pages Pre Release Event
Nikhil's Emotional Speech at 18 Pages Pre Release Event moved everyone
18పేజెస్ సినిమాకి ఆ టీం పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుంది - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
You are at idlebrain.com > News > Functions
Follow Us


19 December 2022
Hyderabad

Hero Nikhil and Anupama Parameswaran will be seen sharing electrifying chemistry in the crazy love story 18 Pages directed by Palnati Surya Pratap. The film is carrying good buzz with interesting posters, songs and promotions. As the release date is getting nearer, yesterday makers arranged a grand pre release event. Icon Star Allu Arjun graced the pre-release event and Director Sukumar also attended the event.

On stage, the 18 Pages team expressed their special bond and respect for Allu Arjun. Addressing the event, Allu Arjun wished the entire team of 18 Pages and wished good luck. He said "18 pages is very close and important film to me, because everyone in this team are my family." Coming to Nikhil, I have been following his work since Happy Days, and every time he has given superhits with different scripts, I am astounded by his eye for good scripts. Best wishes, Nikhil.

He expressed gratitude to Bunny Vas, Sukumar, Palnati Surya Pratap, and the entire team, and shared his special bond with them. Reacting to his fans request about Pushpa updates, Allu Arjun said that he used to ask Sukumar about Pushpa 2 updates, or else he will reveal all the dialogues from the movie. He added that he cannot reveal anything about the film but will reveal a dialogue. He said the 'Assalu Thaggedhe Le' dialogue.

Prior to this, genius director Sukumar delivered a fantastic speech in which he remembered each and every member of the team. He expressed gratitude to Palnati Surya Pratap, Bunny Vas, and producer Allu Aravind for always being present and caring for him. Talking about Anupama he said "Actually, Anupama was supposed to work as a heroine for Rangasthalam, and we auditioned her, but it didn't happen. Anu, we have to work on an exciting project.

He also gave a small update about Pushpa 2, he said "We've recently started Pushpa The Rule shoot and completed 5 days filming. Believe me, your hero Allu Arjun's attention to detail, expressions, and concern for Pushpa 2 was brilliant. This time, Pushpa 2 will be, I won't say anything more than that.

Everyone was moved by Hero Nikhil's emotional speech. He said "SS Rajamouli garu, Sukumar garu, and Allu Arjun garu paved the way for many regional films to become Pan India films. And, thanks to you, our Karthikeya 2 also made it big. 2022 has been great year for me with the blockbuster success and Allu Arjun garu attending the event, and at the same time I lost my father this year and Allu Aravind garu was there for me at the event even in his busy works. He was almost like a father figure to me."

He continued "I'd like to thank Bunny Vas garu for his passion of cinema and my director Palnati Surya Pratap brother for working on a film for three years and treating it like a baby. Hats off to your persistence and dedication, brother, and on the 23rd, you'll all see what Surya Pratap created. And this film was written by creative director Sukumar Garu, whose films I enjoy, and I can't tell you how many times I've watched Arya with my friends. And when he said, "I've written a script, will you do it?". I was surprised and it made me happy to act in the role you've written sir. I believe Siddhu will be the best role in my life. And I am grateful that you chose me.

I'm standing here with confidence because I know how this film will turn out. It's a very good film, and you'll all have something to say about it on December 23rd.

The grand pre release event concluded on a happy note, with exciting speeches from the entire cast and crew and dance performances. Pushpa director Sukumar has penned the script for 18 Pages. Produced by Bunny Vaas, under the banners of GA 2 Pictures and Sukumar Writings, the movie has music composed by Gopi Sundar.

18పేజెస్ సినిమాకి ఆ టీం పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుంది - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న "జీఏ 2" పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "18 పేజిస్" నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు.ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

దర్శకుడు సూర్య ప్రతాప్ పల్నాటి మాట్లాడుతూ...
అందరికి నమస్కారం, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పాలి. నా కుమారి 21ఎఫ్ సినిమాను వచ్చి బ్లెస్ చేసారు. ఇప్పుడు మా 18 పేజెస్ సినిమాను బ్లెస్ చేయడానికి వచ్చిన ఐకాన్ స్టార్ కి థాంక్యూ సర్. ఇక్కడ లేని నా ఫ్యామిలీకి కృతజ్ఞతలు. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి సుకుమార్ అన్నయ్య కారణం. సుకుమార్ గారు ఒక్కరికి సంబంధించిన వ్యక్తి కాదు మా టీం అందరికి సంబంధించిన వ్యక్తి. అన్నయ్య నాకు అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అన్నయ్య మన టీం అందరి తరుపునుంచి థాంక్యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, అలానే బన్ని వాసు అన్నయ్య కి థాంక్యూ. నేను ఈ సినిమా నేను చాలా ఈజీ గా చేసేసా దానికి కారణం బన్నీవాసు అన్న అని చెబుతూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, టెక్నీకల్ డిపార్ట్మెంట్స్ , ప్రొడక్షన్ టీం ను పరిచయం చేసారు.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ...
అందరికి నమస్కారం, ఈ సభాముఖంగా మా "జీఎఫ్ డి" టీం అందరికి కృతజ్ఞతలు. ప్రతి సినిమా నాకు 5% నేర్పిస్తే ఈ సినిమా 25% నేర్పించింది. నిఖిల్ గారు చాలా థాంక్యూ ఎప్పుడు షూటింగ్ అన్న వచ్చేసేవారు, అలానే అనుపమ గారు కూడా. సుక్కు నా లైఫ్ లోకి ఎప్పుడు వచ్చిన మంచిగా డబ్బులు వస్తాయి. నాకు ఇద్దరు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. నా లైఫ్ లో బన్ని 100% అయితే సుకుమార్ గారు 75% దిల్ రాజు గారు 25% ఇవన్నీ కలిపితే మా అరవింద్ గారు. గోపి సుందర్ తన మ్యూజిక్ తో మేజిక్ చేస్తాడు. బన్ని గారు గురించి ఏమి మాట్లాడిన తక్కువే అవుతుంది ఆయన లేకుండా నా ఫంక్షన్ జరగదు. థాంక్యూ సో మచ్.

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ...
నాకు ఇది సర్రియల్ మూమెంట్, నాకు ఆర్య సినిమా చాలా ఇష్టం. సో ఇక్కడ సుకుమార్, బన్నీ ఆర్య లో ఒక పార్ట్ అయినా సూర్యప్రతాప్ గారిది ఇక్కడ కూర్చోవడం నేను ఊహించలేదు. సుకుమార్ గారు నందిని కేరక్టర్ ను నాకు రాసినందుకు థాంక్యూ. ఈ సినిమా డిసెంబర్ 23 న రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి థాంక్యూ. బన్ని నువ్వు రావడం సహజం నేను థాంక్స్ చెప్పడం అంత బాగోదు.

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...
ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్న మీడియాకి , మీమర్స్ చాలా థాంక్యూ. ఈ సినిమాను ఓటిటి లో అప్పుడే రిలీజ్ చెయ్యము. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, థియేటర్ కి వచ్చి సినిమా చూడండి. సుకుమార్ గారు ఒక గొప్ప ఆలోచన మీకు వచ్చి ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో తియ్యాలి అని మీకు అనిపించి మా బన్నివాసు తో ఈ సినిమా తీసినందుకు సభాముఖంగా కృతజ్ఞతలు చెబుతున్నాను.

హీరో నిఖిల్ మాట్లాడుతూ....
ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకు థాంక్యూ, మా సినిమాను బాగా ప్రోమోట్ చేసారు. నా కార్తికేయ 2 ను కూడా ప్రోమోట్ చేసి మంచి సక్సెస్ చేసారు. రాజమౌళి గారు , సుకుమార్ గారు వేసిన రోడ్ లో మా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళాం. నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. 2020 లో మా నాన్నగారిని కోల్పోయాను, అక్కడికి అల్లు అరవింద్ గారు వచ్చారు.

ఆయన ఒక ఫాదర్ ఫిగర్ ఆయన చెప్పిన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. బన్ని వాసు గారికి థాంక్యూ. సూర్యప్రతాప్ గారు ఒక చిన్న పాపల ఈ సినిమాను దాచారు. సుకుమార్ తీసిన సినిమాలు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన రాసిన పాత్రలో కనిపించడం నా అదృష్టం. గెట్ రెడీ ఫర్ డిసంబర్ 23. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే ఈ సినిమా రిజల్ట్ నాకు తెలుసు. థాంక్యూ సో మచ్ ఎవ్రీబడి.

పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..
తండ్రి సమానులైన అరవింద్ గారికి కృతజ్ఞతలు, గీతా ఆర్ట్స్ లో అడుగుపెట్టి మీ ఎదురుగా కూర్చోవడమే గొప్ప విషయం అనుకున్నప్పుడు, ఇలా నా ప్రొడక్షన్ నేమ్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది. నేను ప్రొడ్యూసర్ అవుదామని జగడం అప్పుడే అనుకున్న, నేను హ్యాపీడేస్ సినిమా అప్పుడు నిఖిల్ ను పిలిచి 1 ల్యాక్ అడ్వాన్స్ ఇచ్చాను. నాకు అప్పుడే సక్సెస్ అవుతాడు అని అర్ధమైంది. నా జీవితంలో జరిగిన ప్రతి పరిస్థితిలో నాకు బన్నీవాసు తోడుగా ఉన్నాడు. తమ్ముడు ప్రతాప్ నా ప్రతికథలోని భాగమే. నేను ఒక చిన్న లైన్ చెబితే మొత్తం వాడే రాసుకుని నాకు క్రెడిట్ ఇస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం ప్రతాప్. పాటల రచయిత శ్రీమణి ను నేను పరిచయం చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతుంటాను. అనుపమ నా రంగస్థలం చెయ్యాల్సింది, కానీ కొన్ని కారణాలు వలన చెయ్యలేదు, కానీ ఖచ్చితంగా కలిసి పని చేస్తాం. నా రైటింగ్ లో వచ్చిన ప్రతి సినిమాకి బన్ని వచ్చినందుకు థాంక్యూ. ఈ సినిమా రషెష్ నచ్చి రత్నవేలు వచ్చి కొన్ని షాట్స్ చేసారు. థాంక్యూ రత్నవేలు. పుష్ప కథ కూడా నేను బన్నికి చెప్పలేదు. సినిమా చేద్దాం అంటే చేద్దాం, థాంక్యూ డార్లింగ్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ...
ఈ ఫంక్షన్ కి వచ్చిన మీడియా వారికీ, నిఖిల్ ఫ్యాన్స్ కి అనుపమ ఫ్యాన్స్ కి అలానే నా ఆర్మీకి థాంక్యూ. నా ఫెవరెట్ పీపుల్ ఈ సినిమా చేస్తున్నారు. నేనెప్పుడూ అనుకుంటాను, సుకుమార్ లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు థాంక్యూ సో మచ్ డార్లింగ్.

నా క్లోజ్ పర్సన్ వాసు, వాసు నాకు ఎంత క్లోజ్ అంటే వాసు పేరు లో కూడా నా పేరు ఉంటుంది. మా నాన్నగారు నా సొంత ఓటిటి ఛానల్ ఉన్న ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చెయ్యాలి సపోర్ట్ చేస్తున్న సినిమా మీద లవ్ ప్రొడ్యూసర్ కి రెస్పెక్ట్. గోపి గారు మ్యూజిక్ చాలా బాగుంది, మనం త్వరలో కలిసి పనిచెయ్యాలనుకుంటున్నా,ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అల్ ది బెస్ట్. ప్రతాప్ ను ఆర్య సినిమా నుంచి చూస్తున్న ఇస్తే మంచి సినిమానే ఇవ్వాలి అని వెయిట్ చేసి మరి సినిమా చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. కార్తికేయ తో హిట్ కొట్టిన నిఖిల్ కి కంగ్రాట్స్. నిఖిల్ మంచి కాన్సప్ట్ సినిమాలు చేస్తాడు. అలానే నిఖిల్ చాలా పుస్తకాలు చదువుతాడు అది ఒక యాక్టర్ కి ఉండాల్సిన మంచి క్వాలిటీ. ఈ సినిమా మూడేళ్లు తరువాత రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుంది. ఈ సినిమాను ఖచ్చితంగా చూడండి. అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి థాంక్యూ సో మచ్.


Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved