pizza
మే1న విడుదలవుతున్న ‘దొంగాట’
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 April 2015
Hyderabad

విద్యానిర్వాణ సమర్పణలో లక్ష్మీమంచు, అడవిశేష్ ప్రధాన పాత్రధారులుగా మంచు ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘దొంగాట’. వంశీ కృష్ణ దర్శకుడు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చితం మే1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....

లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘’సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 1న గ్రాండ్ లెనవల్ లో విడుదల కానుంది. నైజాం, సీడెడ్, ఆంధ్రాల్లో సినిమా బిజినెస్ పూర్తయింది. ఇంకా ఓవర్సీస్, బెంగళూరులో బిజినెస్ కావాల్సి ఉంది. అన్నీ కార్యక్రమాలను ఈ వారంలోనే పూర్తి చేసేసి విడుదల చేస్తాం. సినిమా నిర్మాణ విషయంలో గాంధీగారు ఎంతో హెల్ప్ చేశారు. సినిమాలో 9మంది హీరోలు కనపడనున్న సాంగ్ చాలా హైలైట్ అవుతుంది. వరికుప్పల యాదగిరి సాహిత్యం, రఘుకుంచె సంగీతం సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ సినిమాతో వంశీ కృష్ణ పెద్ద దర్శకుడు అవుతాడు. అన్నీ వర్గాల ప్రేక్షకుల మెచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.

దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ‘’సినిమాని చూసిన సెన్సార్ సభ్యులు బాగుందని మెచ్చుకున్నారు. సినిమా బాగా రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒకరికి థాంక్స్. ముఖ్యంగా లక్ష్మీమంచు, మధునందన్ గారి మరచిపోలేను. సినిమా అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్. సాయిమాధవ్ గారి డైలాగ్స్ హైలెట్ గా నిలుస్తాయి’’ అన్నారు.

సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ ‘’మనిషికి, డబ్బుకి ఉన్న రిలేషన్ గురించి తెలియజేస్తుంది. కామెడితో పాటు ఆలోచింపజేసే చిత్రం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో మధునందన్, రఘుకుంచె పాల్గొన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved