యాబా క్రియేషన్స్ బ్యానర్ పై అదానాన్ షాజిద్ ఖాన్, మస్త్ అలీ, ఫిరోజ్ ఖాన్, మాధవి, మనీషా, కావ్య ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం దావత్ ఏ షాదీ. సయ్యద్ హుస్సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సమీవుల్లా ఫయాజ్, సయ్యద్ వసీం యాబా నిర్మాతలు. ఈ చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా....
దర్శకుడు సయ్యద్ హుస్సేస్ మాట్లాడుతూ ‘’ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన దక్కన్ సినిమా. అవుటండ్ అవుట్ కామెడితో ప్రతి సీన్ ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హైదరాబాద్ కు చెందిన కుర్రాడి పెళ్ళి కథే ఈ సినిమా. ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేస్తున్నాం. సినిమాను ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు.
నిర్మాతలు సమీవుల్లా ఫయాజ్, సయ్యద్ వసీం యాబా మాట్లాడుతూ ‘’దక్కన్ మూవీస్ ఎప్పుడూ సింగిల్ థియేటర్స్ లోనే విడుదలయ్యేవి. కానీ మొదటిసారి ఈ సినిమా 12 మల్టీప్లెక్స్ లలో కూడా విడుదలవుతుంది. నేషనల్ వైడ్ గా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా ఎంటర్ టైనింగ్ ఉంటుంది. మార్చి 4న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారని కోరుకుంటున్నాం’’ అన్నారు.
మస్త్ అలీ మాట్లాడుతూ ‘’దక్కన్ సినిమాలతో పాటు సుబ్రమణ్యం ఫర్ సేల్ వంటి తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’’ అన్నారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధి షరీష్ మాట్లాడుతూ ‘’ఈ చిత్రయూనిట్ అమెరికాలో టీజర్ విడుదల చేసేటప్పుడు పరిచయమయ్యారు. తెలుగు సినిమా సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు మా ఎంకరేజ్ మెంట్ ఎప్పుడూ ఉంటుంది’’ అన్నారు.