pizza
Polimera 2 Pre Release Event
'Ma Oori Polimera-2' is like my own movie: Hero Adivi Sesh at pre-release event
“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది: “మా ఊరి పొలిమేర -2 “ ప్రీరిలీజ్ వేడుక‌లో హీరో అడ‌వి శేష్
You are at idlebrain.com > News > Functions
Follow Us


31 October 2023
Hyderabad

Director Dr. Anil Vishwanath proved his mettle as a talented director with the film 'Ma Oori Polimera' on OTT. His latest film 'Ma Oori Polimera-2' is its sequel. 'Ma Oori Polimera-2', produced by Shree Krishna Creations and presented by Gowr Ghana Babu, is a rare thriller and an even more stunning sequel to be made in Telugu. Starring Satyam Rajesh and Dr. Kamakshi Bhaskarla in lead roles, the film also features Getup Srinu, Rakendu Mouli, Baladitya, Sahitya Dasari, and Ravi Varma play different roles in it.

The film's pre-release event was held in Hyderabad on Monday in the presence of the versatile actor Adivi Sesh and blockbuster producer SKN as chief guests. Director Karuna Kumar, who played an important role in the film, along with popular singer Penchal Das and others, were also present along with the film's cast and crew. The Big Ticket was unveiled by Sesh and SKN.

The film will hit the screens on November 3.

Speaking on the occasion, Adivi Sesh said that those technicians who worked with him on 'Kshanam' are part of 'Ma Oori Polimera-2'. He added that Anil, the director of the film, is a good friend of his. "I know his talent. I am glad that he has made a sequel to a blockbuster film. This movie is like my own film. Many talented people have worked on this thriller," the 'Goodachari' actor said, adding that the film's success is certain.

Producer SKN said that the movie will surely be a commercial hit. "These days, there is no difference between a small movie and a big movie. Making any sort of film is a hard task. The movie-loving audience wants a good movie from us. Audiences will definitely appreciate fresh content. This team looks tough. Creating a franchise for a movie is difficult. This movie has achieved such a rare feat. I appreciate the director for this. The reason why 'Ma Oori Polimera 2' is getting so much buzz today is that Vamsi Nandipati, thanks to his rich taste, has brought so much buzz to this movie by deciding to release it. Soon we are going to see him emerge as a big producer. We have seen Part 1 of this movie on OTT and we want everyone to enjoy the second part in the theater," the producer added.

Director Anil Vishwanath said that this movie was begun on a small scale and has since become a big-scale project because of Vamsi Nandipati. He thanked the film's producer for his uncompromising nature. "The contribution of heroine Kamakshi is unforgettable as far as I am concerned. Apart from being a heroine, she also worked with great dedication in the direction department. The music director-cinematographer duo are the main pillars of this movie. Everyone worked very hard to bring out the best product. A big banner is happy to release this film. I know the result of this movie already. I am very confident about the success of this film," he added.

Satyam Rajesh said that director Anil is the soul of this movie. He also lauded the producer's passion. "Vamsi Nandipati is the reason why we are releasing confidently as if this is a Rs 100 crore film. Technicians are the heroes of this movie," the actor said.

Producer Gowr Kriesna said that the director shot the story very well. "Satyam Rajesh's contribution to complete this movie will be remembered for long. The entire team has worked very hard. Vamsi Nandipati is the reason why this film is getting a grand release on November 3. There is a certain belief that the film will be a huge success," he added.

Kamakshi Bhaskarla said that she is thankful to the director for the opportunity to work in the direction department when she is the heroine. "After the release of this movie, everyone will get better recognition," she hoped.

“మా ఊరి పొలిమేర -2 “నా సొంత సినిమా లాంటింది: “మా ఊరి పొలిమేర -2 “ ప్రీరిలీజ్ వేడుక‌లో హీరో అడ‌వి శేష్

“మాఊరి పొలిమేర" చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా మంగళ‌వారం ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు అడ‌వి శేష్‌తో పాటు బ్లాక్‌బ‌స్ట‌ర్ నిర్మాత ఎస్‌కేఎన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుక‌లో ఈ చిత్రంలో ఓ ముఖ్య‌పాత్ర‌ను పోషించిన ద‌ర్శ‌కుడు క‌రుణ‌కుమార్ తో, ప్ర‌ముఖ గాయ‌కుడు పెంచ‌ల‌దాస్‌తో పాటు చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గోన్నారు.

ఈ వేదిక‌పై చిత్ర బిగ్ టికెట్‌ను అతిథులు అడ‌వి శేష్‌, ఎష్‌కేఎన్‌లు ఆవిష్క‌రించారు.

అనంత‌రం అడ‌వి శేషు మాట్లాడుతూ “నా ఫ‌స్ట్ స‌క్సెస్ క్ష‌ణంకు వ‌ర్క్ చేసిన టీమ్ అంతా ఈ టీమ్‌లో వున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అనిల్ నాకు మంచి స్నేహితుడు. అత‌ని ప్ర‌తిభ నాకు తెలుసు. ఈ రోజు అత‌ను ఓ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా తీసి దానికి సీక్వ‌ల్ తీయ‌డం ఆనందంగా వుంది. ఇది నా సొంత సినిమా లాంటింది.ఈ చిత్రానికి ఎంతో మంది టాలెంటెడ్ పీపుల్ వ‌ర్క్ చేశారు. త‌ప్ప‌కుండా ఈ చిత్ర మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ సినిమాకు హిట్ క‌ళ క‌నిపిస్తుంది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదు. ఏదైనా అదే క‌ష్ట‌మే. సినిమాను ఆద‌రించే ఆడియ‌న్స్‌కు మంచి సినిమా కావాలి అంతే. కొత్త కంటెంట్‌ను ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా ఆద‌రిస్తారు. ఈ టీమ్ క‌ష్టం క‌నిపిస్తుంది. సినిమాకు ఓ ఫ్రాంచైజీ క్రియేట్ చేయ‌డం క‌ష్టం. అలాంటి అరుదైన ఫీట్ ఈ సినిమాకు కుద‌రింది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడిని అభినందిస్తున్నాను. ఈ సినిమాకు ఈ రోజు ఇంత బ‌జ్ రావ‌డానికి కార‌ణం వంశీ నందిపాటి ఆయ‌న అభిరుచే ఈ సినిమాకు ఇంత బ‌జ్ తీసుకొచ్చింది. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను మ‌నం పెద్ద నిర్మాత‌గా చూడ‌బోతున్నాం. ఈ సినిమా పార్ట్ 1ను ఓటీటీలో చూసిన మ‌నం పొలిమేర 2ను థియేట‌ర్‌లో చూసి ఆ ట్బిస్ట్‌లు ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ చిన్న‌సినిమాగా మొద‌లైన ఈ సినిమా ఈ రోజు పెద్ద సినిమాగా మారిందంటే అందుకు కార‌ణం వంశీ నందిపాటి. పొలిమేర 2 విష‌యంలో నాకు బడ్జెట్ ప‌రంగా స‌హ‌క‌రించిన నిర్మాత‌కు థ్యాంక్స్. ఈ సినిమా విష‌యంలో నాకు హీరోయిన్ కామాక్షి గారి స‌హ‌కారం మ‌రువ‌లేనిది. హీరోయిన్‌గానే కాకుండా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో కూడా ఆమె ఎంతో డేడికేష‌న్‌తో ప‌నిచేసింది. సంగీత ద‌ర్శ‌కుడు గ్యానీ, కెమెరామెన్ ర‌మేష్ ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్స్‌ల్లో వుంటారు. ఈ సినిమాకు అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. పెద్ద సంస్థ ఈ చిత్రాన్నివిడుద‌ల చేయ‌డం ఆనందంగా వుంది. ఈ సినిమా రిజ‌ల్ట్ నాకు తెలుసు. ఈ సినిమా విజ‌యంపై నేను చాలా న‌మ్మ‌కంతో వున్నాను. అంద‌రం త‌ప్ప‌కుండా స‌క్సెస్ మీట్‌లో క‌లుసుకుందా అన్నారు.

స‌త్యం రాజేష్ మాట్లాడుతూ దర్శ‌కుడు అనిల్ ఈ సినిమాకు క‌ర్మ క‌ర్త క్రియ అంతా ఆయ‌నే. నిర్మాత ఎంతో ఫ్యాష‌న్‌తో తీశాడు. ఈ రోజు ఇంత గొప్ప‌గా 100 కోట్ల సినిమాలా కాన్ఫిడెంట్‌గా విడుద‌ల చేస్తున్నామంటే వంశీ నందిపాటి కార‌ణం. ఈ సినిమాకు టెక్నిషియ‌న్సే హీరోలు. ఈ చిన్న సినిమాను అంద‌రూ ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

నిర్మాత గౌరిక్రిష్ణ మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను ఎంతో అద్భుతంగా తీశాడు. ఈ సినిమా కంప్లీట్ చేయ‌డానికి స‌త్యం రాజేష్ స‌హ‌కారం మ‌రువ‌లేనిది. సినిమా టీమ్ అంతా ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేశారు. ఈ చిత్రం ఈ రోజు ఇంత గ్రాండ్‌గా విడుదల కావ‌డానికి కార‌ణం వంశీ నందిపాటి గారు. త‌ప్ప‌కుండా చిత్రం ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.

కామాక్షి భాస్క‌ర్ల మాట్లాడుతూ ఈ సినిమాకు హీరోయిన్‌తో పాటు ద‌ర్వ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్‌కు నా థ్యాంక్స్‌. ఈ సినిమా విడుద‌ల త‌రువాత ప్ర‌తి ఒక్క‌రికి మంచి గుర్తింపు వ‌స్తుంది అన్నారు.

Photo Gallery

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved