టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం హైదరాబాద్‌లో ప్రకటించారు. 2015-16కుగానూ ఈ అవార్డులను ప్రకటించారు.
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ``30 రోజుల ప్రక్రియ పూర్తయింది. 2015-16కుగానూ అవార్డులను ప్రకటిస్తున్నాం. విశాఖపట్టణంలో జరిగే వేదికపై ఈ అవార్డుల వేడుకను నిర్వహిస్తాం. దాదాపు 50 వేల మంది ఒకేసారి వీక్షించేలా ప్లాన్ చేస్తున్నాం. ఈ అవార్డుల్లో రెండు రకాలున్నాయి. ఒకటి మా కమిటీ సభ్యులు కొంతమందిని ఎంపిక చేయగా అందులోనుంచి ప్రేక్షకులు ఎంపిక చేసినవి, మరొకటి ప్రేక్షకులే మాకు సూచించినవి. అలాంటివాటిని జ్యూరీ అవార్డుల కింద ఇస్తున్నాను. ఈ అవార్డుల వేడుకకు హాజరయ్యేవారు చాలా ఆనందంతో ఉంటే ఆ పాజిటివిటీని నేను గ్రహిస్తుంటాను. కళలను పోషించడం, ప్రశంసించడం నాకు చాలా ఇష్టం. ఈ వేడుక ఈ నెల 8న వైజాగ్‌లో జరగనుంది. టీవీ9తో పాటు మిగిలిన అన్ని ఛానెళ్లకు కూడా అరగంట తేడాతో మా కార్యక్రమాన్ని ప్రసారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం`` అని అన్నారు.
పింకి రెడ్డి మాట్లాడుతూ ``నేను మా నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నాను. 50 వేల మందిని ఒక చోట చూడటం అనే ఫీలింగ్ చాలా బావుంది`` అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బి.గోపాల్, రఘురామ కృష్ణంరాజు, టీవీ9 విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.