pizza
Movie Artistes Association press meet
You are at idlebrain.com > News > Functions
Follow Us

05 August 2015
Hyderabad

'మా' అసోసియేషన్ కు బ్రహ్మానందం సపోర్ట్!

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. 'మా' అసోసియేషన్ లో మెంబర్ షిప్ ఉన్న సభ్యులకు మాత్రమే కాకుండా దయనీయ పరిస్థితుల్లో ఉన్న పేద కళాకారులను కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అక్కున చేర్చుకుంటుంది. వీరు చేపడుతున్న కార్యక్రమాలను స్పూర్తిగా తీసుకొని ఎందరో నటీనటులు, సేవా కార్యక్రమాలపై ఆసక్తి ఉన్న వారు 'మా' అసోసియేషన్ కు వారి వంతు తోడ్పాటునందిస్తున్నారు. ఆ విశేషాలను తెలియబరుచుటకు 'మా' అసోసియేషన్ బృందం బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

కాదంబరి కిరణ్ మాట్లాడుతూ "మా అసోసియేషన్ సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పటి నుండి మెంబర్ షిప్ ఉన్న వారు మాత్రమే కాకుండా మా స్నేహితులు సన్నిహితులు వారికి తోచినంత సహాయం చేస్తూనే ఉన్నారు. నాగాబాబు గారు మాకు సపోర్ట్ గా నిలిచి గెలిచినా తరువాత మరింత తోడ్పాటునందిస్తున్నారు. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం గారు నాకు ఫోన్ చేసి మీ సేవా కార్యక్రమాల్లో నేను భాగం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పగానే చాలా సంతోషపడ్డాం. ఒక సంవత్సర కాలం పాటు పది మంది పేద కళాకారులకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆయన సహాయం చేయడానికి ముందుకొచ్చారు. గోవిందరావు అనే ఆర్టిస్ట్ 'మా' అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకొని లక్ష నూట పదహారు రూపాయలను ఫండ్ గా ఇచ్చారు. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ తరపున రంగారావు గారు లక్ష రూపాయలను ఫండ్ గా ఇచ్చి పేద కళాకారులకు ఉచిత వైద్య చికిత్సలు చేస్తామని మాటిచ్చారు" అని చెప్పారు.

'మా' ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "మంచి మార్పు కోసం ఈ అసోసియేషన్ తరపున మేము ప్రయత్నిస్తున్నాం. శివాజీరాజా, కాదంబరి కిరణ్ పోటీ పడి మరీ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. అందరూ మమల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఓ విద్యార్ధి కూడా 1500 రూపాయలను పేద కళాకారుల కోసం ఇచ్చాడు. చాలా సంతోషంగా అనిపించింది. పేద కళాకారులకు సహాయం అందించడానికి ముందుకొచ్చిన గోవిందరావు గారిని, రంగారావు గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. బ్రహ్మానందం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని చెప్పారు.

రంగారావు మాట్లాడుతూ ''మా హాస్పిటల్ తరపున హెల్థియర్ హార్ట్ ఫౌండేషన్ పేరిట ఫీజులు చెల్లించలేని పేదవారికి సహాయం అందిస్తున్నాను. ఆ ఫౌండేషన్ ద్వారా పేద కళాకారులకు కూడా సహాయమందించాలని నిర్ణయం తీసుకున్నాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శివాజీరాజా, గోవిందరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved