కృష్ణ, జనని, అఖిల్, భార్గవి, చరణ్, ప్రజ్ఞ జంటలుగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో జాకి అతిక్ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం'లక్ష్మీదేవీ సమర్పించు నేడే చూడండి`. సోమవారం హైదరాబాద్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడంతో పాటు పాటలను కూడా ప్రదర్శించారు. అనంతరం...
సీనియర్ నరేష్ మాట్లాడుతూ - ``సోషియో ఫాంటసీ చిత్రంగా లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి చిత్రం రూపొందింది. దేవుళ్ళు సినిమా తీయాలనుకుంటే వారికి వచ్చే సినిమా తీసే ఇబ్బందులను, సమస్యలను ఈ చిత్రంలో చూపించారు. అవుటండ్ అవుట్ ఎంటర్‌టైనర్. జాకీ అద్భుతంగా దర్శకత్వం చేశారు. సుబ్బారెడ్డిగారు సినిమాను రిచ్‌గా నిర్మించారు. నటుడు గౌతంరాజు కొడుకు కృష్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ప్యాడింగ్ స్టార్స్ అందరూ ఈ చిత్రంలోనటించారు. ట్రైలర్, పాటలు బావున్నాయి. ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులు సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
హీరో కృష్ణ మాట్లాడుతూ - ``సినీ ప్రముఖుల ఆశీర్వాదంతో సినిమా పూర్తయ్యింది. హీరో కావాలనుకునే కుర్రాడి పాత్రలో నటించాను. జాకీ సినిమాను ఎంటర్‌టైనింగ్ తెరకెక్కించారు. మాలాంటి కొత్తవారికి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్.ఏప్రిల్ 7న విడుదలవుతున్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని భావిస్తున్నాను`` అన్నారు.
జనని మాట్లాడుతూ - ``కృష్ణకు జోడిగా నటించాను. అవకాశం ఇచ్చిన సిరాజ్, సుబ్బారెడ్డిగారికి, నరేష్, గౌతంరాజు సహా అందరికీ థాంక్స్`` అన్నారు.
సిజె.శోభారాణి మాట్లాడుతూ - ``ట్రైలర్, పాటలు బావున్నాయి. చాలా మంచి కాన్సెప్ట్‌తో దర్శకుడు జాకీ సినిమాను ఎంటర్‌టైన్‌మెంట్‌తో డైరెక్ట్ చేశాడు. అందరూ ఎంజాయ్ చేసే చిత్రమిది. కథనునమ్మి సినిమాను నిర్మించిన నిర్మాతలుసిరాజ్, సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డిలకు థాంక్స్`` అన్నారు.
నటుడు గౌతంరాజు మాట్లాడుతూ - ``సినిమాలో ఓ పాత్ర కోసం నిర్మాతలు నా వద్దకు వచ్చారు. హీరో కోసం వెతుకుతున్నారని తెలిసి మా అబ్బాయి గురించి చెప్పాను. వారు మా అబ్బాయిని చూడగానే నచ్చడంతో హీరోగా చేయమని అడిగారు. అలా తను ఈ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాతలు సినిమాను చక్కగా నిర్మించారు. సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం
కార్యక్రమంలో అశోక్‌కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : శ్రీకోటి, ఫొటోగ్రఫీ: రఘు.ఆర్.బళ్ళారి, సహనిర్మాత : సిరాజ్, నిర్మాత : మేరువ సుబ్బారెడ్డి, కథ,మాటలు,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: జాకి అతిక్.
యూనిట్ సభ్యులకు హీరో సునీల్, అనీల్ సుంకర, మారుతి డిస్క్‌లను అందజేశారు.