ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ ఫేం మనోజ్‌నందం హీరోగా నటిస్తున్న సినిమా ‘ఫుల్ గ్యారెంటీ’. నవ్వుకి-లవ్వుకి అనేది ఉపశీర్షిక. ప్రవీణ్ మరో హీరో. కాశ్మీరా, మంజులా రాథోడ్ కథానాయికలు. రామకృష్ణ బొత్స దర్శకత్వంలో రోహితా క్రియేషన్స్ పతాకంపై యల్లమిల్లి బాలమురళి కృష్ణ సమర్పణలో నల్లజర్ల వెంకన్న, ఆర్.కె. అడ్డాల, యస్.తాజ్ భాషా సంయుక్తంగా నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ చిత్రం ఆగస్ట్ 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ సారథి స్టూడియోలో గురువారం హైదరాబాద్ సారథి స్టూడియోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో....
సాయివెంకట్ మాట్లాడుతూ ``ఈ చిత్రం ఆగస్ట్ 26 తర్వాత విడుదవలవుతుంది. దర్శకుడు రామకృష్ణతో మంచి శిష్యుడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. సినిమా ఆద్యంతం కామెడితో సాగిపోతుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
సి.జె.శోభారాణి మాట్లాడుతూ ``ట్రైలర్ చూశాను. ఆద్యంతం కామెడి ప్రధానంగా సాగిపోతుంది. చాలా బావుంది. దర్శకుడు సినిమాను ఎలా తీసుంటాడనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 25 సీనియర్ ఆర్టిస్ట్ లతో సినిమా చేసి ఉన్నారు. 26న విడుదలవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ ``నాకు సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలియదు. సినిమాలను పెద్దగా చూడను. కానీ ఓ సందర్భంలో దర్శకుడు రామకృష్ణ ఎవరికో ఈ కథ చెబుతుంటే వింటే సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాధిస్తుందనిపించింది. అందుకే సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాం. సినిమా బాగా వచ్చింది. మంచి కామెడి ఎంటర టైనర్. 26న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను`` అన్నారు.
దర్శకుడు రామకృష్ణ బొత్స మాట్లాడుతూ ``ప్రొడ్యూసర్ ను నిలబెట్టుకోవాలనే తపనతో మంచి సినిమా చేసే ప్రయత్నం చేశాను. నటీనటులు, టెక్నిషియన్స్ అందరి సపోర్ట్ తో సినిమాను అనుకున్నట్టుగా పూర్తి చేశాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో ప్రవీణ్ మాట్లాడుతూ ``దర్శక నిర్మాతలు మంచి రిలేషన్ ఉన్న వ్యక్తులు. నటీనటుల నుండి ఎలాంటి నటనను రాబట్టుకోవాలో తెలిసిన వ్యక్తి. సినిమా చూశాను. చాలా బాగా వచ్చింది. నేనేనా చేసిందనిపించింది`` అన్నారు.
సినిమాను ఫ్యామిలీలా కలిసి చేశాం. దర్శక నిర్మాతలు ఎంతో చక్కగా సినిమాను పూర్తి చేశారని కథానాయికలు
కాశ్మీరా, మంజులా రాథోడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.