pizza
Vamsi Krishna Akella Jakkanna press meet
జ‌క్క‌న్న నా కెరీర్‌కు ఉప‌యోగ‌ప‌డే అద్భుత‌మైన విజ‌యాన్ని ఇచ్చింది - వంశీకృష్ణ ఆకెళ్ళ‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

2 August 2016
Hyderaba
d

నేను సునీల్, మన్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం `జక్కన్న`. వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 29న సినిమా విడుదలైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ సినిమా సంగ‌తుల‌ను పాత్రికేయుల‌తో పంచుకున్నారు..

వంశీకృష్ణ ఆకెళ్ళ మాట్లాడుతూ ``జ‌క్క‌న్న విడుద‌లైన రోజు యావ‌రేజ్ టాక్‌తో ప్రారంభ‌మైంది. ఈవాళ ఆ సినిమా సూప‌ర్‌హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. అన్నీ ఏరియాల నుండి మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. సినిమా శుక్ర‌వారం విడుద‌లై ఆదివారం చేరుకునే స‌రికి క‌లెక్ష‌న్స్ పెరిగాయి. సాధార‌ణంగా సినిమాకు ముఖ్య‌మైన సోమ‌వారం రోజున అన్నీ సెంట‌ర్స్‌లో హౌస్‌ఫుల్‌గా ర‌న్ అవుతున్నాయి. మ‌ల్లిఖార్జున‌, మూసాపేట‌లోని శ‌శిక‌ళ‌, లక్ష్మీక‌ళ థియేట‌ర్స్‌ కు వెళ్ళాను. సినిమా చూసి ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేట‌ర్స్ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. మొద‌టి నాలుగు రోజుల్లో సునీల్ సినిమాల్లో పెద్ద స‌క్సెస్‌ను సాధించి 9 కోట్ల రూపాయ‌ల షేర్‌ను సాధించింది. సునీల్ సినిమాల్లోనే హై ఓపెనింగ్స్‌ తో పెద్ద రికార్డును సాధించింది.

Vamsi Krishna Akella photo gallery

మ‌ర్యాద‌రామ‌న్న‌, పూల‌రంగ‌డు త‌ర్వాత సునీల్‌కు భారీ రేంజ్ హిట్ అని అంటున్నారు. ఏలూరులో సింగిల్ థియేట‌ర్‌లో సినిమా ర‌న్ అవుతుంది. వ‌ర్షాలు ప‌డుతున్నా నాలుగు ఆట‌లు హౌస్‌ఫుల్ అయ్యాయి. తొర్రూర్‌, క‌ర్నూల్‌, విజ‌య‌వాడ ప్రాంతాల్లో అన్ని షోస్ ఫుల్ అయ్యాయి. వైజాగ్ ఏరియాకు కోటి ఇర‌వై ల‌క్ష‌ల‌కు బిజినెస్ చేస్తే నాలుగు రోజుల్లో 90ల‌క్ష‌ల‌ను క‌లెక్ట్ చేసింది. తూర్పుగోదావ‌రిలో 90ల‌క్ష‌ల బిజినెస్ చేస్తే నాలుగు రోజుల్లో 67ల‌క్ష‌ల బిజినెస్ చేసింది. నెల్లూరు 50ల‌క్ష‌ల బిజినెస్ చేస్తే 30ల‌క్ష‌లు క‌లెక్ట్ చేసి సినిమా పెద్ద రేంజ్‌లో దిశ‌గా దూసుకెళ్తోంది. ప్రొద్దుటూరులో 6.2ల‌క్ష‌లు, కావ‌లిలో6.7ల‌క్ష‌లు క‌లెక్ట్ చేసింది. జ‌క్క‌న్న అనే సినిమాను ఎ సెంట‌ర్ ప్రేక్ష‌కులు బావుందంటే బి, సి సెంట‌ర్స్ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ సినిమాను 12కోట్ల‌తో సినిమాను రూపొందించాం. ఇప్ప‌టికి సినిమా ఎన‌బై శాతం క‌లెక్ట్ చేసింది. బ‌య్య‌ర్స్ సేఫ్ అయ్యారు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమా కావ‌డంతో మేం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన వ్య‌క్తుల్లో చిరంజీవిగారు మొద‌టి వ్య‌క్తి, ఆడియో వేడుక‌కు వ‌చ్చి ఆయ‌న అందించిన ఆశీర్వాద‌మే సినిమా ఇంత పెద్ద హిట్ సాధించింది. అలాగే సునీల్‌గారు ఇంత‌కు ముందు చిన్న చిన్న‌ప్లాప్స్‌లో ఉన్నప్ప‌టికీ వంశీ ఈ సినిమాను మ‌నం కొడుతున్నాం అని నాకు ధైర్యం చెప్పి న‌న్ను ముందుకు తీసుకెళ్ళారు. అలాగే నిర్మాత సుద‌ర్శ‌న్‌రెడ్డిగారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. మంచి రిలీజ్ డేట్ చూసి విడుద‌ల చేశారు. ఇలా నాకు స‌పోర్ట్‌ గా నిలిచిన అంద‌రికీ థాంక్స్‌. జ‌క్క‌న్న నాకు క‌మ‌ర్షియ‌ల్ పెద్ద స‌క్సెస్‌నిచ్చింది. నెక్ట్స్ రెండు, మూడు సినిమాలు ప్లానింగ్‌లో ఉన్నాయి. ఎంట‌ర్ టైన్‌మెంట్ ప్ర‌ధానంగా ఉండే సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. త్వ‌ర‌లోనే వాటి వివ‌రాల‌ను తెలియ‌జేస్తాను`` అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved