pizza
Bhaje Vaayu Vegam pre release event
"Bhaje Vaayu Vegam" will definitely entertain the audience, Kartikeya will become a big star - Hero Sharwanand at the pre-release event
"భజే వాయు వేగం" తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది, కార్తికేయ పెద్ద స్టార్ అవుతారు - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 May 2024
Hyderabad

...

Presented by prestigious production company UV Creations, the movie "Bhaje Vaayu Vegam" starring hero Kartikeya Gummakonda is under the banner of UV Concepts. Iswarya Menon is playing the heroine. Rahul Tyson of Happy Days fame plays the pivotal role. Director Prashant Reddy is making this film with an emotional action thriller story. Ajay Kumar Raju.P. Acting as co-producer. The movie "Bhaje Vaayu Vegam" is getting a UA certificate from the censor and is coming for a world wide grand theatrical release tomorrow. Dheeraj Mogilineni Entertainments is releasing the film across the country. The pre-release event of this movie was held in Hyderabad. In this program

Actor Tanikella Bharani said - I was given a good character in the movie "Bhaje Vaayu Vegam". The background of this movie is the yearning of two sons for a father in rural Telangana. After many days I played a very important role in the story. Thanks to director Prashanth and UV company for giving him the opportunity in the movie "Bhaje Vaayu Vegam". Hero Kartikeya is a humble man. Mistakes are natural to anyone but personality should not change. All the best to entire team.

Dialogue writer Madhu Srinivas says - Hanuman does not know his power. We do not know our power. That's why we get scared when there is any problem. In the movie "Bhaje Vaayu Vegam" the hero is also unaware of his own power. But when there is a problem, he fights with villains who are stronger than him. I am happy to be a part of this film. Thanks to Director Prashant, Hero Karthikeya and UV Banner.

Editor Satya G said- Prashanth worked in the direction department and I worked in the editing department for Run Raja Run movie. He is happy to work as the director and I as the editor of the movie "Bhaje Vaayu Vegam". I am proud to have got the opportunity to do a movie in UV company.

Lyric writer Ramajogayya Sastry said - When you write a small song in the movie Jathi Ratnalu, you will become very young. Now the song set "Bhaje Vaayu Vegam" is also getting such a good name. There is a positiveness in the title of the movie "Bhaje Vaayu Vegam". They say people are not coming to the theaters lately. I want this movie to quench the thirst of the audience to watch a good movie.

Actor Naga Mahesh said - I got an opportunity to act with my teacher Tanikella Bharani in the movie "Bhaje Vaayu Vegam". He will be seen in the film in a villainous role. I want this movie to be successful.

Actor Krishna Chaitanya said - He did a good character in the movie "Bhaje Vaayu Vegam". While acting in this movie, Kartikeya's performance was like that. He performed so well. Our director Prashanth and the rest of the team should give good success to this movie Kartikeya.

Actor Sudarshan said - My first film was Run Raja Run. Prashant worked for that movie. Now he is turning director with the movie "Bhaje Vaayu Vegam". Saying all the best to him. Karthikeya also wants to be this movie a big hit.

Kapil Kumar who gave the BGM said - Every frame of the movie "Bhaje Vaayu Vegam" is perfect. The director took it like that, the editing was so good. The performances of the artists are impressive. That's why I was able to do so much BGM for the movie "Bhaje Vaayu Vegam". Said.

Director Merlapaka Gandhi said - Prashant used to ask if he had a good title. He gave a good title to his movie like "Bhaje Vaayu Vegam". Prashant's life will change on this 31st. Let's have a good party. Kartikeya's difficulty is evident in every frame of the trailer. My best wishes to Karthikeya and heroine Aishwarya. UV company is the reason why I came to this event. I want this movie to give good success to Vamsi, Pramod and Vicky Anna. Said.

Director Clax said - Kartikeya became like a brother after doing the movie Bedurulanka. Wish him big success with "Bhaje Vaayu Vegam". Prashanth is my friend. We play cricket. I hope his first movie will be a super hit.

Heroine Iswarya Menon said - Thanks to hero Sharwanand for making our event more special by coming to the pre-release event of "Bhaje Vaayu Vegam". I am happy to do this film in UV company. Thanks to Vicky, Pramod and Vamsi. Kartikeya was very easy to work with. He is a good costar. Kartikeya has many lady fans. Hope their number will increase with this movie. Director Prashant wants to make this movie wonders.

Director Prashant Reddy said - Mahesh Babu, Chiranjeevi and Prabhas supported our movie "Bhaje Vaayu Vegam". Now Sharwanand has come. I feel very special that Sharwa is coming as a guest to our event. I worked for Run Raja Run movie as assistant director. Rahul Tyson played a key role in the movie "Bhaje Vaayu Vegam". He did not come here today. Rahul impresses with his performance in this movie. Thanks to our heroine Aishwarya. His visuals are not in the trailer. But Iswarya is understanding and supportive. She is not shown in the trailer as the story will not be revealed. No matter who is in the movie, without Kartikeya, this movie would not have happened. Thanks to UV company for giving me the opportunity as a director. Thanks to Merlapaka Gandhi Anna and other guests who came here. Tomorrow our movie "Bhaje Vaayu Vegam" is releasing. Tomorrow the audience will know what we have done. Thanks to all my team who are very supportive in making. He will speak at events organized next to this film.

Director Vashishta said - "Bhaje Vaayu Vegam" movie should go to the audience as fast as it is in the title. Kartikeya is holding a bat in this poster. You have to hit box office six. Hi to Vicky Anna from UV, Sharwa who came as a guest and the rest of the team. Congratulations, all the best for "Bhaje Vaayu Vegam" to be a big hit.

Hero Kartikeya said - Mahesh Babu, Chiranjeevi and Prabhas have supported our movie "Bhaje Vaayu Vegam". I thank them. Today, Sharwanand came as a guest to our pre-release event. Thanking him. I feel lucky to do a film under UV banner. Any hero who gets a phone call from this organization will feel happy. This is an organization that gives opportunities to stars as well as young heroes. As a star is respected in this company, so is a new hero. That respect is enough for us to work happily. Thanks to Vicky, Vamsi and Pramod. I came to the industry as a hero after seeing many star heroes. I wanted to have the same values and personality that those star heroes taught in their movies. Ajay gave me good success with RX 100 movie. After that some people said that I was not successful. However, I respect every director who has done a film with me. I have to do the film I want, but waiting, the destination is far away. At such a time Prashant came up with a story that had the elements I wanted. Same as "Bhaje Vaayu Vegam". He took my finger and led me forward. Thanks to Prashanth. All the team members in this movie worked as a team without caring about their work and this is our movie. Heroine Iswarya Menon has supported our film a lot. If you see the trailer of "Bhaje Vaayu Vegam" and think it is routine, if you think routine only if there are emotions in the story, then we are going backwards as a society. A movie with emotions and values should be shown to every generation audience. Come to the movie "Bhaje Vaayu Vegam" and you will get value for your time and money.

Hero Sharwanand said - I did not come as a guest to the pre-release event of the movie "Bhaje Vaayu Vegam". I came like a family member for UV. If someone makes a film in UV, they become like a family member. I have worked with many people on this stage. I also worked with the people in the "Bhaje Vayu Vegam" team for Run Raja Run. It should be said that the hero director of this movie is Prashanth. Prashanth was always a traveler called Me. He writes the same stories. Sujeeth thinks on the entertainment side. I just thought that Prashant would be a good director. "Bhaje Vaayu Vegam" will definitely be a good movie. Prashanth and UV have done this movie with great confidence. This movie should be a big hit. Now Kartikeya's emotional doubts came to me five years ago. It is natural for a hero to have doubts like whether the films we do on a stage are right, whether our choices will work out, whether we will stay here or leave. But if you believe in the way and make stories that you believe in, you will surely succeed. As I say, Kartikeya stays here. He will become a superstar. Kartikeya can do all genres of mass, action, emotion, comedy. Kartikeya is an all-rounder. Don't you have any doubts. Let's work hard. No one can stop the win. Even though I have been in the industry for twenty years. "Bhaje Vaayu Vegam" is hitting the theaters tomorrow. All the best to the team.

Actors - Kartikeya Gummakonda, Iswarya Menon, Rahul Tyson, Tanikella Bharani, Ravi Shankar, Sarath Lohitaswa etc.

Technical Team-
Dialogues by: Madhu Srinivas
Art: Gandhi Nadikudikar
Editor: Satya G
Cinematography: RD Rajasekhar
Music (Songs) - Radhan
Background Score - Kapil Kumar
PRO - GSK Media (Suresh-Sreenivas)
Co Producer - Ajay Kumar Raju.P
Producer: UV Concepts
Director: Prashant Reddy Chandrapu

"భజే వాయు వేగం" తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది, కార్తికేయ పెద్ద స్టార్ అవుతారు - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొంది రేపు వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది "భజే వాయు వేగం" సినిమా. ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తెలంగాణ పల్లెలోని ఓ తండ్రి కోసం ఇద్దరు కొడుకులు పడే ఆరాటం ఈ సినిమాకు నేపథ్యం. చాలా రోజుల తర్వాత కథలో వెరీ ఇంపార్టెంట్ రోల్ చేశాను. "భజే వాయు వేగం" సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్, యూవీ సంస్థకు కృతజ్ఞతలు. హీరో కార్తికేయ వినయం ఉన్న వ్యక్తి. జయాపజయాలు ఎవరికైనా సహజం కానీ వ్యక్తిత్వం మాత్రం మారకూడదు. కార్తికేయను ఆయన వ్యక్తిత్వమే కాపాడుతుందని భావిస్తున్నా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ మధు శ్రీనివాస్ మాట్లాడుతూ - హనుమంతుడికి తన శక్తి తనకు తెలియనట్లు. మనకు మన శక్తి తెలియదు. అందుకే ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడతాం. "భజే వాయు వేగం" సినిమాలో హీరో కూడా అంతే తన శక్తి తనకు తెలియదు. కానీ సమస్య వచ్చినప్పుడు తనకన్నా బలవంతులైన విలన్స్ తో పోరాటం చేస్తాడు. ఈ సినిమాలో నేను భాగమవడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, హీరో కార్తికేయ, యూవీ బ్యానర్ కు థ్యాంక్స్. అన్నారు.

ఎడిటర్ సత్య జి మాట్లాడుతూ- రన్ రాజా రన్ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ప్రశాంత్, ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో నేను పనిచేశాం. "భజే వాయు వేగం" సినిమాకు దర్శకుడిగా తను, ఎడిటర్ గా నేను వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. యూవీ సంస్థలో మూవీ చేసే అవకాశం వచ్చినందుకు గర్వపడపడుతున్నా. అన్నారు.

లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ - జాతిరత్నాలు సినిమాలో చిట్టి పాట రాసినప్పుడు మీరు బాగా యూత్ అయి పోయారే అని అన్నారు. ఇప్పుడు "భజే వాయు వేగం" సెట్టయ్యిందే పాటకు కూడా అలాంటి మంచి పేరు వస్తోంది. "భజే వాయు వేగం" సినిమా టైటిల్ లోనే ఒక పాజిటివ్ నెస్ ఉంది. ఈ మధ్య థియేటర్స్ కు జనం రావడం లేదు అంటున్నారు. మంచి సినిమా చూడాలనే ప్రేక్షకుల కరువును ఈ సినిమా తీర్చాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ నాగ మహేశ్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాలో మా గురువు తనికెళ్ల భరణి గారితో కలిసి నటించే అవకాశం వచ్చింది. విలన్ రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఈ సినిమా విజయపథంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

యాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమాలో మంచి క్యారెక్టర్ చేశా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కార్తికేయ పర్ ఫార్మెన్స్ అలా చూస్తూ ఉండిపోయా. అంత బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఈ సినిమా కార్తికేయకు మా డైరెక్టర్ ప్రశాంత్ మిగతా టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలి. అన్నారు.

యాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ - నా మొదటి సినిమా రన్ రాజా రన్. ఆ సినిమాకు ప్రశాంత్ వర్క్ చేశాడు. ఇప్పుడు "భజే వాయు వేగం" మూవీతో డైరెక్టర్ గా మారుతున్నాడు. ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మా కార్తికేయకు కూడా ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

బీజీఎం ఇచ్చిన కపిల్ కుమార్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా ప్రతి ఫ్రేమ్ పర్పెక్ట్ గా ఉంటుంది. డైరెక్టర్ అలా తీశారు, ఎడిటింగ్ అంత బాగా వచ్చింది. ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు ఇంప్రెసివ్ గా ఉంటాయి. అందుకే ఇంతమంచి బీజీఎం "భజే వాయు వేగం" సినిమాకు చేయగలిగాను. అన్నారు.

డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ - ప్రశాంత్ మంచి టైటిల్ ఉంటే చెప్పన్నా అని అడిగేవాడు. తన సినిమాకు "భజే వాయు వేగం" వంటి మంచి టైటిల్ పెట్టుకున్నాడు. ఈ 31తో ప్రశాంత్ లైఫ్ మారిపోతుంది. మంచి పార్టీ చేసుకుందాం. కార్తికేయ కష్టం ఈ సినిమా ట్రైలర్ లోని ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తోంది. కార్తికేయకు, హీరోయిన్ ఐశ్వర్యకు నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. ఈ ఈవెంట్ కు నేను వచ్చేందుకు యూవీ సంస్థ కారణం. ఈ సినిమా వంశీ, ప్రమోద్, విక్కీ అన్నకు మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ క్లాక్స్ మాట్లాడుతూ - బెదురులంక మూవీ చేసిన తర్వాత కార్తికేయ నాకొక బ్రదర్ లా మారారు. "భజే వాయు వేగం" తో ఆయనకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. ప్రశాంత్ నా ఫ్రెండ్. మేము క్రికెట్ ఆడుతుంటాం. ఆయన ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావాలని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మా ఈవెంట్ ను మరింత స్పెషల్ చేసిన హీరో శర్వానంద్ గారికి థ్యాంక్స్. యూవీ సంస్థలో ఈ సినిమాను చేయడం సంతోషంగా ఉంది. విక్కీ, ప్రమోద్, వంశీ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. కార్తికేయతో కలిసి వర్క్ చేయడం ఎంతో సులువు. మంచి కోస్టార్ ఆయన. కార్తికేయకు ఎంతోమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాతో వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని ఆశిస్తున్నా. డైరెక్టర్ ప్రశాంత్ కు ఈ సినిమా వండర్స్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ - మా "భజే వాయు వేగం" సినిమాకు మహేశ్ బాబు గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు సపోర్ట్ చేశారు. ఇప్పుడు శర్వానంద్ గారు వచ్చారు. శర్వా మా ఈవెంట్ కు గెస్ట్ గా రావడం చాలా స్పెషల్ గా ఫీలవుతున్నాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా రన్ రాజా రన్ మూవీకి వర్క్ చేశాను. "భజే వాయు వేగం" సినిమాలో రాహుల్ టైసన్ కీ రోల్ చేశాడు. ఆయన ఇవాళ ఇక్కడికి రాలేదు. ఈ మూవీలో రాహుల్ తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు. మా హీరోయిన్ ఐశ్వర్యకు థ్యాంక్స్. తన విజువల్స్ ట్రైలర్ లో లేవు. కానీ ఐశ్వర్య అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తోంది. కథ రివీల్ కాకుడదని ఆమెను ట్రైలర్ లో చూపించలేదు. సినిమాలో ఎవరు ఉన్నా లేకున్నా కార్తికేయ లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు. నాకు డైరెక్టర్ గా అవకాశం ఇచ్చిన యూవీ సంస్థకు థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన మేర్లపాక గాంధీ అన్నా, ఇతర గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. రేపు మన "భజే వాయు వేగం" సినిమా రిలీజ్ అవుతోంది. మనం ఏం చేశామో రేపు ఆడియెన్స్ కు తెలుస్తుంది. మేకింగ్ లో ఎంతో సపోర్టివ్ గా ఉన్న నా టీమ్ అందిరికీ థ్యాంక్స్. ఈ సినిమాకు నెక్ట్ నిర్వహించే ఈవెంట్స్ లో మాట్లాడుతా. అన్నారు.

డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా టైటిల్ లో ఉన్నంత వేగంగా సినిమా ఆడియెన్స్ లోకి వెళ్లాలి. కార్తికేయ ఈ పోస్టర్ లో బ్యాట్ పట్టుకుని ఉన్నారు. మీరు బాక్సాఫీస్ సిక్సర్ కొట్టాల్సిందే. యూవీ నుంచి విక్కీ అన్నకు, గెస్ట్ గా వచ్చిన శర్వాకు, మిగతా టీమ్ కు హాయ్. "భజే వాయు వేగం" మంచి హిట్ అవ్వాలని కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ - మా "భజే వాయు వేగం" సినిమాకు మహేశ్ బాబు గారు, చిరంజీవి గారు, ప్రభాస్ గారు సపోర్ట్ చేశారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ రోజు మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు శర్వానంద్ గెస్ట్ గా వచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. యూవీ బ్యానర్ లో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సంస్థ నుంచి ఏ హీరోకు ఫోన్ వచ్చినా వాళ్లు హ్యాపీగా ఫీలవుతారు. స్టార్స్ తో పాటు యంగ్ హీరోలకు అవకాశాలు ఇస్తున్న సంస్థ ఇది. ఈ సంస్థలో ఒక స్టార్ ను ఎలా గౌరవిస్తారో, ఒక కొత్త హీరోనూ అలాగే గౌరవిస్తారు. ఆ రెస్పెక్ట్ చాలు మనం సంతోషంగా పనిచేసేందుకు. విక్కీ, వంశీ, ప్రమోద్ గారికి థ్యాంక్స్. ఎంతోమంది స్టార్ హీరోలను చూసి ఇన్స్ పైర్ అయి హీరోగా ఇండస్ట్రీకి వచ్చాను. ఆ స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఎలాంటి విలువలు నేర్పించారో, అవే విలువలు, వ్యక్తిత్వం నాలో ఉండాలనుకున్నాను. ఆర్ఎక్స్ 100 సినిమాతో అజయ్ నాకు మంచి సక్సెస్ ఇచ్చాడు. ఆ తర్వాత నాకు సక్సెస్ లేవని కొందరు అన్నారు. అయినా నాతో సినిమా చేసిన ప్రతి దర్శకుడినీ గౌరవిస్తా. నేను కోరుకున్న సినిమా చేయాలి, వెయిట్ చేస్తున్నా, వెళ్లాల్సిన గమ్యం సుదూరంగా ఉంది. అలాంటి టైమ్ లో ప్రశాంత్ నేను కోరుకున్న అంశాలున్న కథతో వచ్చాడు. అదే "భజే వాయు వేగం". నా వేలు పట్టి ముందుకు నడిపించాడు. ప్రశాంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలోని టీమ్ మెంబర్స్ అంతా తమ పని వరకు చూసుకోకుండా ఇది మన సినిమా అని టీమ్ వర్క్ చేశారు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ మా సినిమాకు ఎంతో సపోర్ట్ చేసింది. "భజే వాయు వేగం" ట్రైలర్ చూసి రొటీన్ గా ఉందని అనుకుంటే, కథలో ఎమోషన్స్ ఉంటేనే రొటీన్ అనుకుంటే మనం ఒక సొసైటీగా వెనక్కు వెల్తున్నట్లు. ప్రతి జెనరేషన్ ఆడియెన్ కు ఎమోషన్స్, వ్యాల్యూస్ ఉన్న ఒక సినిమా చూపించాలి. "భజే వాయు వేగం" సినిమాకు రండి మీ టైమ్, మనీకి వ్యాల్యూ దక్కుతుంది. వందశాతం గ్యారెంటీగా చెబుతున్నా. అన్నారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ - "భజే వాయు వేగం" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేను గెస్ట్ గా రాలేదు. యూవీ ఫ్యామిలీ మెంబర్ లా వచ్చా. యూవీ లో ఎవరైనా ఒక సినిమా చేస్తే వాళ్ల ఫ్యామిలీ మెంబర్ లా మారిపోతారు. ఈ వేదిక మీదున్న చాలా మందితో నేను వర్క్ చేశాను. "భజే వాయు వేగం" టీమ్ లో ఉన్న వాళ్లతో కూడా రన్ రాజా రన్ కు వర్క్ చేశాను. ఈ సినిమాకు హీరో డైరెక్టర్ ప్రశాంత్ అని చెప్పాలి. ప్రశాంత్ ఎప్పుడూ మాస్ మాస్ అనే తిరిగేవాడు. అవే కథలు రాసేవాడు. సుజీత్ ఎంటర్ టైన్ మెంట్ సైడ్ ఆలోచించేవాడు. నేను అప్పుడే అనుకున్నా ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని. "భజే వాయు వేగం" ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. ప్రశాంత్, యూవీ వాళ్లు చాలా నమ్మకంతో ఈ సినిమా చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. ఇప్పుడు కార్తికేయ ఎమోషనల్ గా చెప్పిన డౌట్స్ నాకు ఐదేళ్ల క్రితం వచ్చాయి. హీరోకు ఒక స్టేజ్ లో మనం చేసే సినిమాలు కరెక్టేనా, మన ఛాయిస్ లు వర్కవుట్ అవుతాయా, ఇక్కడ ఉంటామా, వెళ్లిపోదామా లాంటి సందేహాలు రావడం సహజమే. అయితే మీరు నమ్మిన దారిలో, నమ్మిన కథలు చేయండి తప్పకుండా సక్సెస్ అవుతారు. నేను చెబుతున్నా, కార్తికేయ ఇక్కడే ఉంటాడు. సూపర్ స్టార్ అవుతాడు. కార్తికేయ మాస్ , యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్ని జానర్స్ చేయగలడు. కార్తికేయ ఆల్ రౌండర్. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. కష్టపడి పనిచేద్దాం. గెలుపును ఎవరూ ఆపలేరు. నేను అలాగే ఇరవై ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా. రేపు "భజే వాయు వేగం" థియేటర్స్ లోకి వస్తోంది. ఎవర్నీ డిజప్పాయింట్ చేయలేదు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

నటీనటులు - కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-
మాటలు: మధు శ్రీనివాస్
ఆర్ట్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: సత్య జి
సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్
మ్యూజిక్ (పాటలు) - రధన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కపిల్ కుమార్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - అజయ్ కుమార్ రాజు.పి
ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్
దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి చంద్రపు

 

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved