pizza
Maharshi release on 9 May
మే 9న సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌ `మ‌హ‌ర్షి` విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


5 March 2019
Hyderabad

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ముందు ప్ర‌క‌టించినా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల కార‌ణంగా సినిమాను మే 9న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ```మ‌హ‌ర్షి` చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. మార్చి 17 నాటి రెండు సాంగ్స్‌, కొన్ని మాంటెజెస్ మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. రెండు సాంగ్స్ సెట్ వేసి తీస్తాం. మాంటేజ్ స‌న్నివేశాల‌పే అబుదాబిలో చిత్రీకరిస్తాం. ఏప్రిల్ 12కంతా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ఏప్రిల్ 25 నాటికి సినిమాను విడుదల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. కాబ‌ట్టి సినిమాను ఎలాంటి తొంద‌ర లేకుండా మే 9న విడుద‌ల చేయ‌బోతున్నాం. వంశీ త‌న కెరీర్‌లోనే బెస్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ స్క్రిప్ట్ కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. యూనిట్ అంతా చాలా ఎగ్జ‌యిటెడ్‌గా ఉన్నాం. అశ్వినీద‌త్‌గారు, నేను, పివివిగారు సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఇంత క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను ఎంత తొంద‌ర తొంద‌ర‌గా విడుద‌ల చేయాలని ఆలోచించాం. నిన్న హీరో మ‌హేష్‌గారితో కూర్చుని ఈ విష‌య‌మై మాట్లాడాం. మే 9న సినిమాను విడుద‌ల చేస్తున్నాం. యాదృచ్చికంగా అదేరోజున అశ్వినీద‌త్‌గారికి జ‌గ‌దేక‌వీరుడు-అతిలోక‌సుంద‌రి, మ‌హాన‌టి వంటి స‌క్సెస్‌లున్నాయి. ఆర్య‌, ప‌రుగు, భ‌ద్ర వంటి హిట్స్ నాకున్నాయి. ఇలా సెంటిమెంట్‌గా కూడా క‌లిసొచ్చింది. ఓ ఎక్స్‌ట్రార్డిన‌రీ సినిమాకు ఎక్స్‌ట్రార్డిన‌రీగా అన్నీ విష‌యాలు క‌లిసొస్తున్నాయి. మ‌హేష్‌గారి కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా మ‌హ‌ర్షి నిలుస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి మా బ్యాన‌ర్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాం. ఈ సమ్మ‌ర్‌కి కూడా బ్లాక్‌ బ‌స్ట‌ర్ కొడుతున్నాం. ఒక్క‌డు, పోకిరి, శ్రీమంతుడు సినిమాల త‌ర‌హాలో సినిమాలో నావ‌ల్ పాయింట్ ఉంటుంది. సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుడు మ‌న వంతుగా మ‌నం ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్‌తో బ‌య‌ట‌కు వ‌స్తాడు`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved