pizza
Gaami Pre Release Event
గామి ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్. మేము ఒక ఎపిక్ సినిమా తీశామని నమ్ముతున్నాం. ఎపిక్ తీశామో లేదో సినిమా చూసి ప్రేక్షకులు చెప్పాలి: డైరెక్టర్ విద్యాధర్ కాగిత
You are at idlebrain.com > News > Functions
Follow Us


07 March 2024
Hyderabad

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'గామి'. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. వి సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. హీరో అడివి శేష్ ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అడివి శేష్ మాట్లాడుతూ..ఈ వేడుకలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. దినేష్ ప్రసాద్ ఎవరో తెలుసా? 2018 లో అన్నపూర్ణ స్టుడియోలో గూడచారి టెస్ట్ స్క్రీన్ చేస్తున్నాం. ఎవరో ఓ కుర్రోడు వచ్చి ‘బాగా చేసినవ్’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎవడ్రా వీడు అనుకున్నా. ఆ రోజు కళ్ళజోడు పెట్టుకున్న దినేష్ ప్రసాద్.. ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. అద్భుతమైన ట్యాలెంట్ వున్న నటుడు విశ్వక్. పరిశ్రమలో నిజాయితీ గల నటుడు. తన నిజాయితీ గల మనసు కోసమే ఇక్కడికి వచ్చాను. గామి ట్రైలర్ గురించి అందరూ మాట్లాడారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలనిపించడమే కాదు, సినిమా హిట్ అవ్వాలని కూడా కొరుకునేలా వుంది. విద్యాధర్ ప్యాషన్ కి హ్యాట్సప్. నా కెరీర్ బిగినింగ్ లో కర్మ అనే సినిమాని చాలా కష్టపడి చేశాను. దానికి మంచి ఫ్లాట్ ఫాం సపోర్ట్ గా వస్తే బావుటుందని అనుకున్నాను. గామికి అలాంటి ఫ్లాట్ ఫాం యూవీ రూపంలో దొరికింది. నరేష్ మ్యూజిక్ చాలా బావుంది. చాందినీ కి అభినందనలు. మార్చి 8, శివరాత్రి రోజున సినిమా థియేటర్స్ వస్తోంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం. గామి సినిమాని ఎంజాయ్ చేద్దాం. సెలబ్రేట్ చేద్దాం’ అన్నారు.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ వేడుకు విచ్చేసిన శేష్ భాయ్, అజయ్ అన్న, హను రాఘపూడి గారు , అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. దర్శకుడు విద్యాధర్ మాటల్లోని నిజాయితీని నమ్మాను. దాని ఫలితమే నా జీవితంలోకి గామి లాంటి సినిమా వుంది. జీవితంలో నేను కలసి అత్యంత నిజాయితీ గల వ్యక్తి విద్యాధర్. ఈ సినిమాతో విద్యా లాంటి స్నేహితుడిని సంపాదించుకున్నాను. డీవోపీ విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సినిమా విడుదల తర్వాత తన గురించి ప్రేక్షకులు చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక మంచి సినిమా దాని లక్ష్యాన్ని అది చేరుకుంటుదనే నమ్మకంతో మొదలుపెట్టాం. విక్కీ అన్న ప్రాజెక్ట్ లోకి రావడంతో మా నమ్మకం నిజమైయింది. ఆయన రావడంతో సినిమా స్కేల్ పెరిగింది. నరేష్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సంగీతం కథలో లీనం చేస్తుంది. హారిక అద్భుతంగా నటించింది. సమద్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. చాందినీ గ్రేట్ కోస్టార్. షూటింగ్ లో వాష్ రూమ్ యాక్సిస్ వుండపోవడం వలన తను ఉదయం నుంచి సాయంత్రం వరకూ నీరు తాగేది కాదు. తన డెడికేషన్ కి హ్యాట్సప్. ఆలోచనతో మొదలై మనసులో నిలిచిపోయే సినిమా ఇది. చాలా నిజాయితీగా చాలా రిస్క్ లు తీసుకున్నాం. అవన్నీ ఫలితాన్ని ఇచ్చాయి. దేవుడు కూడా చూశాడని భావిస్తున్నాను. లీప్ ఇయర్ లో ట్రైలర్ రిలీజ్ కావడం, మహాశివరాత్రికి సినిమా విడుదల కావడం మేము ప్లాన్ చేయలేదు. మా నిజాయితీకి ఎదో సూపర్ పవర్ యాడ్ అయ్యింది. సినిమా చూసినప్పుడు మనసు బరువెక్కింది. చాలా అనందంగా గర్వంగా అనిపించింది. కొత్తరకం సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప సంతృప్తిని ఇస్తుంది. ప్రేక్షకులకు గర్వపడే సినిమా అవుతుంది. రీకాల్ వాల్యు వుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని హాంట్ చేస్తుంది. మార్చి 8న థియేటర్స్ కి వచ్చేయండి. ఈ గామిని ప్రేక్షకులు గొప్ప గమ్యానికి చేరుస్తారని మా టీం అంతా నమ్ముతున్నాం’’అన్నారు.

