పుష్యమి ఫిలింమేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో రామ్ కార్తీక్, కాశ్మీర కులకర్ణి హీరో హీరోయిన్లుగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో కొల్లు శివనాగేంద్రరావు నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 18న విడుదలవుతుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.....
దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘’అందరికీ నచ్చేలా ప్రతి సీన్ హార్ట్ టచింగ్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్ సహా సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్, టెక్నిషియన్స్ మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేయడంతో సినిమా అందమైన దృశ్యకావ్యంలా రూపొందింది. ప్రాణం కమలాకర్ అందరితో పోటీపడి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఇది హర్రర్ చిత్రాలకు డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్‌బోన్‌లా నిలిచింది. సినిమాను స్వంతంగా 200 పైగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాను. ఈ సినిమాలో సబ్జెక్ట్ మెయిన్ హీరో. సినిమా కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది. మధునందన్‌గారు సెకండ్ లీడ్‌లో నటించారు.సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది. ట్రైలర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. టైటిల్ హాట్ టాపిక్‌గా మారింది. ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫస్టాఫ్ లో జబర్ దస్త్ టీం కామెడి, సెకండాఫ్ లో పృథ్వీ, ఆలీ గారి కామెడి ఆడియెన్స్ నవ్విస్తుంది. సినిమాను మార్చి 18న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, నార్త్ ఇండియాలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు.
మధునందన్ మాట్లాడుతూ ‘’రామకృష్ణారెడ్డిగారు జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తున్నారు. సినిమాలంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. రామకృష్ణారెడ్డిగారు కొత్త దర్శకుడిలా కాకుండా మంచి అనుభవమున్న దర్శకుడిలా సినిమా చేశారు.
ప్రాణం కమలాకర్ మాట్లాడుతూ ‘’సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అవుతుంది. సినిమా చక్కగా వచ్చింది. 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
హీరో రామ్‌కార్తీక్ మాట్లాడుతూ ``ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. టైటిల్ చాలా క్లాస్‌గా ఉంది. అందరి నోళ్ళలో నానుతుంది. టైటిల్‌తో బాధ్యత పెరిగింది. అందరూ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. 18న విడుదలవుతున్నాం. సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను``అన్నారు.
అలీ, పృథ్వీ, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, షాని, జీవా, మేల్ కోటి, సుమన్ శెట్టి తదితరులు ఇతర తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: సంతోష్ శానమోని, సంగీతం: ప్రాణం కమలాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి.