pizza
Banthipoola Janaki release on 26 August
ఆగ‌స్ట్ 26న `బంతిపూల జాన‌కి`
You are at idlebrain.com > News > Functions
Follow Us

24 August 2016
Hyderaba
d

ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుధీర్ ముఖ్య తారాగణంగా..  హాస్యానికి పెద్ద పీట  వేస్తూ తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ "బంతిపూల జానకి".  ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు.  తేజ ఎగ్జిక్యూటివ్ ప్రొద్యూసర్. సినిమా ఆగ‌స్ట్ 26న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్బంగా బుధ‌వారం హైద‌రాబాద్‌లో పాత్రికేయుల సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా.....

నిర్మాత రామ్‌ మాట్లాడుతూ - '' మా బ్యానర్‌లో విడుదలవుతోన్న తొలి చిత్రం. అల్రెడి విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సినిమాను ఆగస్ట్‌ 26న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాం'' అన్నారు. 

దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ మాట్లాడుతూ - ''దర్శకుడిగా నా రెండో చిత్రం. అవుటండ్‌ అవుట్‌ కామెడి అండ్‌ థ్రిల్లర్‌ ఎంటర్‌ టైనర్‌. మంచి మ్యూజిక్‌ కుదిరింది. సినిమాను 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాం'' అన్నారు. 

ధన్‌రాజ్‌ మాట్లాడుతూ - ''నిర్మాతలు నన్నో, ఏ ఒక్కరినో నమ్మి కాకుండా కథను నమ్మి ఈ సినిమాను చేశారు. ఈ సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ళడానికంటే ముందు స్క్రిప్ట్‌పై బాగా వర్క్‌ చేశాం. అంతా ఓకే అయిన తర్వాతే సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్లాం. నవ్వులతో పాటు థ్రిల్లింగ్‌గా సాగే సినిమా ఇది. రాజుగారి గది తర్వాత హ్యాపీగా ఫీలై చేసిన సినిమా. ఆగస్ట్‌ 26న మీ ముందుకు రానున్నాం. సినిమాను పెద్ద సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాను'' అన్నారు. 

శివాజీ రాజా మాట్లాడుతూ - ''సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. ధన్‌రాజ్‌, సుధీర్‌ అండ్‌ టీం బాగా చేశారు. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా బావుంది'' అన్నారు. 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తేజ మాట్లాడుతూ - "బోలె సంగీతం "బంతిపూల జానకి" చిత్రానికి మెయిన్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఆడియోకు మంచి స్పందన లభిస్తోంది.  బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ కామెడీ థ్రిల్లర్ ను  ఈనెల 26న విడుద‌ల చేస్తున్నాం" అన్నారు

ఈ కార్యక్రమంలో ఇంకా మ్యూజిక్‌ డైరెక్టర్‌ బోలే, రైటర్‌ శేఖర్‌ విఖ్యాత్‌, సుధీర్‌, తదితరులు పాల్గొన్నారు. 

డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: డా. శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తేజ, నిర్మాతలు: కళ్యాణి-రామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్



Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved