pizza
Chandrika Press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 September 2015
Hyderabad

25న వస్తున్న ‘చంద్రిక’

ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. కార్తీక్‌ జయరామ్‌-హీరో. కామ్న జెఠ్మ‌లాని-శ్రీముఖి హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా గురించి బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌
కామ్న‌జ‌ఠ్మ‌లాని మాట్లాడుతూ ``మా దర్శకుడు యోగేష్‌ ‘చంద్రిక’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ- చాలా బావుంది. ఇందులో నేను క్లాసిక‌ల్ డ్యాన్సర్ గా న‌టించాను. నా ఫ్యామిలీనే జీవితంగా భావించి బ‌తుకుతుంటాను. హార‌ర్ సినిమా ఇది. టోట‌ల్‌గా హార‌ర్ మాత్ర‌మే ఉండ‌దు. రొమాన్స్, థ్రిల్లింగ్ అంశాలు, కామెడీ కూడా ఉంటుంది. టోట‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంది. జె.కె. చ‌క్క‌గా న‌టించారు. ఫ్ల‌యింగ్ వీల్స్ సంస్థ‌లో నేను తొలి సినిమా చేసినా చాలా మంచి సంస్థ అనిపించింది. ప్ర‌తి ఫ్రేమూ బావుంటుంది. కెమెరావ‌ర్క్ కి త‌ప్ప‌కుండా మంచి అప్లాజ్ వ‌స్తుంది. శ్రీముఖితో నాకు కాంబినేష‌న్ సీన్లు లేక‌పోయినా త‌న క్యార‌క్ట‌ర్ బావుంటుంద‌ని భావిస్తున్నాను. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది`` అని అన్నారు.
శ్రీముఖి మాట్లాడుతూ ``గుణ్వంత్ చ‌క్క‌గా తెర‌కెక్కించారు. 24న క‌న్న‌డ‌లో, 25న తెలుగులో విడుద‌ల‌వుతుంది. ద‌ర్శ‌కుడు తెలుగు వ్య‌క్తి. ముందు ఈ కాన్సెప్ట్ ను అనుకుని ట్ర‌య‌ల్ షూట్ చేసి యూట్యూబ్‌లో పెట్టి మంచి స్పంద‌న వ‌చ్చిన త‌ర్వాత సినిమాగా చేశారు. ఇందులో జె.కె. భార్య‌గా న‌టించాను. దెయ్యం పాత్ర‌లో చేసింది కూడా నేనే. చంద్ర‌ముఖి సినిమాకూ మాకూ ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. ఐదు పాట‌లుంటాయి. ప్ర‌తి ఫ్రేమూ ఫ్రెష్ గా ఉంటుంది. స‌త్యం రాజేష్‌, గిరీష్ క‌ర్నాడ్‌లాంటివారంద‌రూ ఇందులో ఉన్నారు. సినిమా చాలా రిచ్‌గా ఉంటుంది`` అని అన్నారు.
గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved