pizza
Ardhanaari teaser launch
`అర్ధ‌నారి` టీజ‌ర్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 June 2016
Hyderabad

అర్జున్ య‌జ‌త్‌, మౌర్యాని హీరో హీరోయిన్లుగా భ‌ర‌త్ రాజ్ స‌మ‌ర్ప‌ణ‌లో ప‌త్తికొండ సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం అర్ధ‌నారి. భానుశంక‌ర్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ర‌వికుమార్‌.ఎమ్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. సీనియ‌ర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా...

ద‌ర్శ‌కుడు భానుశంక‌ర్ చౌద‌రి మాట్లాడుతూ ``కొత్త అటెంప్ట్ చేశాం. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ఈ సినిమాను దేశం కోసం సేవ చేసిన అబ్దుల్ క‌లామ్‌గారికి అంకిత‌మిస్తున్నాను. ఈ క‌థ‌ను చెప్ప‌గానే సాధార‌ణంగా నిర్మాత‌లు ఎవరూ ధైర్యం చేయ‌రు. ఈ క‌థ‌తో సినిమా చేయ‌డానికి చాలా మంది నిర్మాత‌ల‌ను క‌లిశాను. కానీ వారు ఆలోచించారు. అప్పుడు నిర్మాత‌లు ముందుకు వ‌చ్చి మ‌నమే ఈ సినిమా చేద్దామ‌ని అన్నారు. సినిమా 40 కోట్ల‌ను డిమాండ్ చేస్తుంది. అయితే మా ప‌రిమిత బ‌డ్జెట్‌లో సినిమాను చేశాం.95 రోజుల పాటు చిత్రీక‌రించిన ఈ సినిమాలో 85 రోజుల‌ను నిజామాబాద్‌లోనే షూట్ చేశాం. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను జూలై 1న విడుద‌ల చేస్తున్నాం. అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

సీనియ‌ర్ పాత్రికేయుడు ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ ``ద‌ర్శ‌కుడు భానుశంక‌ర్‌గారు చాలా టాలెంటెడ్‌. త‌న ప్రతిభ‌కు త‌గ్గ గుర్తింపు ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ చిత్రంలో ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా పెద్ద హిట్ ల‌భిస్తుంది. టీజ‌ర్ చూస్తుంటే ఒళ్ళు జ‌ల‌ద‌రించింది. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

నిర్మాత‌ ర‌వికుమార్ మాట్లాడుతూ ``క‌థ న‌చ్చ‌డంతో సినిమాను పెద్ద లెవ‌ల్లోనే నిర్మించాం. ఈ క‌థ‌తో సినిమా చేయ‌డానికి ఆలోచిస్తారు కాబ‌ట్టి నేను నా మిత్రులైన భ‌ర‌త్‌రాజ్‌, క‌ర్ల‌పూడి కృష్ణ‌, భానుశంక‌ర్‌గారితో క‌లిసి సినిమాను పూర్తి చేశాం`` అన్నారు.

క‌ర్ల‌పూడి కృష్ణ మాట్లాడుతూ ``బ‌ల‌మైన క‌థ‌. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.

చిత్ర సమర్పకుడు భ‌రత్‌రాజ్ మాట్లాడుతూ ``డైరెక్ట‌ర్ భానుశంక‌ర్‌గారు ప‌దిహేను సంవ‌త్స‌రాల నుండి ప‌రిచ‌యం ఉంది. మంచి మెసేజ్‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా`` అన్నారు.

మౌర్యాని మాట్లాడుతూ ``హీరోయిన్‌గా నా తొలి చిత్రం. నాకు మంచి పేరు తెస్తుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్ః డి.వై.స‌త్యనారాయణ‌, కొరియోగ్ర‌ఫీః స్వ‌ర్ణ‌, ఫైట్స్ః నందు, డ్రాగ‌న్ ప్ర‌కాష్‌, మాట‌లుః నివాస్‌, పాట‌లుః శ్రీవ‌ల్లి, రామాంజ‌నేయులు, సంగీతంః ర‌వివ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః సాయిశ్రీనివాస్ గాదిరాజు, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, నిర్వ‌హ‌ణ నిర్మాతః క‌ర్ల‌పూడి కృష్ణ‌, నిర్మాతః ర‌వికుమార్‌.ఎమ్‌, క‌థ‌,స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః భానుశంక‌ర్ చౌద‌రి.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved