రామ్ శంకర్ , నిఖిషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వం లో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న 'అరకు రోడ్ లో' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా బుధవారం షూటింగ్ లొకేషన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో
హీరో రామ్ శంకర్ మాట్లాడుతూ... గత రెండు రోజులుగా పబ్ లో షూటింగ్ జరుపుతున్నాం. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీకి సంబంధించి సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కే ఈ సినిమా అందికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది. నిర్మాతలు మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి మూవీ నిర్మాణానానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.
Nikesha PatelGlam gallery from the event
హీరోయిన్ నిఖిశా పటేల్ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా యాక్షన్ తరహలో సాగే థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలోని పాత్ర నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా రామ్ శంకర్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ప్రతి విషయం లో అయన కేర్ చూసి షాక్ అయ్యాను. అలాగే దర్శకుడు వాసుదేవ్ మంచి విజన్ ఉన్న వ్యక్తి అన్నారు.
దర్శకుడు వాసుదేవ్ మాట్లాడుతూ.. ఇది థ్రిల్లర్ నేపద్యం లో రూపొందే కథ. సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఏప్రిల్ 15 కి మొత్తం షూటింగ్ పూర్తీ చేసి చిత్రాన్ని ఏప్రిల్ ఎండింగ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నేను కొత్త దర్శకుడిని అయినా కూడా రామ్ శంకర్ ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే సినిమా కూడా అందిరికి నచ్చేలా ఉంటుంది అన్నారు.
నటుడు అభిమన్యు సింగ్ మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. తప్పకుండ నా కెరీర్ లో మరో బెస్ట్ రోల్ ఇది అని చెప్పాలి. అలాగే రామ్ శంకర్ కూడా అద్బుతంగా నటిస్తున్నాడు. అతనికి కూడా కెరీర్ పరంగా మంచి హిట్ ఇచ్చే సినిమా అవుతుంది.. అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన సురేష్ వర్మ మాట్లాడుతూ.. ఇది మా మొదటి చిత్రం. వాసుదేవ్ చెప్పిన కథ చాలా బాగా నచ్చడం తో ఈ సినిమాను మేమే నిర్మించాలని అనుకున్నాం. అన్ని రకాల కమర్షియల్ అంశాలున్న ఈ సినిమా మంచి థ్రిల్లర్ కథతో రూపొందుతుంది. ఒకవైపు చిత్రీకరణ, మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు త్వరలోనే పూర్తి చేసి ఏప్రిల్ చివర్లో విడుదల చేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్, కెమెరామెన్: జగదీశ్ చీకటి, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: కృష్ణ మాయ, స్టంట్స్: జాషువా, నిర్మాతలు: మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి, రచన,దర్శకత్వం: వాసుదేవ్.