pizza
Dorasani pre release function
`దొర‌సాని` ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


7 July 2019
Hyderabad

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’. జులై 12న సినిమా విడుద‌ల‌వుతుంది. ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. దొరసాని జూక్‌ బాక్స్‌ను రాజశేఖర్‌ విడుదల చేశారు. బిగ్‌ టికెట్‌ని విజయ్‌ దేవరకొండ విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ విహారి మాట్లాడుతూ - ``ఈ వేడుక‌కి విజ‌య్ దేవ‌ర‌కొండ రావడం ఆనందంగా ఉంది. ఆనంద్ దేవ‌ర‌కొండతో ప‌నిచేయ‌డం హ్యాపీగా అనిపించింది. శివాత్మిక‌, ఆనంద్ పెర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్‌. వారి న‌ట‌న బాగుడ‌టంతో నాకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డం సుల‌భ‌మైంది. మంచి యూనిట్‌తో ప‌నిచేశాను`` అన్నారు.

వెంక‌ట్ సిద్ధారెడ్డి మాట్లాడుతూ - ``రెండు పంవ‌త్స‌రాల నుండి గ‌మ‌నిస్తూ వ‌స్తే.. తెలుగు సినిమాల్లో ఓ గోల్డెన్ పీరియ‌డ్ అని చెప్పుకోవ‌చ్చు. తెలుగు సినిమా ప్రేక్ష‌కులు కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను ఆద‌రిస్తున్నారు. అలాంటి కోవలో దొర‌సాని సినిమా కూడా నిలుస్తుంది.ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

ప్రొడ్యూస‌ర్స కౌన్సిల్ అధ్య‌క్షుడు సి.క‌ల్యాణ్ మాట్లాడుతూ - ``ఆనంద్ మ‌న ఫ్యామిలీ మెంబ‌ర్‌లా కలిసిపోయే గుణుమున్న వ్య‌క్తి. త‌ను విజ‌య్ కంటే గొప్ప స్థాయికి ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. జీవిత, రాజ‌శేఖ‌ర్ గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మా కుటుంబ స‌భ్యులు. శివాత్మిక‌కు దొర‌సాని రూపంలో మంచి సినిమా దొరికింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. విడుద‌ల కాబోయే చిత్రాల‌న్నింటిలో ఈ చిత్రం టైటిల్‌లాగానే దొర‌సానిలా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇది కేవీఆర్‌ మహేంద్ర, ఆనంద్‌ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌ ఫంక్షన ఇది. సినిమా చేస్తానన్నప్పటి నుంచి నేను ఆనంద్‌తో పెద్దగా మాట్లాడలేదు. వాడి ముందు మాట్లాడాలని నేను ముందుగానే మాట్లాడుతున్నా. నేను పుట్టపర్తి హాస్టల్‌లో చదివాను. నేను నాలుగో తరగతిలో ఉన్నప్పుడు అక్కడ వాడు ఫస్ట్‌ స్టాండర్డ్‌లో జాయిన అయ్యాడు. ఒక రోజు నేను సీరియస్‌గా నోట్స్‌ తీసుకుని క్లాస్లు వింటుంటే, సడనగా ఓ పిల్లగాడు మా డోర్‌ దగ్గరకు వచ్చి నిలుచుండు. వాడు ఏడుస్తూ నా వైపు వేలు పెట్టి చూపించాడు. అప్పుడు వాడి వెనుక వచ్చిన టీజర్‌ ‘వీడి బ్రదర్‌ నాలుగో తరగతిలో ఎవరమ్మా’ అని అడిగింది. నేను భయం భయంగా చూశాను. అప్పుడు ఆ టీచర్‌ ‘సరే ఈ రోజు లంచ పీరియడ్‌ వరకు ఇక్కడ కూర్చో. ఆ తర్వాత క్లాస్‌కి వచ్చెయ్‌’ అని మా టీచర్‌తో చెప్పి, మా వాడిని నా దగ్గర కూర్చోపెట్టారు. వాడు కింద నేలమీద కూర్చుని ఏదో రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడూ నన్ను చూస్తూ ఉండేవాడు. ఆ రోజు అలా వాడు ఏడుస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. అలా లంచ వరకు కూర్చోవాల్సిన వాడు మూడు రోజులు నాతోనే కూర్చున్నాడు. నా దోస్తులందరూ వీడికి దోస్తులయ్యారు. అప్పటి నుంచి నేనేం చేస్తే వాడు అది చేయడం అలవాటైపోయింది. ఆ తర్వాత ఇంజనీరింగ్‌ చదివి యుఎస్‌లో డెలాయిట్‌లో ఉద్యోగం చేశాడు. అలాంటి వాడు ఉద్యోగం మానేసి ఇండియాకు రావడం నాకు నచ్చలేదు. లేదు.. ఇక్కడ నేను పది పనులు చేస్తున్నా, రౌడీస్‌ చూసుకుంటా అని అన్నాడు. సరే రమ్మన్నాను. అలాంటి సమయంలో ఒక రోజు స్ర్కిప్ట్‌ విన్నా, సినిమా చేస్తా అన్నాడు. అది నాకు నచ్చలేదు. ‘అరె యాక్టింగ్‌ మాటలు కాదురా. సడనగా వచ్చి ఎట్ల చేస్తావు. మజాకనుకున్నావా?’ అని అన్నా. కానీ మా వాడు చాలా ఫిక్సయ్యాడు. ఇక నేనేమీ అనగలను. ‘సరే చేసుకో. ఇక నీ సినిమా గురించి నన్ను అడక్కు’ అని అన్నా. ఆ రోజు నుంచి వాడి సినిమా గురించి వాడితో నేనేమీ అడగలేదు. ఇప్పటిదాకా వాడి సినిమా గురించి అడగలేదు. ఎందుకంటే నీళ్లల్లో స్విమ్మింగ్‌ అయినా చేస్తారు. లేకుంటే మునిగిపోతారు. తేలిపోతుంది దెబ్బకి. ఒక సినిమా స్ర్కిప్ట్‌ చేయడం దగ్గరి నుంచి థియేటర్‌కి తీసుకుని వచ్చేవరకు ఎంత కష్టముంటుందో నీకు తెలుస్తుంది అని నేను వదిలేశాను వాడిని. ఆనంద్‌ యు.ఎస్‌.కివెళ్లి జాబ్‌ చేస్తూ ఇంటికి డబ్బులు పంపించి హెల్ప్‌ చేశావ్‌. (విజయ్‌ దేవరకొండ వణుకుతున్న స్వరంతో... ఏడుస్తూ). నువ్వు అలా చేసినందువల్ల నాకు చాలా సాయం జరిగింది. ఇవాళ నేను ఈ స్థానంలో ఉన్నందుకు అది చాలా ఉపయోగపడింది. నాలో ప్రెజర్‌ తీసేసింది. అలాంటి వ్యక్తి అన్నీ వదిలేసి యాక్టింగ్‌ చేస్తానని వచ్చాడు. నేను మాట్లాడలేదు. వాడే ఏదో వాడికి నచ్చినట్టు సేవింగ్స్‌తోనే జిమ్‌లకు వెళ్లాడు. ట్రైనింగ్‌కి వెళ్లాడు. నేను సినిమా చేసుకుంటున్నా. ‘డియర్‌ కామ్రేడ్‌’ కోసం కాకినాడలో ఉన్నా. నా ఫ్రెండ్స్‌ అందరూ ‘ఆనంద్‌ సినిమా చేస్తున్నాడా’ అని అడుగుతుంటే ‘అరె ఆనంద్‌ యాక్టింగ్‌ చేస్తున్నాడా? ఎట్లుంది?’ అని అడిగారు. ‘నాకు తెలియదు బై. వాడే చేసుకుంటున్నాడు ’ అని అన్నా. సినిమా ప్రమోషన్స వరకూ వచ్చింది. తన పూజకి వెళ్లాలనిపించింది. కానీ అపుకున్నా. నీ టీజర్‌ చేయాలని షేర్‌ చేయాలనిపించింది. కానీ అపుకున్నా. చాలా పాటలు నాకు ఇస్టం. షేర్‌ చేయాలనిపించింది. అయినా ఆపుకున్నా. ఎందుకంటే మీరు అబ్యూస్‌ అవ్వడం, ట్రోలింగ్‌ తీసుకోవడం వంటివన్నీ కొత్తవారిగా తెలుసుకోవాలని. అవన్నీ తట్టుకోగలిగితేనే ఇండసీ్ట్రలో సర్వైవ్‌ కాగలరు. నిజంగా అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు నువ్వు తొట్రుపడటం చూశా. తట్టుకుని నిలబడటం చూశా. నీ సినిమాను ప్రమోట్‌ చేసుకోవడాన్నీ గమనించాను. నన్ను ప్రీ రిలీజ్‌కి రమ్మని మూడు, నాలుగు రోజుల క్రితం నిర్మాతలు అడిగారు. ‘నాకు సినిమా చూపించండి’ అని అన్నా. నిన్న చూపిస్తానన్నారు. నాకు నచ్చకపోతే వేరే వాళ్లని పిలిచే టైమ్‌ ఉండదు. ముందు చూపించమన్నా. మొన్న సినిమా చూశా. మహేంద్ర, సందీప్‌ కొరపాటి, శివాత్మిక, ఆనంద్‌.. వీళ్లందరూ కలిసి చేసిన పని చూసి చాలా గర్వపడ్డా. సడనగా వాడు యు.ఎస్‌ నుంచి వచ్చి సినిమా చేస్తానన్నాడు. శివాత్మిక చిన్నపిల్ల. కానీ వాళ్లు చేసింది చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. మహేంద్ర చిన్న డైలాగు కూడా చెప్పకుండా, యాక్టర్లతో ఎన్నో ఎమోషన్స చెప్పించాడు. ఆ పెర్ఫార్మెన్సతో అలా చెప్పించడం చాలా బాగా ఉంది. చిన్న బడ్జెట్‌లో క్లాసిక్‌ లుక్‌ వచ్చేసింది. ప్రశాంత విహారీ సంగీతం చాలా బావుంది. శివాత్మిక ఒన ఆఫ్‌ ద బెస్ట్‌ యాకె్ట్రసెస్‌. ఆ అమ్మాయి సింగిల్‌ టేక్‌ ఉంది పోలీస్‌ స్టేషనలో.. అది చాలా బాగా చేసింది. లోపల ఎంతో ఫీల్‌ అయితేగానీ నువ్వు అంత బాగా చేయలేవు. ఆమె పెర్ఫార్మెన్స సుపీరియర్‌. ఆనంద్‌ గురించి నేను చెప్పను. ఓ అన్నగా గర్వపడుతున్నా. తను పడ్డ కష్టం చూశా. చాలా సర్‌ప్రైజ్‌ అయ్యా. స్ర్కిప్ట్‌ నుంచి, ప్రతిదీ చాలా బావుంది. మహేంద్ర నాకోసం స్ర్కిప్ట్‌ రాస్తున్నాడని తెలిసింది. అది రెడీ కాగానే నేనువింటాను. నా గురువుగారు వినయ్‌వర్మ ఇక్కడున్నారు. ఈ ఇండసీ్ట్ర కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత మిమ్మల్ని (హీరో, హీరోయిన్లను) ప్రేమిస్తారు, ద్వేషిస్తారు. మెచ్చుకుంటారు. తిడుతారు. నా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ డైరక్టర్‌ నాగ్‌ అశ్విన ఇదే విషయాన్ని నాకు చెప్పాడు. నేనప్పుడు లో ఫేస్‌లో ఉన్నా. అది నాకు వర్క్‌ అయింది. మీకు కూడా అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా వెనుక చాలా మంది మంచి వారున్నారు. ఈ సినిమా ప్యూర్‌ స్టోరీ టెల్లింగ్‌. నిజ జీవితాల మీద బేస్‌ అయింది. అందుకే ఆ కథ చాలా బావుంది. జూలై 12 ‘దొరసాని’ చాలా బావుంటుంది’’ అని చెప్పారు.

దర్శకుడు కేవీఆర్‌ మహేంద్ర మాట్లాడుతూ ‘‘నా జీవితంలో ఇది మెమరబుల్‌ డే. దానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఎంతో మంది వెనక ఉండి ఇంత దూరం తీసుకొచ్చారు. ఎక్కడో చిన్నగా మొదలైన ఈ జర్నీ ఇంత దూరం రావడం నా జీవితంలో మర్చిపోలేని ఈవెంట్‌. ఈసినిమా రిలీజ్‌ అయిన తర్వాత మాట్లాడాలని ఉంది. కానీ కొన్ని విషయాలు.. దొరసాని కథ నేను దాచుకోలేని ఒక ఎమోషనే. ఏ దర్శకుడికైనా ఓ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. అది తన జర్నీలో కొన్ని సినిమాలు చేసినప్పుడు అందులో ఓ సినిమా అయి ఉంటుంది. కానీ నాకు లక్కీగా నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఈ చిత్రమే. అది దొరసాని చిత్రమే. ఎందుకు ఈ సినిమాను డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అంటున్నానంటే, ఇలాంటి కథలు తరచుగా రాయరు. కానీ నా చిన్నప్పటి నుంచి విన్న కథలన్నీ ఎక్కడో మెదడు పొరల్లో ఉండి, నా చేత రాయించబడ్డది. ఇందులో హానెస్టీ, రియాలిటీ, పీరియాడిక్‌, ప్రాపర్‌ డైలక్ట్‌, ఫ్రెష్‌ ఫేసెస్‌ ఉంటాయి. ఇవన్నీ అచీవ్‌ చేయడానికి మేం ప్రాపర్‌ టెక్నాలజీని వాడాం. అనామోఫిక్‌ లెన్స, సింక్‌ సౌండ్‌, ప్రాపెర్‌ కెమెరా వంటివన్నీ మాకు సాయపడ్డాయి. ఈ కథ చెప్పడానికి ఇమేజ్‌ ఉన్న ఆర్టిస్టులు అక్కర్లేదు. దానికోసం వెతుకుతున్న ప్రాసెస్‌లో శివాత్మిక రాజశేఖర్‌, ఆనంద్‌దేవరకొండ ఈ సినిమా కోసమే వచ్చారు. వీరిద్దరూ వారి జీవితంలో ఎన్ని సినిమాలు చేసినా, రాజు, దొరసానిలాగానే గుర్తుంటారు. దర్శకుడిగా నేను చెబుతున్న మాట ఇది. టెక్నికల్‌ విషయంలో ప్రశాంత విహారి చాలా మంచి సంగీతాన్నిచ్చారు. మధుర శ్రీధర్‌గారు ప్రశాంతగారిని పట్టుకుని ఇంత మంచి మ్యూజిక్‌ రావడానికి సాయపడ్డారు. సినిమాటోగ్రాఫర్‌ సన్నీ కొరపాటి ఎక్కడో యూరప్‌లో కొన్ని ప్రాజెక్టులు చేసి ఫ్రెష్‌గా వచ్చారు. తను ఏ మాత్రం పొల్యూట్‌ కాకుండా 80ల్లోకి తీసుకెళ్లాడు. నవీన నూలి చాలా సాయం చేశారు. ఆయన అనుభవం నాకు ఉపయోగపడింది. 2.20గంటల సినిమా చాలా బావుంటుంది. వేరే పీరియడ్‌కి తీసుకెళ్లి అందులోనే ఉంచుతుంది. దొరసాని సినిమా అందరినీ చాలా కాలం వెంటాడుతుంది. ఇదేదో ఓవర్‌ కాన్ఫిడెన్స కాదు. కాన్ఫిడెన్సే. ఈ సినిమా మేకింగ్‌ ప్రాసస్‌లో రియల్‌ లొకేషన్లలో తీశాం. ఈ లొకేషన్లను ఇంతకన్నా ముందు ఏ సినిమాలోనూ చూసి ఉండరు. దాదాపు ఏడాదిన్నర పాటు సెర్చ్‌ చేసి, వేల సంఖ్యలో ఆడిషన్స చేసి 67 మందిని ఈ సినిమా కోసం తీసుకున్నాం. వాళ్లకు కొన్ని నెలలు ట్రైనింగ్‌ ఇచ్చాం. ఇప్పటికీ వాళ్లు ఆ పాత్రల నుంచి బయటికి రావడం లేదు. ఇన్ని మంచి విషయాలున్నాయి సినిమాలో. నా కథ, ఇంత పెద్దగా మారుతుందని నేను అనుకోలేదు. ఇది నా పేరెంట్స్‌ చేసుకున్న పుణ్యమే అని అనుకుంటున్నాను’’ అని చెప్పారు.

నిర్మాత య‌ష్ రంగినేని మాట్లాడుతూ - ``చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంది. ఈ క‌థ విన‌లేదు. మ‌హేంద్ర పంపిన స్క్రిప్ట్ చదివాను. రెండు రోజులు నిద్ర పోనేలేదు. త‌ను అంత డీటెయిల్డ్‌గా స్క్రిప్ట్ రాశాడు. మ‌ధ్యలో రాజు, దొర‌సాని మ‌ధ్య స‌న్నివేశాల‌ను యాడ్ చేద్దామ‌ని అనుకున్నాం. కానీ మ‌హేంద్ర అందుకు ఒప్పుకోలేదు. త‌న సినిమాపై అంత క్లారిటీతో ఉన్నాడు. శివాత్మిక జీవిత‌గారికి రీప్లేస్ అవుతుంది. బెస్ట్ ఫిమేల్ ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంటుంద‌ని న‌మ్ముతున్నాను. హీరో ఆనంద్ గురించి చెప్పాలంటే.. త‌న‌ని చిన్న‌ప్ప‌ట్నుంచి చూస్తున్నాను. విజ‌య్‌, ఆనంద్ ఇద్ద‌రిలోనూ ప్యూరిటీ ఉంటుంది. ఇద్ద‌రినీ ముందుగానే పోల్చ‌కండి. సినిమా చూసిన త‌ర్వాతే మాట్లాడండి. పెళ్ళిచూపులు ఆడియో కూడా ఇక్క‌డే జ‌రిగింది. వెంక‌ట్ సిద్ధారెడ్డికి థాంక్స్‌. అలాగే మ‌ధుర శ్రీధ‌ర్‌గారిత పెళ్ళిచూపులు నుండి ప‌రిచ‌యం. ఆ న‌మ్మ‌కంతోనే ఆయ‌న చెప్ప‌గానే ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నాను. అలాగే ధీర‌జ్ మొగ‌లినేనికూడా థాంక్స్‌. ప్ర‌శాంత్ అద్భుత‌మైన సంగీతం ఇచ్చారు. మా బావ‌గారు లేకుంటే నేను ఇక్క‌డ‌కు రాకుండా పో్యేవాడిని. ఆయ‌న‌కు ఈ సందర్భంగా థాంక్స్‌`` అన్నారు.

ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ - ``నేను 15-22 ఏళ్ల స‌మ‌యంలో నేను క‌ల‌లు క‌న‌డానికి కూడా భ‌య‌ప‌డ్డాను. నేను బాగా చ‌దువుకుని యు.ఎస్ వెళ్లిపోయి జాబ్ చేసుకుంటూ ఉండిపోయాను. మ‌రో వైపు అన్న విజ‌య్‌, ఒక డ్రీమ‌ర్‌. ఆయ‌న జ‌ర్నీలో చాలా స్ట్ర‌గుల్స్ చూశాడు. అవ‌న్ని దాటేసి ఓ స‌క్సెస్‌ఫుల్ యాక్ట‌ర్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. త‌న‌తో పాటు డైరెక్ట‌ర్స్‌ త‌రుణ్ భాస్క‌ర్‌, సందీప్‌, రాహుల్‌, భ‌ర‌త్ క‌మ్మ తెలుగు సినిమా బౌండ‌రీస్‌ను పెంచుతున్నారు. రియ‌లిస్టిక్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ఆ లిస్టులో మ‌రో డైరెక్ట‌ర్ కె.వి.ఆర్‌.మహేంద్ర‌గారి పేరు వినొచ్చు. అందుకు ముందు సినిమా క‌థ‌లు వింటే భ‌య‌ప‌డేవాడిని. కానీ మ‌హేంద్ర‌గారు క‌థ చెప్పిన త‌ర్వాత న‌టుడిగా రాణించ‌వ‌చ్చున‌నిపించింది. మేం జీవితంలో డ‌బ్బులు గురించి చాలా స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేశాం. కానీ గ‌త రెండు, మూడేళ్ల‌లో ఆ స‌మ‌స్య‌లు పోయాయి. విజ‌య్ క‌ష్టం వల్లే అది సాధ్య‌మైంది. త‌న‌తో మాట్లాడే స‌మ‌యంలో త‌ను బిజినెస్ గురించి మాట్లాడేవాడు. స‌రే! నేను ఇండియా వ‌చ్చేసి త‌న‌కు స‌పోర్ట్ చేద్దామ‌ని అనుకున్నాను. జాబ్ వ‌దిలేసి ఇక్క‌డ‌కు వ‌చ్చిన త‌ర్వాత మ‌హేంద్ర‌ను క‌లుసుకున్నాను. నా టీమ్‌తో చేసిన జ‌ర్నీ చ
ాలా గొప్ప‌ది. సినిమాను అంత రియ‌లిస్టిక్ చేశాం. నా వెనుక దేవ‌ర‌కొండ అనే పేరుంద‌ని నేను సినిమాలు చేయ‌డం లేదు. మ‌హేంద్ర మంచి స్టోరీ టెల్ల‌ర్‌. అందులో నేను ఒక భాగ‌మైయ్యాన‌ని అనుకుంటున్నాను. ఈ ప్రాసెస్‌లో చాలా విష‌యాలు నేర్చుకున్నాను. మా దొర‌సాని శివాత్మిక న‌ట‌న‌తో చింపేసింది. మ‌ధుర‌శ్రీధ‌ర్‌గారికి, య‌ష్ మామ‌కి థాంక్స్‌. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడిలా ఇప్పుడు అంద‌రికీ తెలుసు. రేపు సినిమా చూసిన త‌ర్వాత రాజు అనే పాత్ర‌లో న‌న్ను యాక్సెప్ట్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను. న‌టుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను`` అన్నారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘విజయ్‌ నుంచి నేను ఒకటి నేర్చుకున్నా. మూడు దశాబ్దాలుగా ఇండసీ్ట్రలో ఉన్నా. ఇప్పటికీ నెర్వస్‌గానే అనిపిస్తుంది. ఇంకా టెన్షనగానే ఉంటుంది. కానీ ఇప్పటికీ నాకు ఎందుకు టెన్షన అని విజయ్‌ని చూస్తే అనిపిస్తుంది. శివాత్మిక గురించి నేను చాలా చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్లినా పిల్లలను తీసుకెళ్తాను. ఔట్‌డోర్‌కి వెళ్లినప్పుడు కూడా నేను వాళ్లను వెంట తీసుకెళ్లేవాడిని. దాని వల్ల టీచర్లు, ప్రిన్సిపల్స్‌ పిలిచి తిట్టేవాళ్లు . నేనెప్పుడూ తిట్లు తినేవాడిని కాదు. కాకపోతే జీవితకు మాత్రం తప్పేవి కావు. కొన్నాళ్ల వరకు అంతా బాగానే ఉంది కానీ, తర్వాత కుదరలేదు. అందుకే నా ఇద్దరు పిల్లల కోసం నేను స్కూల్‌ పెట్టా. వరల్డ్‌ క్లాస్‌ కాన్సెప్ట్‌ స్కూల్‌ పెట్టాను. మాతో షూటింగులకు వచ్చినా సరే, అక్కడ టీచర్లను పెట్టి వాళ్లకు కావాల్సింది నేర్పించేవాళ్లం. మా ఇద్దరు పిల్లలకు సినిమాల్లోకి రావాలని కోరిక. అయితే దాని గురించి మాట్లాడితే వాళ్లు బాధపడతారేమోనని నేను ఎప్పుడూ బాధపడను. ఇందాక విజయ్‌ మాట్లాడుతూ సినిమా ఇండసీ్ట్ర మామూలు విషయం కాదు అని అన్నాడు. అది నిజం. 30 ఏళ్లుగా హీరోగా ఉండటం మామూలు విషయం కాదు. ఇక్కడ సక్సెస్‌ ఉన్నంత వరకూ అంతా బాగానే ఉంటుంది. కానీ సక్సెస్‌ లేకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇండసీ్ట్రలో చాలా మంది సక్సెస్‌ లేక డిప్రెషనకి గురి కావడాన్ని నేను గమనించాను. నాక్కూడా అదే భయం. సినిమా ఎలా ఉందంటే టాలెంట్‌ ఉందా? లేదా? అని చూడరు. కానీ సక్సెస్‌ ఉండాలి. నేను మా పిల్లలకు ప్లాన బీ ఉండాలని చూసుకోమన్నా. నా చివరి జీవితం వరకు ఈ సినిమా రంగంలోనే ఉంటాను. విజయ్‌ దేవరకొండ వచ్చినా, ఎవరు వచ్చినా కంపీట్‌ చేస్తూనే ఉంటాను. ఆ ధైర్యం నాకు ఆల్రెడీ ఉంది. పెద్ద పాప నాలాగే డాక్టర్‌ చదువుకుంది. అపోలోలో మెడికల్‌ సీటు తెచ్చుకుంది. బాగా నేర్చుకుని కంప్లీట్‌ చేయమని చెప్పాను. నేను యాక్టర్‌ అయినా కనీసం 2 గంటలైనా మెడిసన చదువుతూ ఉంటాను. శివాత్మిక ఈ సినిమాలో యాక్ట్‌ చేసింది. నేను వెళ్లి కష్టపడి కథను ఎంపిక చేయలేదు. నిర్మాతలను చూడలేదు. అంతా అలా కుదిరింది. మధుర శ్రీధర్‌గారి వల్లనే ఈ అవకాశం వచ్చింది. నాకు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారిలాగా, మధుర శ్రీధర్‌గారిలాగా. అవసరమైనప్పుడు శ్రీధర్‌గారు ఖర్చుపెట్టకుండా ఉండరు. ‘కల్కి’ సినిమాకు నేను ఇలా ప్రీ రిలీజ్‌ పెట్టుకోవడానికి కుదరలేదు. కానీ మధుర శ్రీధర్‌గారు చాలా బాగా చేశారు. మహేంద్రగారు నెక్స్ట్‌ సబ్జెక్ట్‌ నాతో చేస్తానని చెప్పారు. నాకెందుకో నా పిల్లల విషయంలో అసలు భయం లేదు. వాళ్లు పాసైపోతారని నమ్మకం. వాళ్ల టాలెంట్‌, వాళ్ల లక్‌ అన్నీ అయిపోతే అప్పుడు నేను అండగా నిలుద్దాం అని అనుకున్నా. నేను నా పిల్లలను చూసి గర్వపడుతున్నా. మా పిల్లలిద్దరూ టాలెంటెడ్‌. హార్డ్‌ వర్కింగ్‌. వాళ్లకు యంగర్‌ జనరేషన్సతో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంటుంది. నా పిల్లలకు ఎప్పుడూ మీరు సపోర్ట్‌ చేయండి. ప్రశాంత చాలా బాగా మ్యూజిక్‌ చేశారు. ఆనంద్‌ వండర్‌ఫుల్‌ డ్యాన్సర్‌. నాకు షో ఆఫ్‌ చేసే హీరోలంటే నచ్చదు. వీళ్లు అన్నదమ్ములు ఇద్దరూ చాలా మంచివారు. సినిమాలో నేనెప్పుడూ ఇంటర్‌ఫియర్‌ కాలేదు. నాకు జీవితంలో చాలా టెన్షన పెట్టించిన సినిమా ఏంటంటే ఈ సినిమానే. కోదాడలో ఒక గడి అని ఒకచోటకు వెళ్లారు. ఈ గడీ మొత్తం ముందూ, వెనుకా మొత్తం ఎప్పుడు కూలిపోతుందా? అన్నట్టు ఉంటుంది. అక్కడ షూటింగ్‌ అయిపోగానే వెంటనే బయటికి వచ్చేయమని శివాత్మికకు చెప్పేవాడిని. ఇంజనీర్లను కూడా తీసుకెళ్లి గడీని చూపించాం. మా అమ్మాయి అయినప్పటికీ మేం తనతో పాటు వెళ్లలేదు. ఈ సినిమా మొత్తం శివాత్మిక భుజాన వేసుకుని చేసింది. శివాత్మిక వారసత్వంగా రాలేదు. మామూలు అమ్మాయిగానే వచ్చి చేసింది. అందరూ ఆశీర్వదించాలి. ’’ అని అన్నారు.

జీవితా రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - `` సినిమా కోసం అంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రినీ ఆశీర్వ‌దించండి`` అన్నారు.

శివాని మాట్లాడుతూ - ``శివాత్మిక కెరీర్లో ఇది మ‌ర‌చిపోలేని రోజు. మ‌హేంద్ర‌గారు గొప్ప ద‌ర్శ‌కుడు. రేపు సినిమా రిలీజ్ త‌ర్వాత ఆ విష‌యం ఒప్పుకుంటారు. సురేశ్ బాబుగారు, మ‌ధుర శ్రీధ‌ర్‌గారు, య‌ష్ రంగినేనిగారికి థాంక్స్‌. చాలా లిమిటెడ్ రీసోర్స‌స్‌లో ఈ సినిమాను చేశారు. ఈ సినిమాకు ప్ర‌శాంత్‌గారు ఆత్మ‌లా విన‌సొంపైనా పాట‌ల‌ను అందించారు. ఆనంద్ చాలా మంచి మిత్రుడు. చాలా హానెస్ట్. చాలా నెమ్మ‌దిగా ఉంటాడు. రేపు సినిమాలో త‌న న‌ట‌న‌తో మ‌మ్మ‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేశాడు. శివాత్మిక నాకంటే నాలుగేళ్లు చిన్న‌ది. తను చాలా ఇన్నోసెంట్‌.. త‌ను అక్క‌లా చూసుకుంటుంది. నా బుజ్జి చెల్లెని 25 రోజుల పాటు ఒంటరిగా కోదాడ‌లో ఈ సినిమా కోసం వ‌దిలేశాం. ఈమెను చాలా మంది ట్రోలింగ్ చేశారు. వారంద‌రినీ త‌న న‌ట‌న‌తో నోరు మూయించేస్తుంది`` అన్నారు.

శివాత్మిక రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``నాకు ఉహ తెలిసిన‌ప్ప‌టి నుంది యాక్ట‌ర్ కావాల‌నేదే కోరిక‌. ఆ కోరిక తీర్చింది న‌లుగురు వ్య‌క్తులు. డైరెక్ట‌ర్ మ‌హేంద్ర‌గారు న‌న్ను దొర‌సాని పాత్రలో ఎంపిక చేసుకున్నందుకు, త‌న‌కు థాంక్స్‌. అలాగే సినిమాటోగ్రాఫ‌ర్ స‌న్నిగారికి థాంక్స్‌. ప్ర‌శాంత్ విహారిగారు సోల్‌ఫుల్ మ్యూజిక్‌ను అందించారు. మా దొర‌గారు విన‌య్‌గారితో న‌టించడం ఆనందంగాఉంది. మా డైరెకక్ష‌న్ టీమ్‌, ఇత‌ర టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ధీర‌జ్ నిజంగా దొర‌సానిలా చూసుకున్నారు. నాకు 19 ఏళ్లు. నేను స్కూల్ మానేసి సినిమాల్లో న‌టిస్తాన‌ని అన‌గానే ఏమాత్రం ఆలోచించ‌కుండా నీ క‌ల‌ను నేర‌వేర్చుకో అని ఫ్రీడ‌మ్ ఇచ్చారు. మా అమ్మ‌మ్మ‌, నాన‌మ్మ లేరిక్క‌డ‌. అలాగే మా ముర‌ళి మావ‌య్య నాకు ఎంత‌గానో స‌పోర్ట్ అందించారు. ఎవ‌రూ నా గురించిఅడిగినా త‌న న‌టి అవుతుంద‌ని చెప్పేవారు. ఆనంద్‌తో ప‌నిచేయడం చాలా ఆనందంగా ఉంది. రాజు పాత్ర‌ను మ‌రెవ‌రూ చేయ‌లేరు. మ‌మ్మ‌ల్ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన వారంద‌రికీ థాంక్స్‌. మేం హానెస్ట్ ల‌వ్‌స్టోరి చేశాం. జూలై 12న సినిమాను చూసి ఆద‌రించండి. ఫ్యూచ‌ర్‌లో న‌న్ను, మా శివానిని కూడా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.



Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved