pizza

Daaku Maharaaj Press Meet
‘Daaku Maharaaj' Will Be a Reference Point for other Films : Bobby Kolli
బాలకృష్ణ గారి అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం 'డాకు మహారాజ్' : దర్శకుడు బాబీ కొల్లి

You are at idlebrain.com > News > Functions
Follow Us


07 January 2025
Hyderabad

The highly anticipated film Daaku Maharaaj, starring Nandamuri Balakrishna, is set for a grand worldwide release on January 12, 2025. The movie has successfully completed all post-production formalities and is ready to hit the big screens. Directed by Bobby Kolli and produced by Naga Vamsi, the film features Pragya Jaiswal and Shraddha Srinath in pivotal roles. At a press meet held in Hyderabad, the team expressed their confidence in the film's success.

Speaking at the event, Director Bobby Kolli said, “We Didn't Take Any References; We Made Daaku Maharaaj to Serve as a Reference Point. We have crafted a unique trailer, unlike previous Balakrishna films, and the response has been phenomenal. We are anticipating a similar reception on January 12."

Producer Naga Vamsi added, “Daaku Maharaaj will be remembered as a landmark film in Nandamuri Balakrishna's career. We are also thrilled to announce a simultaneous theatrical release in Tamil.”

Actress Pragya Jaiswal shared, “I am fortunate to have Daaku Maharaaj release on my birthday, January 12. I have portrayed a deglam role in the film, and it’s something audiences must experience on the big screen.”

Shraddha Srinath expressed, “I am very confident in this film, and I believe Daaku Maharaaj will bring a significant turning point in my career.”

The film promises a unique cinematic experience, and the team eagerly awaits its grand worldwide release on January 12.

Presented by: Srikara Studios
Banner: Sithara Entertainments & Fortune Four Cinemas
Title: Daaku Maharaaj
Release Date: January 12, 2025
Genre: Action Drama

Cast:
Hero: Nandamuri Balakrishna
Co-Stars: Bobby Deol, Pragya Jaiswal, Shraddha Srinath, Chandhini Chowdary

Technical Crew:
Director: Bobby Kolli
Producer: Naga Vamsi
Music Director: Thaman S
Cinematography: Vijay Kartik Kannan
Editors: Niranjan Devaramane, Ruben
Production Designer: Avinash Kolla

బాలకృష్ణ గారి అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రం 'డాకు మహారాజ్' : దర్శకుడు బాబీ కొల్లి

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 'డాకు మహారాజ్' చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రచార కార్యక్రమాలలో మరింత జోరు పెంచిన చిత్ర బృందం, తాజాగా పాత్రికేయుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, దర్శకుడు బాబీ కొల్లి, కథానాయికలు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, "జనవరి 9న అనంతపురంలో భారీ ప్రీ ఈలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశాం. 'డాకు మహారాజ్' సినిమాని తెలుగునాట కావాల్సినన్ని థియేటర్లలో భారీగా విడుదల చేస్తున్నాం. యూఎస్ లో కూడా భారీ స్థాయిలోనే విడుదల ఉంటుంది. అక్కడ బుకింగ్స్ బాగున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ లోనూ జనవరి 12న విడుదలవుతోంది. 'డాకు మహారాజ్'తో ఈ సంక్రాంతికి ఘన విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి. ఈ సినిమా నేను చూసి నమ్మకంగా చెబుతున్నాను. 'డాకు మహారాజ్' చిత్రం అసలు నిరాశ పరచదు. బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది." అన్నారు.

దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ, "మొదటి నుంచి బాలకృష్ణ గారిని కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో, ప్రతి విషయంలో వైవిధ్యం చూపిస్తూ ఎంతో జాగ్రత్తగా ఈ సినిమాని రూపొందించాం. ప్రచార చిత్రాలకు బాలకృష్ణ గారి అభిమానులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దాంతో సినిమా విజయం పట్ల మాకు మరింత నమ్మకం పెరిగింది. అలాగే 'డాకు మహారాజ్' చిత్రం రాబోయే రోజుల్లో పలు సినిమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. బాలకృష్ణ గారి అభిమానులకు ఒక మెమరబుల్ ఫిల్మ్ ఇవ్వాలనేది నాగవంశీ గారి డ్రీమ్. అందుకు తగ్గట్టుగానే సరికొత్తగా ఉండేలా, ఒక మంచి సినిమాని తీశాము. ఇందులో ఐదు యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయి. ప్రతి సీక్వెన్స్ అభిమానులకు ఎంతో హై ఇస్తుంది. యాక్షన్ తో పాటు మంచి వినోదం, హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది." అన్నారు.

కథానాయిక ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ, "ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ కు ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. మీరు మా సినిమాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమాని మీకు ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాం. జనవరి 12న నా పుట్టినరోజు. ఈ చిత్ర విజయాన్ని నా పుట్టినరోజు కానుకగా అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో గుర్తుండిపోయే మంచి పాత్రను పోషించాను. " అన్నారు.

కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, "ట్రైలర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ చిత్రంపై నాకు చాలా నమ్మకం ఉంది. నా సినీ ప్రయాణంలో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాను. జనవరి 12 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది." అన్నారు.

'డాకు మహారాజ్' చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంచలన స్వరకర్త తమన్ సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రాహకుడిగా విజయ్ కార్తీక్ కన్నన్, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

తారాగణం: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: విజయ్ కార్తీక్
కళా దర్శకుడు: అవినాష్ కొల్లా
కూర్పు: నిరంజన్ దేవరమానే, రూబెన్
దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Photo Gallery
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved