pizza
HIT 2 pre release event
I’m Waiting Eagerly To Know Who’s The Villain In HIT2: SS Rajamouli
తెలుగు సినిమా నుంచి వ‌స్తోన్న మ‌రో క్వాలిటీ మూవీ ‘హిట్ 2’... తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి
You are at idlebrain.com > News > Functions
Follow Us


28 November 2022
Hyderabad

Promising hero Adivi Sesh who became a Pan India star with his last movie Major is coming up with his next movie HIT2. The film directed by Sailesh Kolanu and produced by Nani and Prashanthi Tipirneni under Wall Poster Cinema is due for release on December 2nd. Interim, the team celebrated the film’s pre-release event in a majestic way with numero uno director SS Rajamouli gracing the occasion as a chief guest. The event witnessed a huge crowd.

While speaking at the event, director Sailesh Kolanu said, “I thank one and all for gracing the occasion. Rajamouli sir you came for HIT first case as a chief guest to bless us and you shared your opinion of having more films under HIT franchise. Yes, we are making a total of seven films under HIT franchise. I hope, Rajamouli sir will come for next cases of HIT. Theatres shut down just after two weeks after the release of HIT, and those who watched it on OTT opined that it should have been watched in theatres. I can’t reveal much about the content, but one thing that I can tell you is that number of emotional layers are added to give you a wholesome experience. I wanted to make the script bigger. I wanted the universe to be bigger. The crime or the emotions should be on universal scale, as we go forward with the new cases. If you liked Hit, you will like HIT 2 more. HIT 2 will be much more riveting than HIT. We made the movie for theatrical release. The visuals and the sound design are on a bigger scale.”

SS Rajamouli said, “First of all, I like to congratulate Nani, Prashnathi and Sailesh for making HIT a franchise. As far as I know, it’s the first franchise in the crime thriller genre in India. HIT series has a separate fan base and the same can be observed on social media. Vishwak who did HIT and now Sesh who starred in HIT2 brought energy to this franchise. I watched the film’s trailer and I liked it completely. I loved the BGM. I felt it’s fantastic when I watched the last sequence of Kodi Burra in the trailer. Like all of you, I’m also waiting eagerly to know who’s the villain. Creating interest throughout is the essence of thriller genre and Sailesh succeeded in doing so. All three of you (Nani, Prashanthi and Sailesh), HIT 3, HIT 4, HIT 5 and HIT 6 should come. It should come on same season, same date or same week, every year. We should have a HIT franchise every year, that is what I think should happen and it will happen. Technical values look grand and the actors performed well. Sesh and Meenakshi’s pairing look good on screen. This is going to be a quality product from Telugu cinema.”

Sesh said, “I’m enthusiastic, excited and nervous at the same time. I prefer call them family, rather than guests. Sweety Anushka would have been a surprise guest for the event, but she couldn’t make it as she was suffering from a cold. The common factor for all of us is we all came from outside, stepped into the industry with no background, worked hard, tasted the succeed and standing today in front you. Vishwak scored a blockbuster with HIT and he is coming up with Dhamki. I told it in many interviews that Nani is my favorite star. From Ashta Chamma to Dasara, to see him in different roles and getups which inspired me, there’s nobody who can’t like Nani and his movies. I worked for 70 to 100 days for Baahubali. In many ways, for my work ethic and work approach, the root cause was the experience of working for Baahubali. It was like a film school for me. Like an Ekalavya shishya, I’ve been studying him, I’ve been watching him, I’ve been watching his work and getting inspired. It’s very important for me that he has come as the chief guest for my film. Wherever we go we never should forger our people and that’s what I learnt from him.

I always wonder how audience will feel about my every film. I don’t know whether every time I succeed or not, but I will keep on putting the same effort every time. I worked with same enthusiasm for this film, like for my previous films. But I was happy to be part of Sailesh’s grand vision, this time. I’ve entered HITverse with this, and Sailesh told me that I will be part of HIT3 as well. HIT2 is a riveting film. I enjoyed doing this film. You guys will thoroughly entertained, thrilled and you will enjoy this one. When I requested Nani bro, we immediately started discussing HIT2 should also be dubbed and released in Hindi. We wanted it to be an all-Indian film. In a couple of days, we’ll be announcing the release date. My final request is don’t reveal the criminal. Don’t post the spoilers. Come to cinemas to watch HIT2 on December 2nd.”

Nani said, “Valli garu, and Rama garu, I get a feel that my mom and pinni (aunt) came for the event. I get positive energy whenever I see you. If you don’t come for First Day First Show at Prasads, I feel the tension. I thank all the guests. I don’t talk much about the film. You tell us about the actors and technicians, after watching the film. We made a film with love and respect. HIT2 is a gripping thriller and I hope it will entertain you. Thank you Rajamouli garu. He came back home today and I was doubtful whether he would come or not. I’m turning a bit greedy now and I wish he will come for next movie events as well. Rajamouli garu attends all the functions of the movies of Sai garu and of mine. I watched the photos of Rajamouli in suit, I loved the style, and attitude. Sesh is a terrific actor. He always works hard. Sailesh was a scientist, before becoming a director. His research work helped the film a lot. He wanted to do 7 parts in HIT franchise and Sailesh wants to bring all the officers together for the 7th part to solve a big problem. More than a producer, I’m waiting eagerly as an audience to watch the film. Everyone did a fantastic job. When you watch HIT 2, you will know the hero of HIT 3. Come to theatres to watch the movie.”

తెలుగు సినిమా నుంచి వ‌స్తోన్న మ‌రో క్వాలిటీ మూవీ ‘హిట్ 2’... తప్పకుండా హిట్ అవుతుంది.. డౌటే లేదు: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి

అడివి శేష్ హీరోగా న‌టించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమాపై శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భొంగా..

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు ఇంగ్లీష్‌లో మాట్లాడి మాట్లాడి చిరాకేసింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది. హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్ర‌శాంతి, శైలేష్‌ల‌కు కంగ్రాట్స్‌. అదంత ఈజీ కాదు.. హిట్ సినిమా చేయొచ్చు కానీ.. ఫ్రాంచైజీ చాలా క‌ష్టం. సాధార‌ణంగా హీరోకో, ద‌ర్శ‌కుడికో ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఓ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండ‌టం అనేది ఇండియాలోనే ఫ‌స్ట్ టైమ్ అని అనుకుంటున్నాను. అలాంటి గొప్ప ఫ్రాంచైజీ చేసినందుకు టీమ్‌కు అభినంద‌నలు. హిట్ 1లో చేసిన విశ్వ‌క్ సేన్‌ ... హిట్ 2లో చేసిన అడివి శేష్ ఓ ఎన‌ర్జీని తీసుకొచ్చారు. హిట్ 2’ ట్రైల‌ర్ (HIT 2 Trailer) చూశాను. చాలా చాలా బాగా న‌చ్చింది. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాలోని హ‌త్య‌ల‌ను చేసే హంత‌కుడెవ‌రు.. వెంట‌నే సినిమా చూడాల‌నిపించింది. అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లిగించ‌ట‌మే థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ స్టైల్ శైలేష్ (Sailesh Kolanu) అందులో కంప్లీట్‌గా స‌క్సెస్ అయ్యాడు. హిట్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో డౌటే అక్క‌ర్లేదు. హిట్ 3, హిట్ 4, హిట్ 5 వ‌రుస‌గా వ‌స్తాయి. అందులో డౌట్ లేదు. అయితే ప్ర‌తి సినిమా ఒకే సినిమాలో రావాలి. అది హిట్ సీజ‌న్ కావాలి. అది జ‌నాల‌కు అర్థం కావాలి. సేమ్ డేట్‌, సేమ్ వీక్ రావాలి. అంద‌రూ చాలా బాగా చేశారు. టెక్నీక‌ల్ వేల్యూస్ బావున్నాయి. తెలుగు సినిమా నుంచి వ‌స్తున్న మ‌రో క్వాలిటీ సినిమా ఇది. డిసెంబ‌ర్ 2న (Hit 2 Release date) ‘హిట్ 2 ది సెకండ్ కేస్’తో థియేటర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ ‘‘చాలా ఎగ్జ‌యిటెడ్‌గా, నెర్వ‌స్‌గా ఉన్నాను. ఏం మాట్లాడాలో రాసుకునే వ‌చ్చాను. రాజ‌మౌళిగారు, శోభుగారు స‌హా అంద‌రూ నా కెరీర్ ప్రారంభం నుంచి స‌పోర్ట్ చేశారు. మేం ఎంతో క‌ష్ట‌ప‌డి హార్డ్ వ‌ర్క్ చేసి ఇలా మీ ముందు నిల‌బ‌డుతున్నాం. విశ్వ‌క్ సేన్.. హిట్‌తో హిట్ కొట్టి ద‌మ్కీ ఇచ్చే రేంజ్‌కు చేరుకున్నాడు. అష్టాచ‌మ్మా నుంచి ద‌స‌రా వ‌ర‌కు డిఫ‌రెంట్ రోల్స్‌లో న‌టిస్తున్న నాని న‌చ్చని వాడుండ‌డు. అలాగే నాతో స‌హా నాని సినిమా న‌చ్చ‌నివాడు కూడా ఉండ‌డు. హిట్ 2 సినిమాకు చీఫ్ గెస్ట్ అయిన రాజ‌మౌళిగారు ఇప్పుడు వ‌ర‌ల్డ్ సినిమా ఎంట‌ర్‌టైన్మెంట్‌కు ఆయ‌నే చీఫ్‌.

బాహుబ‌లి సినిమా షూటింగ్ సమయంలో ఆయ‌న్ని చూస్తే అర్థ‌మైంది ఎప్ప‌టికైనా స్టూడెంట్‌లాగానే ఉండాల‌ని. అంద‌రి క‌న్నా ముందుగా వ‌చ్చి.. అంద‌రి కంటే ఆల‌స్యంగా వెళుతూ రేపు ఏం చేయాల‌నేది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఆయ‌న ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. ఎవ‌రినైనా లీడ్ చేయాల‌నుకున్న‌ప్పుడు మ‌నం ఎక్కువ క‌ష్ట‌ప‌డాల‌నే విష‌యాన్ని కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నుంచే నేను నేర్చుకున్నాను. నా వ‌ర్క్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగు ప‌డ‌టానికి మూల కార‌ణం బాహుబ‌లి. ఫిల్మ్ స్కూల్‌లా చాలా విష‌యాల‌ను నేర్పించింది. రాజ‌మౌళిగారికి నేను ఏక‌ల‌వ్య శిష్యుడిగా నాకు తెలియ‌కుండా మారిపోయాను. ఆయ‌న వ‌ర్క్‌ను చూస్తూ ఇన్‌స్పైర్ అవుతూ వ‌చ్చాను. న‌టుడిగా ప్ర‌తి సినిమా త‌ర్వాత నెక్ట్స్ సినిమా ఎలా ఉండాలి. ఎలా ఉంటే ఆడియెన్స్‌కి న‌చ్చుతుంద‌ని త‌ప‌న ప‌డుతుంటాను. అదెప్ప‌టికీ అలాగే ఉంటుంది. శైలేష్ రాసుకున్న హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. హిట్ 3లో కూడా ఉంటాన‌ని అన‌టం చాలా సంతోషంగా ఉంది. నా గ‌త చిత్రాల‌ను ఏ న‌మ్మ‌కంతో అయితే చూడ‌టానికి వ‌చ్చారో అదే న‌మ్మ‌కంతో నేను ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేశాను. డిసెంబ‌ర్ 2న హిట్ 2ను అంద‌రూ ఎంజాయ్ చేస్తారు. సినిమా చూసిన త‌ర్వాత దీన్ని హిందీలోనూ డ‌బ్ చేసి రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. త్వ‌ర‌లోనే హిట్ 2 హిందీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.

నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ‘‘‘హిట్ 2’సినిమా గురించి ఇప్పుడే నేను ఏమీ మాట్లాడను. అందరూ అన్నీ విషయాలను చెప్పారు. డిసెంబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద అందరి ప్రేమ, గౌరవం ఎలా ఉందో చూసే ఉంటారు. అదే ప్రేమ‌, రెస్పెక్ట్‌తో హిట్ సినిమాను చేశాం. ప్రపంచ‌మంతా తిరిగిన రాజ‌మౌళిగారు రాలేన‌ని చెప్పొచ్చు. కానీ ఈవెంట్‌కు రావాల‌నగానే వ‌చ్చారు. ఆయ‌న సొంత బ్యాన‌ర్‌లా ఫీల్ అవుతారాయ‌న. ఆయ‌న ఈ వేడుకకి రావ‌టం గౌర‌వంగా భావిస్తున్నాం. ఆయ‌న అ!, హిట్ 1... ఇప్పుడు హిట్ 2 ఈవెంట్స్‌కి వ‌చ్చారు. శేష్ టెరిఫిక్ యాక్ట‌ర్‌. ప్రేక్ష‌కుల‌ ఇంటెలిజెన్స్‌ని త‌క్కువ వేయ‌కుండా న‌టించే ఓ యాక్ట‌ర్ త‌ను. అలాంటి ఓ యాక్ట‌ర్‌కి శైలేష్‌లాంటి ఓ డైరెక్ట‌ర్ క‌లిసిన‌ప్పుడు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. దీని త‌ర్వాత హిట్ 3... నుంచి 7 వ‌ర‌కు ఉంటుంది. హిట్ 7లో అంద‌రినీ క‌లుపుతాన‌ని శైలేష్ ఇప్ప‌టికే చెప్పేశాడు. నేను నిర్మాత‌గా కంటే ఆడియెన్‌గా చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను. హిట్ 2 చూసేట‌ప్ప‌టికే హిట్ 3లో హీరో ఎవ‌ర‌నేది అర్థ‌మ‌వుతుంది. మొన్న రాజమౌళిగారు (Rajamouli) హాలీవుడ్ ఫంక్ష‌న్‌కి వెళ్లారు. అప్పుడు ఆయ‌న కోట్ వేసుకున్నారు. చూడ‌గానే ఈయ‌నేంటి హీరోలా ఉన్నార‌నిపించింది. ఆయ‌న్ని డైరెక్ట‌ర్ అని అనేస్తున్నాం. ఆయ‌నలో హీరో ఉన్నారు’’ అని అన్నారు

శైలేష్ కొల‌ను మాట్లాడుతూ ‘‘హిట్ ఫస్ట్ కేస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వ‌చ్చిన రాజ‌మౌళిగారు అది పెద్ద హిట్ అయ్యి.. సెకండ్ కేస్ చేయాల‌ని అన్నారు. ఆయ‌న అన్న‌మాట ఈరోజు నిజ‌మైంది. ఆయ‌న హాలీవుడ్ మూవీలు చేస్తున్నా స‌రే! మా హిట్ ఫ్రాంచైజీల‌కు గెస్ట్‌గా రావాల‌ని కోరుకుంటున్నాను. ఎక్క‌డో కూర్చుని ఓ యూనివ‌ర్స్‌ని క్రియేట్ చేయాల‌ని ఆలోచించాను. ఇప్పుడ‌ది నిజ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంది. విక్ర‌మ్ రుద్ర‌రాజుగా న‌టించిన విశ్వ‌క్ ఎక్క‌డికి వెళ్ల‌డు. ఎప్పుడు, ఎలా వ‌స్తాడనేది త‌ర్వాత చెబుతాను. హిట్ 2 గురించి చెప్పాలంటే.. చాలా ఎమోష‌న‌ల్ లేయ‌ర్స్‌ను పెట్టి రాసిన సినిమా ఇది. స్క్రిప్ట్‌ను పెంచ‌డానికి కార‌ణం యూనివ‌ర్స్‌ను పెంచాల‌నే ఆలోచ‌నే. హిట్ 1 కంటే హిట్ 2 పెద్ద‌గా, బెట‌ర్‌గా ఉంటుంది.

థియేట‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సౌండ్ డిజైన్‌, విజువ‌ల్స్ అన్నింటిని ప్లాన్ చేసి చేసిన సినిమా ఇది. శ్రీలేఖ‌, సురేష్ బొబ్బిలి మంచి సంగీతాన్ని అందించారు. కె.కెగారు చ‌క్క‌టి సాహిత్యాన్ని ఇచ్చారు. సినిమాకు జాన్ స్టెబార్ట్ ఎడురి నేప‌థ్య సంగీతం అందించారు. అది సినిమాకు. ఇక ట్రైల‌ర్‌కైతే శ్రీచ‌ర‌ణ్ పాకాల ట్యూన్ ఇచ్చారు. రియ‌ల్ లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. గ్యారీ ఎడిటింగ్ సూప‌ర్‌. త్వ‌ర‌లోనే స్పై సినిమాతో డైరెక్ట‌ర్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీతో నేను అనుకున్న‌ దాన్నెలా ప్రెజెంట్ చేయాల‌నేది ఆయ‌న‌కు బాగా తెలుసు. మా నిర్మాత‌ల‌కు థాంక్స్‌. ఆర్టిస్టుల నుంచి చాలా నేర్చుకున్నాను. మెమొర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌. అడివి శేష్ ఎలా రిసీవ్ చేసుకుంటావోన‌ని భ‌య‌ప‌డుతూ వ‌చ్చాను. త‌నొక పెద్ద క్వ‌శ్చ‌న్ బ్యాంక్. త‌న‌వ‌ల్లే నేర్చుకోవాల్సిన దాని కంటే ఎక్కువ నేర్చుకున్నాను. ప్ర‌శాంతిగారు, నానిగారి వ‌ల్లే ఇక్క‌డ నిల‌బ‌డి ఉన్నాను. నాని బ్రో .. నా ఆలోచ‌న‌లు ముందు నానికి న‌చ్చుతాయా అని ఆలోచిస్తున్నాను. నా ద‌ర్శ‌క‌త్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. నాపై న‌మ్మ‌కంతో న‌న్ను ద‌ర్శ‌కుడిని చేశారు. ఆయ‌న నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని భ‌విష్యత్తులోనూ నిల‌బెట్టుకుంటాను’’ అన్నారు.

మీనాక్షి చౌద‌రి మాట్లాడుతూ ‘‘హిట్ 2 రిలీజ్‌కి ద‌గ్గ‌ర‌వుతుంది. కాస్త నెర్వ‌స్‌గా ఉంది. ఆర్య అనే బ్యూటీఫుల్ రోల్ ఇచ్చిన మా డైరెక్ట‌ర్ శైలేష్‌కి థాంక్స్‌. హిట్ యూనివ‌ర్స్‌లో భాగ‌మైనందుకు హ్యాపీగా ఉంది. న‌టిగా చాలా విష‌యాలు నేర్చుకున్నాను. నిర్మాత ప్ర‌శాంతిగారు సూప‌ర్ కూల్ ప్రొడ్యూస‌ర్‌. మ‌ణికంద‌న్‌గారు నా ఆర్య రోల్‌ను చాలా అందంగా చూపించారు. నాతో న‌టించిన ఇత‌ర న‌టీన‌టుల‌కు ధ‌న్య‌వాదాలు. శేష్‌.. స్క్రిప్ట్ సెల‌క్ష‌న్‌, సినిమాలు చేసే విధానం గురించి మాట్లాడుతుంటారు. త‌ను మంచి కో స్టార్. నానిగారు నా ఫేవ‌రేట్ యాక్ట‌ర్‌. ఆయ‌న న‌టించిన జెర్సీ, శ్యామ్ సింగ‌రాయ్ నాకు న‌చ్చుతాయి. ఆయ‌న నిర్మాత‌గా చేసిన ఈ సినిమాలో పార్ట్ కావ‌టం సంతోషంగా ఉంది. 100 శాతం సినిమా న‌చ్చుతుంది. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్స్‌లో క‌లుద్దాం’’ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క‌మ్రంలో చిత్ర నిర్మాత ప్ర‌శాంతి త్రిపిర్‌నేని, ప్రొడ్యూస‌ర్ శోభు యార్ల‌గ‌డ్డ‌, హిట్ 1లో హీరోగా న‌టించిన విశ్వ‌క్ సేన్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ అతిథులుగా పాల్గొని హిట్ 2 మూవీ పెద్ద స‌క్సెస్ కావాల‌న్నారు.


Photo Gallery
 

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved