
13 December 2014
Hyderabad
వరుణ్ సందేశ్, మలోబికా బెనర్జీ హీరో హీరోయిన్లుగా గోపీకృష్నా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త పి.లక్ష్మీ మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న యూత్ ఫుల్ లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ "లైలా ఓ లైలా " సినిమా పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.ఈ సినిమా ద్వారా దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన ఎం.పూర్ణానంద్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ..." హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం" సినిమాల స్థాయిలో విజయం సాధించే ఆల్ కమర్శియల్ ఎలిమెంట్స్ తో చక్కని కథ కుదిరిందని,తన కెరియర్ లో ఈ సినిమా వెరీవెరీ స్పెషల్ అవుతుందని చెప్పారు.ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నామని దర్శకుడు పూర్ణానంద చెప్పారు.త్వరలో పాండిచ్చేరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు.ప్రముఖ తారాగణం నటించనున్న ఈ చిత్రానికి బాలసాయి అఖిలేష్ రెడ్డి సమర్పణ.