దర్శకుడు విద్యాధర్ కాగిత మాట్లాడుతూ.. గామి చిన్నగా మొదలై పెద్దగా మారింది. మమ్మల్ని నమ్మి క్రౌడ్ ఫండ్ చేసిన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేమికుల వలనే ఈ ప్రాజెక్ట్ సాధ్యపడింది. నిర్మాత కార్తిక్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాతో పాటు ప్రయాణించాడు. నాకు ఒక్క సమస్య కూడా రానివ్వకుండా నేను అనుకున్నది అనుకున్నట్లు తీయడంలో సపోర్ట్ చేశాడు. యూవీ క్రియేషన్స్ ఇచ్చిన సపోర్ట్ ఫ్రీడం అద్భుతం. విక్కీ వంశీ గారికి ధన్యవాదాలు. మమ్మల్ని వెరీ బిగినింగ్ లో నమ్మిన నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదాలు. చాందినీ రెమ్యునిరేషన్ గురించి అలోచించకుండా చాల కష్టపడిపని చేశారు. డీవోపీ విశ్వనాధ్, వీఎఫ్ఎక్స్ సునీల్, ప్రొడక్షన్ డిజైనర్ ప్రవల్య, కంపోజర్ నరేష్ ఇలా అందరూ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. గామి సౌండ్ గూస్ బంప్స్ ఇస్తుంది. నా డైరెక్షన్ టీం అందరికీ ధన్యవాదాలు. విశ్వక్ సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివి ఈ సినిమా చేస్తున్నాని చెప్పారు. తను బ్రిలియంట్ గా నటించారు. గామి ఇంటెన్స్ ఎమోషనల్ ఫిల్మ్. గామి ఓ ఎపిక్. మేము ఒక ఎపిక్ సినిమా తీశామని నమ్ముతున్నాం. ఎపిక్ సినిమా తీశామో లేదో మార్చి 8న చూసి ప్రేక్షకులు చెప్పాలి’ అన్నారు.

హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. ఈ వేడుకు వచ్చిన అతిధులకు ధన్యవాదాలు. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన యూవీ క్రియేషన్స్ కి థాంక్స్. ఈ సినిమా వారణాసి, లడక్, హిమాళయాలు, కుంభమేళ.. ఇలా షూటింగ్ ఒక సాహస యాత్రల జరిగింది. దర్శకుడు విద్యాధర్ చాలా గొప్ప విజన్ తో ఈ సినిమాని చేశారు. హిమాలయాల్లో ఆక్సిజన్ ట్యాంక్స్ సాయం తీసుకొని మరి ఈ సినిమా షూటింగ్ చేశాం. గామి చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుంది. విశ్వనాథ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నరేష్ డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో పని చేసిన అందరూ ది బెస్ట్ ఇచ్చారు. విశ్వక్ వండర్ ఫుల్ యాక్టర్. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన ప్రయాణం. సమద్ తో పాటు మిగతా పాత్రలు కూడా అద్భుతంగా వుంటుంది. గామి లాంటి సినిమాలో భాగం కావడం అందుకోవడం ఆనందంగా వుంది. నిర్మాత కార్తిక్ కి ధన్యవాదాలు. సినిమాని తప్పకుండా థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయండి' అన్నారు.

దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ.. గామి టీంకి అభినందనలు. దర్శకుడు ఐదేళ్ళు కష్టపడిపడ్డాడు. సినిమా చూశాను. సినిమా క్లైమాక్స్ గూస్ బంప్స్. విశ్వక్ నటన నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. మార్చి 8న బ్లాక్ బస్టర్ కొడుతున్నారు. టీంకు అడ్వాన్స్ కంగ్రాట్స్' తెలిపారు.

ఎస్కేయన్ మాట్లాడుతూ.. గామి లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. వచ్చినపుడు ప్రోత్సహించాలి. విశ్వక్ సేన్ గారి అంకిత భావానికి హ్యాట్సప్. ఆరేళ్ళు ఒక సినిమాతో ట్రావెల్ చేయడం మామూలు విషయం కాదు. దర్శకుడు చాలా అద్భుతంగా తీశారు. విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. ఈ శివరాత్రి బాక్సాఫీసు దగ్గర నవరాత్రి తలపించాలని, గామి సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. గామి లాంటి యునిక్ ప్రాజెక్ట్ అన్నీ తానై నడిపిస్తున్న విశ్వక్ గారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్ చూడగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నిర్మాతలు కాన్సెప్ట్ గురించి చెప్పినపుడు షాకింగ్ గా అనిపించింది. టీజర్ ట్రైలర్ లో విజువల్స్ చూసినప్పుడు చెప్పినట్లుగా అద్భుతంగా తీశారనిపించింది. దర్శకుడు అందరూ మెచ్చేలా సినిమాని తీశారు. తప్పకుండా ఈ సినిమాని చూసి పెద్ద విజయాన్ని ప్రేక్షకులు ఇవ్వాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.

నవదీప్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే పిచ్చి. గామి సినిమా యూనిట్ కూడా ఆరేళ్ళు ఒక సినిమా పై కష్టపడం అంటే సినిమాపై వారికి వున్న పిచ్చి ఏమిటో అర్ధమౌతుంది. విశ్వక్ కి సినిమా అంటే చాలా పిచ్చి. సినిమా యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా చాలా గ్రాండ్ గా జరిగింది.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved