pizza
Jakkanna release on 29 July
జూలై 29న విడుద‌ల‌వుతున్న `జ‌క్క‌న్న‌`
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 July 2016
Hyderabad

సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ ై రూపొందిన చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ..

వంశీకృష్ణఅకెళ్ళ మాట్లాడుతూ ``సినిమా జూలై 29న విడుద‌ల‌వుతుంది. మంచి కామెడి ఎంట‌ర్‌టైన‌ర్‌. చాలా మంది క‌మెడియ‌న్స్ ఇందులో న‌టించారు. ప్ర‌తి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. ఏ పాత్ర‌కు దానిక‌దే డిజైన్ చేసిన‌ట్టు ఉంటుంది. అదుర్స్ ర‌ఘు, ప్ర‌భాస్ శ్రీను పాత్ర‌లు చాలా బావుంటాయి. వైజాగ్ లో ఉంటూ తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ విల‌న్ అనుచ‌రుడినంటూ అదుర్స్ ర‌ఘు చేసే కామెడి, విల‌న్ ప‌క్క‌నే ఉంటూ విల‌న్ కు పంచ్‌లేసే పాత్ర‌లో ప్ర‌భాస్ శ్రీను పాత్ర‌లు ఆడియెన్స్ న‌వ్విస్తాయి. సినిమా బాగా వ‌చ్చింది`` అన్నారు.

ప్ర‌భాస్ శ్రీను మాట్లాడుతూ ``విల‌న్‌గా ప‌క్క‌నుంటూ అత‌నికే పంచ్‌లేస్తూ కామెడిగా సాగే పాత్ర‌. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన పాత్ర‌ల్లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ రోల్‌. ద‌ర్శ‌కుడు వంశీ ఆర్టిస్టుల‌కు మంచి ఫ్రీడం ఇచ్చి అవుట్‌పుట్‌ను రాబ‌ట్టుకున్నారు. నాకు కూడా కొత్త‌గా చేయ‌డానికి ఆస్కారం దొరికింది`` అన్నారు.

అదుర్స్ ర‌ఘు మాట్లాడుతూ ``ఏ సినిమా చేసినా అందులో నా రోల్‌ను ఎంజాయ్ చేస్తూ న‌టిస్తాను. ఈ సినిమాలో కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేశాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర‌ను ముందుగా చిన్న‌దిగా అనుకున్నారు. కానీ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో నా పాత్ర చాలా వ‌ర‌కు పెరిగింది. సినిమా చివ‌రి వ‌ర‌కు ఉండే పాత్ర నాది. నా కెరీర్‌లో న‌న్నొక మెట్టూ ఎక్కించే ప్రాత అవుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved