pizza
Cine Mahal release on 31 March
మార్చి 31న `సినీ మహల్`
You are at idlebrain.com > News > Functions
Follow Us

30 March 2017
Hyderaba
d

కళానిలయ క్రియేషన్స్ సమర్పణలో తెర‌కెక్కిన‌ చిత్రం `సినీ మహల్`. `రోజుకు 4 ఆటలు` అనేది ఉపశీర్షిక. లక్ష్మణ్ వర్మ దర్శకత్వం వ‌హించారు. బి.రమేష్ నిర్మాతగా, పార్థు, బాలాజీ, మురళీధర్ , మహేంద్ర సహనిర్మాతలుగా ఈ చిత్రం తెరెక్కెక్కింది. అలీరాజా, సోహెల్, తేజస్విని నాయ‌కానాయిక‌లు. ఈ సినిమా మార్చి 31న విడుద‌ల‌వుతుది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత పార్థు మాట్లాడుతూ - ``మా సినీ మ‌హ‌ల్ చిత్రం ఈ మార్చి 31న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. సంథింగ్ స్పెష‌ల్ స‌బ్జెక్ట్‌గా సినిమా చ‌క్క‌గా రూపొందింది. ల‌క్ష్మ‌ణ్‌వ‌ర్మ‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. శేఖ‌ర్ చంద్ర‌గారి సంగీతం, దొరై కె.సి.వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ హైలైట్ అవుతాయి. న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు స‌హ‌కారంతో ఓ మంచి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.

ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ వ‌ర్మ మాట్లాడుతూ - ``నిర్మాత‌ల స‌హ‌కారంతో పాటు న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో అనుకున్న విధంగా ఓ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. మార్చి 31న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, థ్రిల్లింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుంది`` అన్నారు.

అలీ రాజా మాట్లాడుతూ - ``సినీ మ‌హ‌ల్‌లో మంచి క్యారెక్ట‌ర్ చేశాను. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ‌వర్మ‌గారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. నిర్మాత‌ల‌కు థాంక్స్‌. మార్చి 31న విడుద‌ల‌వుతున్న సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సోహెల్ మాట్లాడుతూ - ``విబిన్న‌మైన క‌థాంశంతో రూపొందిన చిత్రం సినీ మ‌హ‌ల్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు నచ్చే ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. మార్చి 31న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ``సినిమాలో అన్నీ వేరియేషన్స్ సాంగ్స్‌ ఉన్నాయి. మంచి ఆర్‌.ఆర్‌,కుదిరింది`` అన్నారు.

గొల్లపూడి మారుతీరావు, జీవా, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: దొరై కె.సి.వెంకట్, సంగీతం: శేఖర్ చంద్ర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, కళ: గోవింద్, ఎఫెక్ట్స్: యతిరాజ్, లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, కృష్ణచైతన్య, నాగహనుమాన్, సహనిర్మాతలు: పార్ధు, బాలాజీ, మురళీధర్, మహేంద్ర, నిర్మాత: బి.రమేష్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: లక్ష్మణ్ వర్మ.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved