pizza
అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన అంకిత్ తివారి మ్యూజికల్ కాన్ సర్ట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 May 2015
Hyderabad

About the Ankit Tiwari
Ankit Tiwari live concert which was to happen on May 23rd at Boulder Hills Golf and club was called off.

About the Event
LIVE.IN.CONCERT with Ankit Tiwari on 23rd May, 2015 at Boulder Hills Golf & Country Club, Gachibowli, Hyderabad was called off yesterday afternoon as the venue MGF EMMAR BOULDER HILLS GOLF AND COUNTRY CLUB got a notice from the court that their shouldn't be any events happening in the premises of Boulder hills golf and country club.

We were asked to stop the production work and dismandle the setup which was completed and was ready for the show.

Since we have no chance of shifting the venue in such short notice we are forced to call off the event.

However a new date will be announced shortly.

ఈనెల 23 (శనివారం) హైదరాబాద్, బౌల్డర్ హిల్స్ లో అత్యంత ఘనంగా జరగాల్సిన అంకిత్ తివారి లైవ్ మ్యూజికల్ కాన్ సర్ట్ అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా, బుకింగ్ ద్వారా టికెట్లు కొనుక్కొన్నవాళ్లకు వారి డబ్బులను వెనక్కి ఇవ్వడమో, లేదా నెక్స్ట్ ఈవెంట్ కి వారికి ఆ టికెట్ ను వేలిడేట్ చేయడమో జరుగుతుంది.

అయితే.. ఈవెంట్ కు కావాల్సిన సౌండ్, స్టేజ్, లైటింగ్, బారికేడింగ్ వంటి సరంజామా అంతా సిద్ధం చేసుకొన్నాక.. ఉన్నపళంగా ఈవెంట్ ను క్యాన్సిల్ చేయమని కేవలం ఒక్కరోజు ముందు బౌల్దర్ హిల్స్ వారు మాకు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటూ ఈవెంట్ ఆర్గనైజర్ ఎస్.వి.శ్రీకాంత్ తన బాధను వ్యక్తం చేసారు.

బౌల్దర్ హిల్స్ వారు ఈ విధంగా తమకు కలిగించిన అసౌకర్యం కారణంగా తమకు భారీ మొత్తంలో నష్టం వాటిల్లిందని.. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని శ్రీకాంత్ ప్రశ్నించారు.

ఇకపోతే.. అంకిత్ తివారి తమకు తన పూర్తి సహకారం అందిస్తున్నారని, మరోమారు మేము ప్లాన్ చేయబోయే ఈవెంట్ లో తప్పకుండా పాల్గొంటానని అంకిత్ తివారి తమకు ప్రామిస్ చేసారని శ్రీకాంత్ తెలిపారు.
తమ వల్ల సంగీత అభిమానులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నామని ఆయన అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రదీప్ అగర్వాల్ మరియు రాజ్ పాల్గొన్నారు!


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved