సుధీర్‌బాబు, వామిక, ధన్య బాలకృష్ణ కీలక పాత్రల్లో నటించిన సినిమా భలే మంచి రోజు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. విజయ్ కుమార్, శశిధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటైంది.
దర్శకుడు మాట్లాడుతూ ``ఆడియోకి చాలా మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బావుందని అందరూ అంటున్నారు. మహేష్ కి నచ్చినట్టుగానే పాటలు అందరికీ నచ్చాయి. మిల మిల పాట చాలా మందికి ఫేవరేట్ అయింది. ఈ నెల 25న విడుదల చేస్తున్నాం. కొత్తగా, ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక జోనర్ అని చెప్పలేం. ఇంతకు ముందు ఈ తరహా సినిమా రాలేదనే చెప్పాలి. ఒక్క రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే సినిమా ఇది. ఆ సమయంలో హీరో ఎవరిని కలిశాడు? ఎదురైన ఘటనలేంటి? అనేది ఆసక్తికరం. ఈ సినిమా కనిపించే క్రౌడ్ అంతా నేచురల్ క్రౌడే`` అని అన్నారు.
శ్యామ్ దత్ మాట్లాడుతూ ``ఎంటర్‌టైనర్ ఇది. ఫన్ గా సాగుతుంది. నటీనటులు క్రమశిక్షణతో పనిచేయడంతో నేను సరదాగా చేయగలిగాను. సుధీర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు`` అని తెలిపారు.
హీరో మాట్లాడుతూ ``ఈ సినిమా ఈ ఏడాది నాకు మూడో సినిమా. మోసగాళ్ళకు మోసగాడు, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, తర్వాత ఈ ఏడాది వస్తున్న సినిమా ఇది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఫన్ ఉంటుంది కానీ ఇది డిఫరెంట్ జోనర్. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. శశి, విజయ్ నా ఫ్రెండ్స్. అంత ఖర్చు ఎందుకు అని కొన్ని సార్లు నేనే చెబుతున్నా వాళ్ళు వినకుండా ఖర్చుపెట్టారు. నా కెరీర్‌లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఇది. శ్రీరామ్ ఎవరి దగ్గరా పనిచేయలేదు. అందువల్ల అతనిపై ఎవరి ప్రభావమూ లేదు. శ్యామ్‌దత్ మా టీమ్‌లో సీనియర్. మంచి సలహాలు ఇచ్చేవారు. ఈ టీమ్‌లో చాలా మంచి ఇంజినీర్లు ఉన్నారు. వామిక ఫ్యాబ్యులస్ ఆర్టిస్ట్`` అని అన్నారు.
వామిక మాట్లాడుతూ ``తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా. నేను పంజాబీ అమ్మాయిని. మంచి పాత్రలో నటించాను`` అని చెప్పారు.
ధన్య మాట్లాడుతూ ``ఈ ఏడాది రాజుగారి గది తర్వాత నేను చేసిన మరో మంచి సినిమా ఇది. ఈ సినిమా చాలా హానెస్ట్ స్క్రిప్ట్ తో చేసింది. అందరికీ నచ్చుతుంది. నా పాత్రను ఇప్పుడే రివీల్ చేయను`` అని అన్నారు.
విజయ్ మాట్లాడుతూ ``రైట్ బడ్జెట్ సినిమా ఇది. 25న విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నాం. ఈ వారంలోనే సెన్సార్‌కి వెళ్తున్నాం. యు.ఎస్.లో ఇప్పటిదాకా సుధీర్ సినిమా విడుదల కానన్ని థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తాం. నైజామ్ దిల్‌రాజు, గుంటూరు యువీ క్రియేషన్స్, యు.ఎస్. నిర్వాణ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తొలిసారి చెన్నై అట్మాస్‌లో సౌండ్ డిజైన్ చేయించాం`` అని చెప్పారు.