ప్రముఖ కథానాయిక నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``ఇటీవల మా బ్యానర్ నుండి సింగం 3 సినిమా వచ్చి మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సింగం3 షూటింగ్ జరుపుకుంటున్న సమయంలోనే ఈ డోర సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంది. నయనతార ప్రధానపాత్రలోనటించిన డోర సినిమా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.గతంలో నయనతారగారు నటించిన మయూరి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి నయనతార నటించిన ఉమెన్ ఓరియెంటెడ్ చిత్రమిది. నయనతార ఇప్పుడు దక్షిణాదిలోనే పెద్ద హీరోయిన్. దాస్ రామస్వామి చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించారు. దాస్ రామస్వామిగారు కూడా డోర కథను అద్భుతంగా తెరకెక్కించారు. డోరెమాన్ అనే పేరు ఇప్పుడు చిన్నపిల్లలందరికీ తెలుసు. దాన్నుండి డోర అనే టైటిల్ పెట్టాల్సిందిగా నయనతార కోరడంతో డోర అనే టైటిల్‌ను పెట్టారు. ఫ్యామిలీస్, చిన్నపిల్లలకు నచ్చే చిత్రమిది. వివేక్ మెర్విన్ సంగీతంలో విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. తెలుగులో ఈ సినిమాను 400 థియేటర్స్‌కు పైగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కారులో దెయ్యం ఎందుకుంది? ఆ కారు ఎవరిపై ప్రతీకారం తీర్చుకుంటుందనేదే ప్రధానమైన కథాంశం. మయూరి కంటే నయనతారకు డోర పెద్ద సక్సెస్‌ఫుల్ మూవీగా పేరు తెస్తుంది. మా బ్యానర్‌లో ఈ ఏడాదిలో మూడు సినిమాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందులో ఒకటి మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా`` అన్నారు.