pizza
Ghatana press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

26 August 2016
Hyderaba
d

సన్‌మూన్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిత్యామీనన్‌, క్రిష్‌ జె.సత్తార్‌, సీనియర్‌ నరేష్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'ఘటన'. శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ.ఎం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌ ఫిలించాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో బి.ఎ.రాజు, సీనియర్‌ నరేష్‌, వి.ఆర్‌.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. సీనియర్‌ నరేష్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా...

సూపర్‌హిట్‌ పత్రికాధినేత, నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - ''ఈ ఘటన ఆగస్ట్‌31న ప్లాటినం వేడుకను జరుపుకోనుంది. నిర్మాతలు సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు'' అన్నారు.

నిర్మాత వి.ఆర్‌.కృష్ణ.ఎం మాట్లాడుతూ - ''దృశ్యం వంటి మంచి హిట్‌ ఇచ్చిన శ్రీప్రియ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశారు. మలయాళంలో సినిమా మంచి విజయవంతమైన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేశారు. నరేష్‌గారు సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశారు. దృశ్యంకు ఎంత మంచి పేరు వచ్చిందో ఘటనకు కూడా మంచి పేరు వస్తుంది. నిత్యామీనన్‌ నటన, ఇప్పటి వరకు ఆమె చేసిన క్యారెక్టర్స్‌ కంటే భిన్నంగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది లేడీ ఓరియెంటెడ్‌ మూవీ. తనకు జరిగిన అన్యాయానికి ఓ అమ్మాయి ఎలా పగ తీర్చుకుందనేదే కథ'' అన్నారు.

సీనియర్‌ నరేష్‌ మాట్లాడుతూ - ''గత రెండు, మూడు సంవత్సరాలుగు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. చిన్న సినిమాలు పెద్ద సక్సెస్‌ అవుతున్నాయి. అలాగే ఈ ఘటన కూడా సోషల్‌ ఎలిమెంట్‌పై తీసిన సినిమా. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. దృశ్యం దర్శకురాలు శ్రీప్రియగారు చాలా బాగా సినిమాను తెరకెక్కించారు. నన్ను ఎలాగైతే దృశ్యం సినిమాలో కొత్తగా చూపించారో, అలాగే ఈ సినిమాలో నాకు ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ను ఇచ్చారు. నేను ఇప్పటి వరకు దాదాపు 150 సినిమాలు పూర్తి చేశాను. ఈ సినిమాల్లో చేయని క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. ఇక నిత్యామీనన్‌ నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దృశ్యం తర్వాత శ్రీప్రియకు మంచి పేరు తెచ్చే సినిమా ఇదవుతుంది. మహిళా దర్శకురాల్లో మా అమ్మగారి తర్వాత నేను ఇష్టపడే లేడీ డైరెక్టర్‌ శ్రీప్రియ. ఈ నెలలో ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను నిర్వహించి, సినిమాను సెప్టెంబర్‌ రిలీజ్‌ చేస్తున్నాం. తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved