pizza
Chakra Pre Release function
డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ `విశాల్ చ‌క్ర‌`తో డెఫినెట్‌గా జాక్‌పాట్ కొడ‌తారు - యాక్ష‌న్ హీరో విశాల్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


12 February -2021
Hyderabad

Distributors Will Surely Hit Jackpot With 'Vishal Chakra' -- Action Hero Vishal

Action Hero Vishal's latest film is 'Vishal Chakra' directed by MS Anandan. Shraddha Srinath is playing the heroine while Regina Cassandra is doing a crucial role. Vishal is producing this film with high technical values under his Vishal Film Factory banner. This film also marks the 10th collaboration of Hero Vishal and Music Director Yuvan Shankar Raja. The already released trailer and songs created a very good buzz about the film. 'Vishal Chakra' is releasing worldwide on February 19th. On this occasion, a grand pre-release event is held at Prasad Lab in Hyderabad. The big-ticket of 'Vishal Chakra' is unveiled at the event.

Action Hero Vishal said, " I usually invite someone as a chief guest for the event of my film. By watching this event, many of my friends will call me and ask me why I didn't let them know about this event. But, Media is the chief guest for this 'Chakra Grand Pre-release Event'. 'Vishal Chakra' is getting released in theatres this February 19th in Telugu, Tamil, Malayalam, Kannada, and Hindi languages. This is an action thriller with a backdrop of digital crimes. Director MS Anandan did a lot of research and worked hard to make this film. He will definitely have a very bright future. I am very happy to introduce another talented director through our Vishal Film Factory banner. We continue to introduce good directors and technicians in our banner. My brother Yuvan Shankar Raja has given extra-ordinary music and background score. My brother Warangal Sreenu and all the other distributors will surely hit a jackpot with this film. We will meet with happy faces on February 20th. My friends, Hero Ramana, Nanda, helped a lot. Thanks to my elder brother, BA Raju garu. Hee always looks after everything for my films like his own. Many are asking about my straight Telugu film. My straight Telugu film will release for Ugadi next year."

Director MS Anandan said, " Vishal garu brought me to this stage from nowhere. The main reason behind the terrific output of this film is Vishal garu. He provided the finest technicians for a good film directed by a first-timer. This film will be exciting right from the start to the end. All technicians loved the subject and worked creatively for this film. Yuvan Shankar Raja garu has composed superb music and background score. The audience will feel the excitement even after coming out watching the film. I always indebted to Vishal garu for giving me such a great opportunity. I like Telugu cinema and the Telugu language very much. I like Rajamouli garu. I learned Telugu by watching films only."

'Miss India' Director Narendranath said, " I am a unique fan of Vishal garu since 'Pandem Kodi'. He always encourages new content. The trailer shows the passion of Director Anand. The visuals look very grand. I wish this film to become a blockbuster."

Pavan Tej Konidela said, " I am a big fan of Vishal garu. I watched all his movies. This film will also become a very big hit."

Meghana said, " Vishal garu is my favorite actor. He set a trend by doing many content-oriented films. I believe this film too will achieve that mark."

Nizam distributor Warangal Sreenu said, " I told this on many occasions about Vishal anna. He is the most kind-hearted person among many which I have traveled with. This looks like a spicy thriller film and a trendsetting movie going by the trailer. Production and making values look very lavish. The film is releasing worldwide on February 19th. I believe this will score very good openings and stand as the highest grosser in Vishal Anna's movies."

On behalf of ceded distributor Sobhan, Narasimha Sai said, " Vishal garu is an action hero... a mass hero... but for us, he is a superhero. Vishal gari movies always make ceded distributors happy. No matter how much the competition is, Vishal gari films always provided with an ample number of theatres. His films have very good openings. I wish 'Vishal Chakra' to become a superhit."

Action Hero Vishal, Shraddha Srinath, Regina Cassandra, Manobala, Robo Shankar, KR Vijaya, Srushti Dange are the principal cast

Cinematography: Balasubramaniem
Music: Yuvan Shankar raja
Produced by Vishal
Written & Directed by MS Anandan

 

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `విశాల్ చ‌క్ర‌`. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు. ఇది హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న10వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతున్న‌ సంద‌ర్భంగా హైదారాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో `విశాల్ చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`ని నిర్వ‌హించింది చిత్ర యూనిట్‌. ఈ కార్య‌క్ర‌మంలో `విశాల్ చ‌క్ర` మూవీ బిగ్ టికెట్‌ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో..

యాక్ష‌న్ హీరో విశాల్ మాట్లాడుతూ - ``సాధార‌ణంగా నా సినిమా ఈవెంట్ అంటే చీఫ్ గెస్ట్‌ని పిలుస్తాను. ఇప్పుడు ఈ ఈవెంట్‌చూసి కూడా చాలా మంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి మాకు ముందే ఎందుకు చెప్ప‌లేదు అని అడుగుతారు. కాని ఈ `చ‌క్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ఈవెంట్‌`కి మీడియానే చీఫ్ గెస్ట్‌. విశాల్ `చ‌క్ర` సినిమా ఫిబ్ర‌వ‌రి 19న తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ భాష‌ల‌తో పాటు హిందీలో కూడా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. డిజిటల్ క్రైమ్స్ నేప‌థ్యంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఎంఎస్ ఆనంద‌న్ ఎంతో హార్డ్ వ‌ర్క్ చేసి ఈ సినిమా తీశారు. త‌ప్ప‌కుండా ఆయ‌న‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉంటుంది. మా విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రి బ్యాన‌ర్‌లో మ‌రో మంచి డైరెక్ట‌ర్‌ని ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక‌పై కూడా మా బేన‌ర్ ద్వారా మంచి డైరెక్ట‌ర్స్‌ని, టెక్నీషియ‌న్స్ ఇంట్ర‌డ్యూస్ చేస్తాం. నా త‌మ్ముడు యువ‌న్ శంక‌ర్ రాజా ఎక్ట్రార్డిన‌రీ మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నా త‌మ్ముడు వ‌రంగ‌ల్‌ శ్రీ‌ను స‌హా ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్స్ అందరూ ఈ సినిమాతో త‌ప్ప‌కుండా ఒక జాక్ పాట్ కొడ‌తారు. ఫిబ్ర‌వ‌రి20న అంద‌రం హ్యాపీఫేస్‌తో మీట్ అవుతాం. నా స్నేహితులు హీరో ర‌మ‌ణ‌, నంద చాలా హెల్ప్ చేశారు. అలాగే మా అన్న‌య్య బి.ఎ రాజుగారికి ద‌న్య‌వాదాలు. నా ప్ర‌తి సినిమాకి ఆయ‌న సొంత‌ సినిమాలాగా అన్నిద‌గ్గ‌రుండి చూసుకుంటారు. అలాగే చాలా మంది అడుగుతున్నారుస్ట్ర‌‌యిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు అని.. త‌ప్ప‌కుండా నెక్ట్స్ ఇయ‌ర్ ఉగాదికి నా స్ట్ర‌యిట్ తెలుగు సినిమా విడుద‌ల‌వుతుంది`` అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు ఎంఎస్ ఆనంద‌న్ మాట్లాడుతూ - ``ఎక్క‌డో ఉన్న న‌న్ను ఈ స్థాయికి విశాల్‌గారు తీసుకువ‌చ్చారు. ఈ సినిమా ఇంత గొప్ప‌గా వ‌చ్చిందంటే దానికి కార‌ణం విశాల్‌గారే. ఒక మంచి క‌థ‌కి ఎలాంటి టెక్నీషియ‌న్స్ తోడైతే ఒక డైరెక్ట‌ర్‌కి ‌ ఫ‌స్ట్ సినిమా ప్రాప‌ర్‌గా వ‌స్తుందో అలాంటి టెక్నీషియ‌న్స్ ని ఇచ్చారు విశాల్‌గారు. ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కూ ప్ర‌తి సీక్వెన్స్ చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. అంద‌రూ టెక్నీషియ‌న్స్ క‌థ న‌చ్చి ఈ మూవీకి చాలా క్రియేటివ్‌గా వ‌ర్క్ చేశారు. యువ‌న్ శంక‌ర్ రాజా గారు చాలా మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి ఆడియ‌న్ త‌ప్ప‌కుండా ఎగ్జ‌యిటింగ్‌గా ఫీల్ అవుతారు. న‌న్ను, నా క‌థ‌ని న‌మ్మి ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన విశాల్‌గారికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాను. నాకు తెలుగు సినిమా అన్నా.. తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. అలాగే రాజ‌మౌళిగారు అంటే చాలా ఇష్టం. సినిమాలు చూసే తెలుగు నేర్చుకున్నాను`` అన్నారు.

మిస్ ఇండియా ద‌ర్శ‌కుడు న‌రేంద్ర‌నాథ్ మాట్లాడుతూ - ``పందెంకోడి సినిమా నుండి నేను విశాల్ గారికి యూనిక్ ఫ్యాన్‌ని. ఆయ‌న‌ ఎప్పుడూ కొత్త కంటెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తుంటారు. ద‌ర్శ‌కుడు ఆనంద‌న్ ప్యాష‌న్ ఎంటో ట్రైల‌ర్ చూస్తేనే అర్ధం అవుతుంది. విజువ‌ల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సినిమా త‌ప్ప‌కుండా బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

ప‌వ‌న్‌తేజ్ కొణిదెల మాట్లాడుతూ - ``విశాల్‌గారికి నేను చాలా పెద్ద అభిమానిని. ఆయ‌న సినిమాలు అన్ని చూశాను. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

మేఘ‌న మాట్లాడుతూ - ``విశాల్ గారు నా ఫేవ‌రెట్ యాక్ట‌ర్. ఆయ‌న ఎన్నో కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలింస్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా కూడా త‌ప్ప‌కుండా ఆ మార్క్‌ని అందుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను`` అన్నారు.

నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ వ‌రంగ‌ల్ శ్రీ‌ను మాట్లాడుతూ - ``విశాల్ అన్న గురించి నేను చాలా సంద‌ర్భాల్లో చెప్పాను. నేను ట్రావెల్ చేసిన వ్య‌క్తుల్లో క‌ల్మ‌శంలేని వ్య‌క్తి విశాల్ అన్న‌. ట్రైలర్ చూస్తుంటే ఒక స్పైసీ థ్రిల్ల‌ర్ మూవీ అనిపించింది. అలాగే ట్రెండ్ సెట్టింగ్ మూవీ అనిపించింది. ప్రొడ‌క్ష‌న్‌, మేకింగ్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 19న గ్రాండ్‌గా రిలీజ‌వుతుంది. త‌ప్ప‌కుండా విశాల్ అన్నకెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించి హైయెస్ట్ గ్రాస‌ర్‌గా నిలుస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది`` అన్నారు.

సీడెడ్ డిస్ట్రిబ్యూటర్‌ శోభ‌న్ త‌రుపున‌ న‌ర‌సింహ‌సాయి మాట్లాడుతూ - ``విశాల్‌గారు యాక్ష‌న్ హీరో, మాస్ హీరో మాకు మాత్రం సూప‌ర్ హీరో..విశాల్‌గారి సినిమాలంటే సీడెడ్ వ‌ర‌కూ ఎప్పుడూ హ్యాపీనే. ఎంత కాంపిటేష‌న్ ఉన్నా విశాల్ గారి మూవీ అంటే హ్యాపీగా కావాల్సిన‌న్ని థియేట‌ర్స్ ఇస్తారు. త‌ప్ప‌కుండా మంచి ఓపెనింగ్స్ వ‌స్తాయి. సినిమా సూప‌ర్‌హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

యాక్ష‌న్ హీరో విశాల్‌, శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి: బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌, ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.


Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved