pizza
Shivalinga Will Become Huge Hit In Telugu, Tamil Like In Kannada: Lawrence
క‌న్న‌డంలోలాగా `శివ‌లింగ` తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధిస్తుంది - లారెన్స్
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 April 2017
Hyderaba
d

Raghava Lawrence, Ritika Singh starrer Shivalinga directed by P Vasu and produced by Ramesh P Pillai under Abhishek Films Banner is all set to release worldwide on April 14th. The film will be released in Telugu under Suraksh Entertainments Banner.

In a press meet today, Lawrence said, “I have reached this stage from almost nothing. I have assistance of four important persons in my life to reach the stage- they are my mother, Lord Raghavendra Swamy, Rajinikanth who gave me the chance to become a dancer and Chiranjeevi gaaru who made me a choreographer. I thank all these four people. Shivalinga was a huge hit in Kannada. I liked Shakthi Vasu's performance in Kannada version. So, we extended his role in Telugu and Tamil versions. He will surely become a good actor. The film that has dancer like Lawrence and fighter like Ritika Singh will entertain one and all. Sarvesh Murari has shown me handsomely. I hope, like in Kannada, Shivalinga will become a huge hit in Telugu as well as in Tamil.”

P Vasu said, “The film was supposed to release in January. But, it has been delayed due to some technical reasons. We have great belief in the project to become a blockbuster. Ritika has played the role which was originally essayed in Kannada by Vedika. Ritika hasn't watched the original version and she acted as per my instructions. Lawrence is a good human-being, actor, director and dancer. Shakthi Vasu who won accolades for his acting in Kannada version has played a key role in Telugu, Tamil versions. As suggested by Lawrence master, we have extended Shakthi's role here. This movie will surely bring good name to everyone associated with it.”

Malkapuram Shivakumar said, “P Vasu directed Shivalinga in Kannada which was a runaway hit. We hope, it will do well in Telugu as well. This is immediate project for Ritika in Telugu after the super hit of Guru. Lawrence master enthralled with his exceptional show in Kanchana and Ganga. We hope, Shivalinga too will become a super hit like them. We are happy to release the film under our banner of Suraksha Entertainments.”

Shakthi Vasu said, “I acted alongside Shivarajkumar in Kannada vesrion of Shivalinga. I got good response there. Lawrence master has improvised my character in Telugu, Tamil. I treat Lawrence master like my own brother.”

Ritika Singh said, “Guru is a very special film for me. I'm really glad to do Shivalinga, after Guru. I'm really feeling proud to associate with senior director like P Vasu. I hope, I will earn good name with Shivalinga.”

Bellamkonda Suresh and Sarvesh Murari also attended the event.

క‌న్న‌డంలోలాగా `శివ‌లింగ` తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధిస్తుంది - లారెన్స్

రాఘ‌వేంద్ర లారెన్స్‌, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా అభిషేక్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై పి.వాసు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మేష్ పి.పిళ్లై నిర్మించిన చిత్రం `శివ‌లింగ‌`. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమాను తెలుగులో సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

లారెన్స్ మాట్లాడుతూ - ``నేను చిన్న స్థాయి నుండి ఈ స్థాయికి వచ్చాను. అందుకు కార‌ణం న‌లుగురు వ్య‌క్తులు. అమ్మ‌, రాఘ‌వేంద్ర‌స్వామి, ఇండ‌స్ట్రీలో నాకు డ్యాన్స‌ర్ స్థానాన్ని క‌ల్పించిన సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌గారు, నన్ను కొరియోగ్రాఫ‌ర్‌గా చేసిన చిరంజీవిగారు. వీరి న‌లుగురుకి నా కృత‌జ్ఞ‌త‌లు. క‌న్న‌డంలో సినిమా చాలా బాగా విజ‌యాన్ని సాధించింది. అందులో శ‌క్తివాసు న‌ట‌న చూసి దీన్ని ఇంకాస్తా చేంజ‌స్ చేసి చేస్తే శ‌క్తివాసుకి మంచి పేరు వ‌స్తుంద‌ని నేను చెప్ప‌గానే వాసుగారు మార్పులు చేసి తెలుగు, త‌మిళంలో సినిమాను రూపొందించారు. రితిక సింగ్ వంటి ఫైట‌ర్‌, లారెన్స్ వంటి డ్యాన‌ర్స్ క‌లిసి చేసిన ఈ సినిమా అంద‌రినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. స‌ర్వేష్ మురారి న‌న్ను ఎంతో అందంగా చూపించాడు. క‌న్న‌డంలో శివ‌లింగ పెద్ద విజ‌యం సాధించిన‌ట్లే తెలుగు, త‌మిళంలో కూడా ఘ‌న విజ‌యాన్నిసాధిస్తుంది`` అన్నారు.

పి.వాసు మాట్లాడుతూ - ``జ‌న‌వ‌రిలో రావాల్సిన సినిమా. కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో ఆగింది. లెటైనా, లెటెస్ట్‌గా వ‌స్తున్నాం. క‌న్న‌డంలో వేదిక చేసిన క్యారెక్ట‌ర్‌ను రితిక సింగ్ అద్భుతంగా చేసింది. రితిక క‌న్న‌డ మాతృక‌ను చూడ‌కుండా నేను చెప్పింది చేసుకుంటూ వ‌చ్చింది. లారెన్స్ అద్భుత‌మైన డ్యాన‌ర్స్‌, నటుడు, డైరెక్ట‌ర్‌, వ్య‌క్తి. శ‌క్తివాసు ఈ సినిమాలో కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. కన్న‌డ‌లో శ‌క్తివాసు పాత్ర‌కు మంచి పేరు వ‌చ్చింది. లారెన్స్ సూచ‌న మేర తెలుగు, త‌మిళంలో త‌న క్యారెక్ట‌ర్‌ను ఇంకా పెంచాం. ఈ సినిమా అంద‌రికీ మంచి పేరు తెస్తుంది`` అన్నారు.

మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``పి.వాసుగారు క‌న్న‌డంలో శివ‌లింగ సినిమాను డైరెక్ట్ చేశారు. కన్న‌డ‌లో సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమా ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాను. రితిక గురు తర్వాత తెలుగులో చేసిన సినిమా ఇది. లారెన్స్ మాస్ట‌ర్ కాంచ‌న‌, గంగ చిత్రాల్లో అంద‌రినీ మెప్పించారు. శివ‌లింగ సినిమా కూడా అదే రేంజ్‌లో పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను. మా సుర‌క్ష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సినిమాను తెలుగు విడుద‌ల చేయ‌డం అనేది చాలా సంతోషంగా ఉంది`` అన్నారు.

శ‌క్తివాసు మాట్లాడుతూ - ``క‌న్నడంలో శివ‌రాజ్‌కుమార్‌గారితో క‌లిసి శివ‌లింగ సినిమా చేశాను. చాలా మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాలో నా క్యారెక్ట‌ర్‌ను లారెన్స్ మాస్ట‌ర్‌గారు ఇంప్ర‌వైజ్ చేసి చేయించారు. లారెన్స్‌గారిని నా స్వంత సోద‌రుడిలా భావిస్తున్నాను`` అన్నారు.

రితిక సింగ్ మాట్లాడుతూ - ``నాకు గురు సినిమా స్పెష‌ల్‌. గురు త‌ర్వాత శివ‌లింగ సినిమా చేయ‌డం సంతోషంగా ఉంది. వాసుగారి వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్‌తో చేయ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. శివ‌లింగ‌తో నాకు ఇంకా మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో బెల్లంకొండ సురేష్‌, స‌ర్వేష్ మురారి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved