18 December 2018
Hyderabad
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్,రాజా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000'. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపొందింది. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తొలి టికెట్‌ను రామ్‌చరణ్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా...
మెగాపవర్ స్టార్ రాంచరణ్ మాట్లాడుతూ - ''ఏడాదికి ఓ సినిమా చేస్తే గొప్ప. రెండు సినిమాలు చేస్తే అదృష్టం. మా అందరికీ రెండు సినిమాలు చేయాలనే ఉంటుంది. ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆనందం మా సినిమా కన్నా ఆనందంగా ఉంటుంది. వరుణ్ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాడు. వరుణ్‌పైన ఉన్న ప్రేమకన్నా ట్రైలర్ చూసిన తర్వాత ఇంత మంచి ట్రైలర్ చూసిన అభిమానం. గౌరవంతో ఈ ఫంక్షన్‌కి వచ్చాను. ఈ మధ్య కాలంతో ఇంత మంచి ట్రైలర్‌ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. మంచి విజనరీతో గ్రేట్ టీం ప్యాషనేట్‌గా చేసిన సినిమాగా నాకు అనిపించింది. ఇంత మంచి సినిమాను మాకు ఇస్తున్నందుకు ఎంటైర్‌టీంకు థాంక్స్. జ్ఞానశేఖర్‌గారి వర్క్‌ను ఎప్పటికీ ఇష్టపడతాను. మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్‌కి అభినందనలు. కంచె తర్వాత రాజీవ్, క్రిష్ చేసిన సినిమాకు రావడం ఆనందంగా ఉంది. ఓ తెలుగు నిర్మాతలుగా వారు ఇలాంటి డేరింగ్ సినిమా చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. రంగస్థలం సినిమాకు పనిచేసిన రామకృష్ణ, మోనికగారికి నా కృతజ్ఞతలు. మిగతా టెక్నీషియన్స్‌కి అందరికీ థాంక్స్. సంకల్ప్ కటౌట్‌కి, విజన్‌కి సంబంధం లేదు. మనిషి కన్నా గొప్పది ఆలోచన. అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఉన్నతస్థాయిలో ఉంటారనేది నా నమ్మకం. అలాంటి గ్రేట్ ఆలోచనలున్న మన దర్శకుల్లో రాజమౌళిగారు కావచ్చు.. సుకుమార్‌గారు కావచ్చు, క్రిష్‌గారు కావచ్చు..రేపు వీళ్లందరితో పాటు, వీళ్ల కన్నా గొప్ప స్థాయిలో రావాలని సంకల్ప్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. లావణ్య, అదితి చాలా చక్కగా నటించారు.వారికి నా అభినందనలు. వరుణ్ ఎప్పుడూ సర్‌ప్రైజ్ చేస్తువచ్చాడు. కొన్నిసార్లు వరుణ్ కోసం నేను ఆనందపడ్డాను. తను చేసిన కొన్ని సినిమాలు చూసి అసూయ, ఈర్ష్య పడ్డాను. ఈ సినిమా చూసి కూడా తనపై నాకు ఈర్షపడ్డాను. ఎందుకంటే చాలా అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు మన దగ్గరకి రావు. తన డేడికేషన్, ఆలోచనా తీరుతో ఇలాంటి డిఫరెంట్ సినిమాలను చేస్తాడని నమ్ముతున్నాను. డిసెంబర్ 21న మన మెగాభిమానులు గర్వపడే సినిమా. రెగ్యులర్ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవుతుందని కోరుకుంటున్నాను. మనం చాలా స్పీచ్‌లు చూశాను. మొన్ననే బాబాయ్ (పవన్‌కల్యాణ్) చెప్పిన మాటలు గుండెల్లోకి దూసుకెళ్లిపోయాయి. ప్రతిరోజూ భయంతో మన ఆలోచనలను ఆపేసే ఒక పని చేసి విజయం సాధించాలని చెప్పిన మాటలు చాలా గట్టిగా అనిపించాయి. ఆయన చెప్పాడని కాదు.. భావాన్ని నిదర్శనంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అన్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ''మా చిట్టిబాబు.. చిట్టి అన్నయ్య ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. థాంక్స్ అన్న.. ఏదైనా కొత్త సినిమా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఆ సమయంలో సంకల్ప్ కథ చెప్పగానే మోటివేట్ అయ్యాను. ప్రతివారం మన దగ్గరకు చాలా సినిమాలు వస్తాయి. కానీ అంతరిక్షంలాంటి సినిమా రేర్‌గా వస్తుంది. లావణ్య, అదితి, అవసరాల శ్రీనివాస్, రాజా, సత్య సహా అందరికీ థాంక్స్. ఇలాంటి సినిమామాకు టీం వర్క్ చాలా అవసరం. మా టెక్నికల్ టీం విషయానికి వస్తే ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనికగారికి, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ బాబాగారికి, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్, సీజీ వర్క్ చేసిన రాజీవ్ సహా పేరు పేరునా థాంక్స్. ఇంత అద్భుతమైన సినిమాలో ట్రావెల్ చేసిన అందరికీ థాంక్స్. ఫస్ట్ షాట్ నుండి ఎక్కడా డీవియేట్ లేకుండా సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులు కొత్త సినిమాలను ఆదరిస్తున్నారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చరణ్ అన్న నా వెనుక ఉంటే చిరంజీవిగారు, కల్యాణ్‌బాబాయ్ నా వెనకనే ఉన్నట్లుంది. తను నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇలాంటి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారా? అనుకుని చరణ్ అన్న దగ్గరకు వెళ్లి అడిగాను. నా కొంచెం భయంగా ఉందని అంటే కథ, డైరెక్టరే కరెక్ట్. ఈ సినిమాను నువ్వు చేస్తే బావుంటుందని ఎంకరేజ్ చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత నేనొక భారతీయుడ్ని అని అందరూ గర్వపడతారు. తెలుగువాడినని గర్వపడతారు. ఇలాంటి సినిమా చేసినందుకు మెగాభిమానిగా అందరూ కచ్చితంగా గర్వపడతారు. కాంపీటీషన్ అని కాదు కానీ హెల్దీ కాంపీటేషన్ అని చెబుతాను. మా చరణ్ అన్న బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్‌ను నేను అన్న అనే పిలుస్తాను. ఆయన నటించిన 'పడి పడి లేచె మనసు' సినిమా ఈ 21నే విడుదలవుతుంది. రెండు సినిమాలను ఆదరించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
చిత్ర సమర్పకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ - ''సంకల్ప్ తెలుగు సినిమా దర్శకుడైనందుకు గర్వంగా ఉంది. తను మంచి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడు. తెలుగు దర్శకుడిగా, నిర్మాతగా నేను, రాజీవ్ గర్వంగా ఫీల్ అవుతున్నాం. డిసెంబర్ 21న తెలుగు ప్రేక్షకులు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. మన తెలుగు సినిమా అంతరిక్షం అని చెప్పుకోవడానికి గర్వపడతాం. సినిమా చూశాను. వరుణ్‌తేజ్ ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నందుకు థాంక్స్. చరణ్ రంగస్థలం వంటి డిఫరెంట్ మూవీని చేసినట్లు వరుణ్ కంచె, అంతరిక్షం సినిమాలు చేశాడు. ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే, చాలా మంచి కథలు క్రియేట్ అవుతాయి. లావణ్య, అదితి చాలా చక్కగా యాక్ట్ చేశారు. జ్ఞానశేఖర్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజీవ్ విజువల్స్ చాలా గొప్పగా ఉన్నాయి. ప్రశాంత్ మ్యూజిక్ అన్నీ విజన్‌ను సపోర్ట్ చేశాయి. మా ఎంటైర్ టీంను రాజీవ్ రెడ్డి ముందుండి నడిపించారు. డిసెంబర్ 21న సినిమా చూసి అందరూ గర్వంగా తలెత్తి చెప్పుకునే సినిమా అవుతుంది'' అన్నారు.
చిత్ర దర్శకుడు సంకల్ప్ మాట్లాడుతూ - ''నేను డైరెక్ట్ చేసిన సినిమా గురించి నేను మాట్లాడటం కన్నా.. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడితే బావుంటుంది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అందరికీ సినిమా చూపించాలనిపిస్తుంది. పాటల రచయిత అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ - ''సీతారామశాస్త్రిగారితో కలిసి పాటలు రాయడాన్ని ఎప్పుడూ ఇష్టపడతాను'' అన్నారు.
సీతారామశాస్త్రి మాట్లాడుతూ - ''ఘాజి, అంతరిక్షం వంటి సినిమాలతో తెలుగు సినిమా కొత్త దారిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సినిమా చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చిన దర్శకుడు సంకల్ప్, క్రిష్‌కి అభినందనలు'' అన్నారు.
రాజా మాట్లాడుతూ - ''మా టెక్నికల్ టీంకు థాంక్స్. డైలాగ్ రైటర్ కిట్టు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ సహా అందరికీ థాంక్స్. ఇంత వరకు తెలుగు సినిమాకు అంతరిక్షం ఎలా ఉంటుందో తెలియదు. కానీ తెలుగు సినిమా అంటే ఇలాగే ఉంటుందనే బెంచ్ మార్కుని ఈ సినిమాతో క్రియేట్ చేసింది మా ఎంటైర్ టీం. అందరూ ఎఫర్ట్ పెట్టి, రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశాం. ప్యాషన్‌తో, విజన్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్‌కి థాంక్స్. అలాగే ఇలాంటి సినిమాను బ్యాక్ చేయడానికి రాజీవ్ రెడ్డిగారు, క్రిష్‌గారు తమ వంతు సపోర్ట్ అందించారు. వరుణ్ చాలా మంచి స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు. తనకి అభినందనలు. ఇలాంటి టీంతో పనిచేసినందుకు గర్వంగా ఉంది'' అన్నారు. సత్యదేవ్ మాట్లాడుతూ - ''సంకల్ప్‌తో పనిచేయడం గౌరవంగా ఉంది. ఘాజి తర్వాత తన దర్శకత్వంలో చేస్తోన్న సినిమా ఇది. క్రిష్, రాజీవ్‌గారు మా టీంకు ఎంతగానో ఇన్‌స్పిరేషన్ ఇచ్చారు. అలాగే వరుణ్ మా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తను హాలీవుడ్ సినిమాలో నటించేంత కెపబుల్ ఉన్న వ్యక్తి. జ్ఞానశేఖర్‌గారి విజువల్స్‌తో సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఎంత కష్టపడ్డామో అంతే మంచి ఔట్‌పుట్ వచ్చింది. కిట్టు, జిజూ, ప్రశాంత్ సహా ఎంటైర్ టీంకు అభినందనలు'' అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ, మోనిక మాట్లాడుతూ - ''మెగా ఫ్యామిలీలో మేం చేసిన మూడో సినిమా. రంగస్థలం తర్వాత మేం చేసిన మరో విభిన్నమైన చిత్రమిది. కెమెరామెన్ జ్ఞానశేఖర్, మ్యూజిక్ ప్రశాంత్, కిట్టు సహా ఎంటైర్ టీం ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సినిమాలకు పనిచేసినప్పుడు ఆనందంగా ఉంది'' అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారి మాట్లాడుతూ - ''అనంత్ శ్రీరాంగారు చాలా మంచి సాహిత్యం రాశారు. కిట్టు వల్లే నాకు ఈ సినిమాలో పనిచేసే అవకాశం వచ్చింది. సపోర్ట్ ఇచ్చిన అందరికీ థాంక్స్'' అన్నారు.
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ''అంతరిక్షంలాంటి మూవీస్ రేర్‌గా వస్తాయి. ఈ మూవీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. పార్వతి అనే పాత్రలో నటించాను. అందరికీ నచ్చే పాత్ర. సంకల్ప్ రెడ్డిగారికి థాంక్స్. వరుణ్ తేజ్‌తో మిస్టర్ తర్వాత మళ్లీ నటించాను. అదితి సినిమాలో చక్కగా నటించడమే కాదు.. సినిమా కోసం చాలా కష్టపడింది. నిర్మాతలు రాజీవ్, క్రిష్‌గారితో పనిచేయడం హ్యాపీగా ఉంది'' అన్నారు.
అదితిరావ్ హైదరి మాట్లాడుతూ - ''నాపై తెలుగు ప్రేక్షకులకు చూపుతున్న అభిమానికి థాంక్స్. స్పెషల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన సినిమా. అస్ట్రానాయిడ్ పాత్రలో నటించాను. సంకల్ప్, క్రిష్, రాజీవ్, బాబా, కిట్టు, రాజీవ్, వరుణ్‌తేజ్, రాజా, సత్యదేవ్ సహా ఎంటైర్‌టీంకు థాంక్స్'' అన్నారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న అతిథులు చిత్ర యూనిట్‌ను అభినందించారు.