pizza
Chuttalabbayi On The Sets press meet
80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న 
చుట్టాలబ్బాయి
ou are at idlebrain.com > News > Functions
Follow Us

31 March 2016
Hyderabad

ఆది హీరోగా రామ్‌ తాళ్లూరి సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రామ్  తల్లూరి & వెంకట్‌ తలారి నిర్మిస్తున్న చిత్రం చుట్టాలబ్బాయి’. నమిత, యామిని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం 80 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం హైదరాబాద్ నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో....

వీరభద్రమ్‌ మాట్లాడుతూ ‘‘నేనుఆదితో సినిమా చేయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. నిజానికి పూలరంగడు స్క్రిప్ట్‌ తనకే వినిపించాను. అయితే అప్పుడు డేట్స్‌ ప్రాబ్లెమ్‌ వల్ల ఆ సినిమా చేయడానికి కుదరలేదు. కథ బాగా వచ్చింది. కథ వినగానే సాయికుమార్‌గారుఆదిగారికి బాగా నచ్చింది వెంటనే ఓకే చెప్పారు. ఆహా నా పెళ్లంటపూల రంగడు సినిమా తరహాలోనే అవుటండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనింగ్‌ మూవీ. బ్యాంకాక్, రాజమండ్రి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం. సినిమా బాగా వచ్చింది. నిర్మాతల సపోర్ట్ తో అనుకున్న విధంగా సినిమాను రూపొందిస్తున్నాం’’ అన్నారు.


Glam galleries from the event

హీరో ఆది మాట్లాడుతూ ‘‘ఇది నా ఎనిమిదవ సినిమా. ఇది అవుటండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. అన్నీ ఎమోషన్స్‌ ఉన్నాయి. ఈ సినిమాతో వెంకటేష్‌గారు నిర్మాతగా పరిచయం అవుతున్నారు. థమన్‌తో తొలిసారి చేస్తున్న సినిమా ఇది. తప్పకుండా కలర్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ అవుతుంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను జూన్ మొదటివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’అన్నారు.

నిర్మాత వెంకటేష్‌ తలారి మాట్లాడుతూ ‘‘యాక్షన్‌డ్రామాకామెడి సహా అన్నీ ఎలిమెంట్స్‌ ఉంటాయి. స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ప్రేక్షకులు నవ్వుకుంటూనే ఉంటారు. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను బ్యాంకాక్ లో షూట్ చేశాం. సాంగ్స్ చిత్రీకరణ మిగిలి ఉంది’’ అన్నారు.

సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు హీరోయిన్స్ నమిత, యామిని దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు.

అశుతోష్‌రాణాబ్రహ్మానందంఅలీజయప్రకాష్‌రెడ్డిపోసాని కృష్ణమురళిపృథ్వీపవిత్రా లోకేష్‌శ్రీనివాసరెడ్డిదువ్వాసి మోహన్‌సప్తగిరిరఘుబాబు తదితయి ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఆర్ట్‌: నాగేంద్రఎడిటింగ్‌: ఎస్‌.శేఖర్‌కెమెరామెన్‌: ఎస్‌.ఆరుణ్‌సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌నిర్మాతలు: రామ్  తల్లూరి & వెంకట్‌ తలారి, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: వీరభద్రమ్‌.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved