pizza
Alanati Ramachandrudu Press Meet
‘అలనాటి రామచంద్రుడు’ హానెస్ట్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది: ప్రెస్ మీట్ లో హీరో కృష్ణ వంశీ &టీం
You are at idlebrain.com > News > Functions
Follow Us


30 July 2024
Hyderabad

 

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ లో నటిస్తున్న లవ్ ఎంటర్ టైనర్ ‘అలనాటి రామచంద్రుడు’. చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టాప్ ప్రొడక్షన్& డిస్ట్రిబ్యుషన్ సంస్థ SVC ( శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న గ్రాండ్ గా విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలో మూవీ యూనిట్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. హైమావతి, శ్రీరామ్ జగదీశ్, విక్రమ్ , డైరెక్టర్ ఆకాష్ గారికి చాలా థాంక్స్. నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ గారికి చాలా థాంక్స్. దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఇందులో నా పాత్ర పేరు సిద్దు. తను రామచంద్రుడు లాంటి వాడే. చాలా ఇంట్రోవర్ట్. చాలా మంచి ఎమోషనల్ కోర్ వున్న సినిమా ఇది. ఆకాష్ గారు చాలా హానెస్ట్ గా తీశారు. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను' అన్నారు

డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలు థాంక్స్. ఇది ఈ జనరేషన్ కథ. చాలా హానెస్ట్ లవ్ స్టొరీ. అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫీల్ గుడ్ మూవీ. ఫ్యామిలీ డ్రామా. ఖచ్చితంగా ఫ్యామిలీ అండ్ యంగ్ జనరేషన్ సినిమా చూస్తారని నముతున్నాను. కథ అనుకున్నపుడే కొత్తవారితో చేయాలని అనుకున్నాను. కృష్ణ వంశీ చాలా అద్భుతంగా నటించాడు. చాలా కష్టపడ్డాడు. ధరణి పాత్రలో మోక్ష పెర్ఫెక్ట్. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా అందరూ చూడాలి' అన్నారు.

హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ధరణి పాత్ర మెమరబుల్ గా వుంటుంది. ఇది క్లాసిక్ లవ్ స్టొరీ. దిల్ రాజు గారు రిలీజ్ చేయడం ఒక బ్లెసింగ్ గా భావిస్తున్నాం. అందరూ తప్పకుండా సినిమాని థియేటర్స్ లో చూడండి' అని కోరారు.

నిర్మాత శ్రీరామ్ జడపోలు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దిల్ రాజు గారికి మా కృతజ్ఞతలు. చాలా సపోర్ట్ చేశారు. ఆయనకి సినిమా నచ్చి రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. హైనివా క్రియేషన్స్ లో మొదటి సినిమా ఇది. కొత్త ట్యాలెంట్ ని పరిచయం చేస్తూ ఈ సినిమా చేశాం. టీజర్ ట్రైలర్ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రయత్నం మేము చేశాం. అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి కథ, ఎమోషన్, మ్యూజిక్, విజువల్స్ వున్న సినిమా ఇది. ఈ జనరేషన్ కి కావాల్సిన ప్యూర్ లవ్ ఈ సినిమాతో చూపించబోతున్నాం. తప్పకుండా మీకు నచ్చుతుంది. ఆగస్ట్ 2న సినిమా విడుదలౌతుంది. ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ టీం అంతా పాల్గొన్నారు.

Photo Gallery

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved