pizza
Kobbari Matta coming soon - Sampoornesh Babu
త్వ‌ర‌లో `కొబ్బ‌రి మ‌ట్ట‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాను - సంపూర్ణేష్ బాబు
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 May 2017
Hyderabad

అమృత ప్రొడ‌క్ష‌న్స్, గుడ్ సినిమా గ్రూప్‌, సంజ‌నా మూవీస్ తెర‌కెక్కిస్తున్న సినిమా కొబ్బ‌రిమ‌ట్ట‌. సంపూర్ణేష్ బాబు హీరో. ష‌కీలా, గాయ‌త్రి, గీతాంజ‌లి, ఇషిక‌, భార్గ‌వి, మ‌హేష్ క‌త్తి, గురుచ‌ర‌ణ్‌, అజ‌య్‌, సురేష్ కాన‌గంటి, రాజ్‌, భ‌ర‌త్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమాను ఆది కుంభ‌గిరి, సాయి రాజేష్ శీలం నిర్మించారు. రూప‌క్ రొనాల్డ్ స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మే 9న హీరో సంపూర్ణేష్ బాబు పుట్టినరోజు ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన ప్రెస్ మీట్‌లో...

డైరెక్ట‌ర్ రూప‌క్ రొనాల్డ్ స‌న్ మాట్లాడుతూ - ``కొబ్బ‌రి మ‌ట్ట సినిమాకు ముందు నుండి ఆడియెన్స్ ఎంతో ఆద‌ర‌ణ చూపిస్తున్నారు. అందువల్ల సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశాం. పాపారాయుడు, పెద‌రాయుడు, అండ్రాయిడ్ పాత్ర‌ల్లో సంపూర్ణేష్ బాబు అద్భుతంగా న‌టించాడు. అంద‌రికీ థ్రిల్ క‌లుగుతుంది. రిలీజ్ కూడా త్వ‌ర‌లోనే ప్లాన్ చేస్తున్నాం.

సాయిరాజేష్ మాట్లాడుతూ - ``కొబ్బ‌రి మ‌ట్ట సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అయ్యి 9 నెల‌లు అవుతుంది. సినిమా పూర్త‌య్యింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ప్ర‌తి సీన్ వైర‌ల్‌, పాపుల‌ర్ అవుతాయి. చివ‌రి ఫైట్ హృద‌యకాలేయం క్లైమాక్స్‌లో హార్ట్ విసేరేస్తే వ‌చ్చిన రెస్పాన్స్ కంటే రెట్టింపు ఉంటుంది. జూన్ మొద‌టివారం లేదా రెండో వారంలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సంపూకి గ‌త మూడు నాలుగు బ‌ర్త్‌డేస్ చాలా స్పెష‌ల్‌`` అన్నారు.

సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ - ``చిన్న న‌టుడినైనా నాకు హృద‌య కాలేయం సినిమాతో ప్రజ‌లు, మీడియా గుర్తింపున‌చ్చింది. ఎంతో మంది సినిమా పెద్ద‌లు న‌న్ను ఆశీరదించి, అవ‌కాశాలు క‌ల్పించారు. హృద‌య‌కాలేయ టీం నుండి త్వ‌ర‌లోనే కొబ్బ‌రి మట్ట సినిమా రానుంది. అంద‌రూ మా ప్ర‌య‌త్నాన్ని ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాం. హృద‌య కాలేయం నుండి ప్ర‌తి రోజూ నాకు పండుగే. ఆ సినిమా రిలీజ్ త‌ర్వాతే నాకు గుర్తింపు వ‌చ్చింది. కొబ్బ‌రి మ‌ట్ట సినిమాను ఆల‌స్య‌మైనా మంచి ఫీడ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. హృద‌య కాలేయం సినిమాను ఎంత ఎంజాయ్ చేశామో దాని కంటే రెట్టింపు కొబ్బ‌రి మ‌ట్ట సినిమాను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేస్తారు. కొబ్బ‌రి మ‌ట్ట‌లో స్ఫూఫ్‌లు చేయ‌లేదు. మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఏడుగురు భార్య‌లు, ప‌ది, ప‌న్నెండు మంది పిల్ల‌లు, ముప్పై, న‌ల‌భై మంది మ‌న‌వ‌ళ్ళు, మ‌న‌వ‌రాళ్ళ‌తో సినిమాలో పెద్ద కుంటుంబం ఉంటుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్‌, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సోలో హీరోగా రెండు సినిమాలు ప్రారంభ‌మ‌వుతాయి. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఏ సినిమా చేయ‌డం లేదు. కొబ్బ‌రి మ‌ట్ట‌లో మంచి డైలాగ్స్ ఉంటాయి.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved