31 July 2015
Hyderabad
మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త దివంగత డా ॥ అబ్దుల్ కలాం ను "రియల్ హీరో గా అభివర్ణిస్తూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ శివాజీ రాజా అయన చిత్రపటానికి నివాళులు అర్పించి, అయన సేవలను కొనియాడుతూ, "మా " కార్యాలయం లో క్షిపణి పితామహుని చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, శ్రీమతి పావలా శ్యామల (సీనియర్ నటి) కి దాతల ద్వారా 28 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా దాతలు శ్రీ యమ్. శ్రీనివాస బాబు, శ్రీ గార్ల పాటి జితేంద్ర కుమార్ లకు ధన్యవాదాలు తేలిపారు.
"మా" మూలధనాన్నుంచి కాకుండా స్నేహితులు, దాతల ద్వారా సేకరించిన విరాళాలతొ 32 మంది సినీ కళాకారులకు నేల వారి ఆర్ధిక సహాయం అందిస్తూనే, సీనియర్ సిటిజన్ కళాకారులైన వేదం నాగయ్య, లవకుశ ఫేం కుశుడు సుబ్రహ్మణ్యం గార్లకు 25 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రెసిడెంట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి మిత్రుల ద్వారా సేకరించిన విరాళాన్ని గుర్తు చేస్తూ శ్రీ రావు రమేష్, సాయి వెంకట్, ఖాన్ ఫౌండేషన్ లకు కృతఙ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమానికి శివాజీ రాజా, పరుచూరి బ్రదర్స్, శివ కృష్ణ, జి శ్రీ శశాంక , రఘు బాబు, ఏడిద శ్రీరాం, పి. శ్రీనివాసులు హాజరయ్యారు.
"మా" కో-ఆర్డినేషన్ కమిటీని ఎర్పాటు చేసి చైర్మన్ గా శ్రీ పరుచూరి గోపాల కృష్ణకు బాధ్యతలు అప్పగించారు. - శ్రీ శశాంక జి. ఇ.సి. మెంబర్