15 April 2024
Hyderabad
చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రల్లో వనమాలి క్రియేషన్స్ బ్యానర్‌పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఎన్ ఆర్ట్’ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్, కిడ్నాప్ డ్రామా, ఫన్ ఇలా అన్ని ఎలిమెంట్స్‌ను మేళవించి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ దసపల్లా హోటల్ లో అంగరంగ వైభవంగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ‘పారిజాత పర్వం ప్రీ కిడ్నాప్ ఈవెంట్’ పేరుతో వెరైటీగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘పారిజాత పర్వం’ బిగ్ టికెట్ ను చీఫ్ గెస్ట్, స్టార్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు లాంచ్ చేశారు.
ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ..‘‘ఈ సినిమాలో నేను ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సాంగ్ రాశాను. ఇంత మంచి పాట నాతో రాయించినందుకు సంతోష్ కంభంపాటి గారికి, అలాగే అనంత్ సాయి గారికి థ్యాంక్యూ. ప్రొడక్షన్ విలువలు చాలా బాగున్నాయి. మ్యూజిక్ చాలా ట్రెండీగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నా. ఈ నెల 19న అందరూ ఈ సినిమా చూడాలని కోరుతున్నా.’’
మ్యూజిక్ డైరెక్టర్ రి మాట్లాడుతూ..‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో ఐదు పాటలున్నాయి. ఈ సినిమాలో శ్రద్ధా ఒక పాట పాడారు. ఫస్ట్ ఆమె పాడుతుందనగానే షాక్ అయ్యా. కానీ ఆమె చాలా బాగా పాడి సర్‌ప్రైజ్ చేశారు. మా నిర్మాతలకు థ్యాంక్యూ. ఇందులో హర్ష, సునీల్ గారి కామెడీ చాలా బాగా వచ్చింది. అందరూ ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’’.
ఆర్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ..‘‘కో ప్రొడ్యూసర్ అనంత్ గారి ఆధ్వర్యంలో, డైరెక్టర్ సంతోష్ గారి సూచనల మేరకు ఆర్ట్ వర్క్ చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’’.
నటుడు గుండు సుదర్శన్ మాట్లాడుతూ..‘‘ఇక్కడ అందరి చేతుల్లో గన్నులు ఉన్నాయి. అయితే కనిపించని గన్ ఒకటి ఉంది. దాని పేరు పెన్ను. అది మా డైరెక్టర్ సంతోష్ కంభంపాటిది. అందరికీ గన్స్ ఇచ్చారు. నేను అందులో ఒక బులెట్‌ని. సునీల్ గారు ఒక ఏకే47. శ్రద్ధాదాస్ గారు ఒక మిస్సైల్, వైవా హర్ష ఫుల్ ఆఫ్ ఫన్ బులెట్స్ నింపుకుని రెడీగా ఉన్నాడు. ఈ ఈవెంట్ కు ప్రీ కిడ్నాప్ ఈవెంట్ అని పేరు పెట్టడంలోనే డైరెక్టర్ క్రియేటివిటి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతలకు ఇదొక అద్భుతమైన విజయాన్నివాలని కోరుకుంటూ అందరికి బెస్ట్ విషెస్’’.
ఎడిటర్ శశాంక్ ఉప్పుటూరి మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన విశ్వప్రసాద్ గారికి థ్యాంక్యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, నిర్మాతలకు థ్యాంక్యూ. ఎడిటింగ్‌లో కొన్ని సీన్స్ కట్ చేయడానికి కూడా నాకు ఇబ్బంది కలిగింది. వైవా హర్ష రష్ చూసే నేను చాలా నవ్వుకున్నా. సినిమా చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా’’.
డిస్ట్రిబ్యూటర్ విశ్వనాథ్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా నేను చూశాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమాను మేము ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నాం. 125కు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’’.
సహ నిర్మాత అనంత్ సాయి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా స్టార్ట్ అవడానికి కారణం శ్రద్ధాదాస్, సునీల్ గారు. వాళ్లిద్దరూ ఓకే చెప్పిన వెంటనే సినిమా మొదలు పెట్టాం. ఒక పది పదిహేను నిమిషాలు తప్ప సినిమా మొత్తం నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.’’
వైవా హర్ష మాట్లాడుతూ..‘‘ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి వాళ్ల సపోర్ట్ ఎంతో ఎంకరేజ్‌మెంట్ గా ఉంటుంది. రెగ్యూలర్ సినిమాలు కాకుండా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్లు బాగా నవ్వుకునే సినిమా ఇది. డైరెక్టర్ సంతోష్ గారు చాలా సెన్సిబుల్ గా ఈ సినిమాను తీశారు. ఏప్రిల్ 19న మంచి ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నా’’.
నిర్మాత మహీధర్ రెడ్డి మాట్లాడుతూ..‘‘చాలా ప్యాషనేట్ గా ఈ సినిమా చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్టిస్టులందరూ చాలా బాగా చేశారు. డైరెక్టర్ సంతోష్ ప్రాణం పెట్టి చేశారు. 19న థియేటర్లలో ఈ సినిమా చూడండి. అందరూ ఎంజాయ్ చేస్తారు.’’
నిర్మాత దేవేష్ మాట్లాడుతూ...‘‘నేను నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్ గా ఈ సినిమా చూశా. చాలా బాగా వచ్చింది. యాంకర్ సుమ గారిని కిడ్నాప్ చేశాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరూ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా.’’
డైరెక్టర్ సంతోష్ కంభంపాటి మాట్లాడుతూ..‘‘ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ఏ సినిమా చేయాలన్నా నిర్మాతలు.. డైరెక్టర్, నటీనటులను నమ్మాలి. కానీ ఇలాంటి సినిమా చేయాలంటే ఇంకా ఎక్కువగా నమ్మాలి. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. దానికి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటితే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అలా అయితే ప్రాబ్లం అవుతుంది. అందుకే నా మీద నమ్మకం ఉంచిన నిర్మాతలకు హ్యాట్సాఫ్ చెప్తున్నా. నేను ఏ క్యారెక్టర్ కు ఎవరు కావాలని రాసుకున్నానో వాళ్లందరినీ ఇచ్చారు. మాలాంటి చిన్న సినిమాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నవాళ్లకు థ్యాంక్యూ. కీడాకోలాతో చైతన్యరావు నిరూపించుకున్నారు. మిగతావాళ్లంతా ఎంత ఫన్ చేస్తారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2 గంటల 10 నిమిషాల సినిమా ఇది. ఇందులో ఫస్ట్ 25 మినిట్స్ క్యారెక్టర్స్ గురించి చెప్పడానికి తీసుకున్నా. ఆ టైమ్ తప్ప మిగతా టైమ్ అంతా నవ్వుతూనే ఉంటారు. ఈ సినిమా బాగుంటే ప్రేక్షకులందరూ ఇంకో పదిమందికి చెప్పండి. బాగా లేకపోతే వద్దని చెప్పండి. ఈ నెల 19న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి.’’
హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ..‘‘కొంచెం గ్యాప్ తర్వాత నేను ఒక తెలుగు సినిమా చేశా. గ్లామర్ పరంగా కాకుండా నటనకు స్కోప్ ఉన్న సినిమా ఇది. ఇందులో నా క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుంది. నా కోసం ఈ పాత్రను రాసిన డైరెక్టర్ సంతోష్ గారికి థ్యాంక్యూ. ఇందులో కొంచెం సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇలాంటి నిర్మాతలు ఉంటే ప్రతి ఒక్కరికీ చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సునీల్, హర్ష, చైతన్యతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. వాళ్ల కామెడీ టైమింగ్ ను మ్యాచ్ చేయడం చాలా కష్టం. కానీ నేను కొంచెం ట్రై చేశా. ఈ సినిమాను ఏప్రిల్ 19న అందరూ థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నా’’.
చీఫ్ గెస్ట్ ప్రముఖ నిర్మాత, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ..‘‘నిర్మాత మహీధర్ నాకు 20 ఏళ్ల నుంచి ఫ్రెండ్. మేమిద్దరం సియాటెల్‌లో ఉండేవాళ్లం. మేము అక్కడ సినిమా చూడాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి చూసేవాళ్లం. అయితే చిరంజీవి గారి స్టాలిన్ సినిమా నుంచి సియాటెల్‌లో మహీధర్ సినిమాలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంత ప్యాషన్ ఉన్న మహీధర్ కచ్చితంగా ఒక మంచి సినిమా తీశారని నమ్ముతున్నా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ సినిమా పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’’.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ..‘‘ఎక్కడో కరీంనగర్‌లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మంచి పేరు తెచ్చుకుని మంచి సినిమా చేయాలనుకుని చేస్తున్నా. ఎప్పటికైనా నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి సుమ గారు యాంకరింగ్ చేయాలని అనుకున్నా. ఈ రోజు చేశారు. ఇది పెద్ద సక్సెస్ గా భావిస్తున్నా. 300పై చిలుకు సినిమాలు చేసి 90శాతం సక్సెస్ రేట్ ఉన్న సుమ గారు మా సినిమా చేయడం మాకు గౌరవం. మా సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. నిర్మాతలు మహీధర్, దేవేష్ నిజంగా అద్భుతమైన నిర్మాతలు. ఎంతో బిజీగా ఉన్న ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి సినిమా చేయడం చాలా కష్టం. మా డైరెక్టర్ అక్కడే ఫస్ట్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాతో మన ఇండస్ట్రీకి ఇంకో మంచి డైరెక్టర్ రాబోతున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఇది చిన్న సినిమా కాదు.. కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్. ఏప్రిల్ 19న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్‌తో చూడాల్సిన సినిమా ఇది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నా. అందరూ మా సినిమాను ప్రమోట్ చేయండి’’.
తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్, తోటపల్లి, మధు, జబర్దస్త్ రోహిణి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం - సంతోష్ కంభంపాటి
ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్
నిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్
సహ నిర్మాత -అనంత సాయి
డీవోపీ-బాల సరస్వతి
సంగీతం-రీ
ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి
ఆర్ట్ డైరెక్టర్ - ఉపేందర్ రెడ్డి
డిజైనర్ - చిన్మయి కాకిలేటి
పబ్లిసిటీ డిజైనర్ - అనంత్ కంచెర్ల
సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు
సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల