pizza
Chanakya press meet
ఇంట్రెస్టింగ్ గా సాగె స్పై థ్రిల్లర్ చాణక్య అందరికీ నచ్చుతుంది-హీరో గోపీచంద్
You are at idlebrain.com > News > Functions
Follow Us


14 September 2019
Hyderabad

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'చాణక్య'. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ హై ఎక్స్ పెక్టేషన్స్ నెలకొనివున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యేవిధంగా దర్శకుడు తిరు 'చాణక్య' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, దర్శకుడు తిరు, నిర్మాత అనిల్ సుంకర, మాటల రచయిత అబ్బూరి రవి పాల్గొన్నారు.

అతనికి ల్యాండ్ మార్క్ ఫిలిం అవుతుంది!!
చిత్ర నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం అనుకోకుండా వేరే డైరెక్టర్ కి కాల్ చేస్తుంటే తిరు నంబర్ కనిపించింది. వెంటనే కాల్ చేసి మంచి కథ ఉంటే చెప్పు అన్నాను అప్పుడు చాణక్య కథ చెప్పాడు. స్పై బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. నాకు బాగా నచ్చిన కథ. అలాగే హీరో గోపీచంద్ కి కూడా ఈ కథ బాగా నచ్చింది. అబ్బూరి రవి మంచి డైలాగ్స్ రాశారు. అలా ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ అయింది. గోపీచంద్ బెస్ట్ హ్యూమన్ బీయింగ్. తను చాలా సపోర్ట్ చేసి ఈ సినిమా త్వరగా పూర్తిచేసాడు. మళ్ళీ మళ్ళీ గోపితో సినిమాలు చెయ్యాలని వుంది. అంత కంఫర్ట్ బుల్ గా కోపరేట్ చేసైనా గోపీచంద్ కి న థాంక్స్. అలాగే డైరెక్టర్ తిరు చాలా టాలెంట్ వున్న వ్యక్తి. బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అతనికి ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. స్పై థ్రిల్లర్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి ఎక్స్ పీరియన్స్ నిస్తుంది. ఒక వండ్రఫుల్ గొప్ప మూవీని మాకు గిఫ్ట్ గా ఇచ్చిన గోపీచంద్, తిరు కి నా థాంక్స్ అన్నారు.

నా మనసుకి నచ్చిన సినిమా!!
దర్శకుడు తిరు మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను తమిళంలో నాలుగు ఫిలిమ్స్ చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్రతి మనిషి జీవితంలో రెండింటిని లీడ్ ఒకటి అబద్దం,రెండు నిజం. ఇండియన్ డ్రా ఏజెంట్ గా గోపీచంద్ ఈ సినిమాలో కనిపిస్తారు. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర గారు బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అమేజింగ్ గా నిర్మించారు. అబ్బూరి రవి సూపర్బ్ డైలాగ్స్ రాశారు. ఇక గోపీచంద్ గారు కథవిని నన్నెంతో ప్రోత్సహించారు. వెరీ గుడ్ బ్రిలియంట్ యాక్టర్. రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఐ సి యు లో పెట్టారు. వెంటనే రికవరీ అయి షూటింగ్ కంప్లీట్ చేశారు. గోపి గారి సపోర్ట్ వల్లే సినిమాని త్వరగా కంప్లీట్ చేయగలిగాము. అందరం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశాం. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో వున్నాం.. అన్నారు.

ప్రతిక్షణం ఉత్కంఠని కలిగిస్తుంది!!
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఇది స్పై థ్రిల్లర్ చిత్రం అయినా థ్రిల్స్, యాక్షన్, ఎక్సయిట్ మెంట్ కలిగిస్తాయి. యాక్షన్ ని కొత్త వేలో చూపించారు..తిరు. అనిల్ సుంకర గారు ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేశారు. అనుకున్న బడ్జెట్ కన్నా కథ కి ఏంకావాలో దానికి మించి ఖర్చుపెట్టారు ఆయన. ఏకే బ్యానర్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. గోపీచంద్ ఫస్ట్ టైం ఓ కొత్త జోనర్లో చేసిన సినిమా ఇది. అనుక్షణం ఏంజరుగుతుందా? అని ఉత్కంఠని కలిగిస్తుంది. హీరో, విలన్ల మధ్య ఎత్తుకి పై ఎత్తులు వేసే సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటాయి. అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు.

ఆయన బ్యానర్ లో మళ్ళీ సినిమాలు చేస్తాను!!
హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తిరు ఈ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కొన్ని మార్పులు చెప్పాను. అవన్నీ పర్ఫెక్ట్ గా సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేసాడు. అనిల్ సుంకర గారి గురించి చాలా విన్నాను. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయన అన్నీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ చేశారు. ఇప్పుడు చాణక్య లాంటి ఓ స్పై థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు. ఎక్కడా వెనుకాడకుండా ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు ఆయన. మళ్ళీ అనిల్ గారితో సినిమాలు చేస్తాను. అంత బాగా నాకు నచ్చిన ప్రొడ్యూసర్. వెట్రి ఫోటోగ్రఫీ బ్యూటిఫుల్ గా చేసాడు. డైలాగ్స్, సీన్స్ అన్నీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. మెహ్రీన్ లవ్ ట్రాక్ సీన్స్ యూత్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి. జరీన్ ఖాన్ సెకండాఫ్ లో వసుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర చేసారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంట్రెస్ట్ సస్టైన్ అవుతూ ఉంటుంది. టీమ్ అంతా బాగా కష్టపడి సపోర్ట్ చేసారు. అందరం కలిసి ఓ మంచి సినిమా చేశాం. ఆడియెన్స్ బాగా రిసీవ్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్ వుంది అన్నారు..!!

సునీల్, నాజర్, జయప్రకాష్, రఘు బాబు, ఆలీ, రాజేష్ కట్టర్, ఉపేన్ పాటిల్, అశోక్ కుమార్, మీర్ సర్వర్, వినీత్ కుమార్, ఆదర్శ్, రాజా, గగన్, ప్రిన్స్, స్వప్ నిక , కరుణ, రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఆర్ట్: రమణ వంక, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: వెట్రి పళని స్వామి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, రీ-రికార్డింగ్: శ్రీ చరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: రాజేష్ దండ, కో-ప్రొడ్యూసర్ అజయ్ సుంకర, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, చీప్-కోడైరెక్టర: ప్రసాద్ దాసం, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: తిరు.

Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved