pizza
Marala Telupana Priya in July
`మ‌ర‌ల తెలుప‌నా ప్రియా` ప్రెస్ మీట్
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 July 2016
Hyderabad

బ‌స్టాప్‌, రోమాన్స్ ఫేం ప్రిన్స్ హీరోగా, వ్యోమ‌నంది హీరోయిన్ గా శ్రీ చైత్ర చ‌ల‌న చిత్ర సంస్థ స‌మ‌ర్పణలో రూపొందుతోన్న చిత్రం `మర‌ల తెలుపనా ప్రియా`. ఈ చిత్రం ద్వారా వాణి.యం.కోస‌రాజు ద‌ర్శ‌కురాలి గా ప‌రిచ‌యమ‌వుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుందంటూ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా...

మ్యూజిక్ దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ ``మరల తెలుపనా ప్రియా పాటలను ఆదరిస్తున్న ప్రేక్షకకులకు ధన్యవాదాలు. నా గత చిత్రాల పాటలను ఆదరించిన విధంగానే ఈ సినిమా పాటలను కూడా ఆదరించారు. డైరెక్టర్ గారు సినిమా కథను నెరేట్ చేసి ఆమెకు ఎలాంటి సంగీతం కావాలో దాన్ని రాబట్టుకున్నారు. ప్రతి సాంగ్ కు మంచి సాహిత్యం కుదిరింది. దర్శకురాలే ఓ పేథాస్ సాంగ్ ను రాశారు. ఆ సాంగ్ చాలా బాగా వచ్చింది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతంది. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ అంతా ఆమెకే దక్కుతుంది`` అన్నారు.

దర్శకురాలు వాణి.యం.కొస‌రాజు మాట్లాడుతూ ``ఇది స్వచ్చమైన ప్రేమకథ. శేఖర్ చంద్రగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి మ్యూజిక్ కావాలని ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన చాలా ఓపికగా మంచి సంగీతాన్ని ఇచ్చారు. లిరిక్ రైటర్స్ చక్కని సాహిత్యాన్ని అందించారు. నేను కూడా ఓ పేథాస్ సాంగ్ రాశాను. ఓ విభిన్న‌మైన ప్రేమ‌క‌థా చిత్రం భిన్న‌మైన వ్య‌క్తిత్వాలు నేప‌ధ్యాలున్న అమ్మాయి, అబ్బాయిల మ‌ద్య సాగే ప్రేమ‌కథ. ఇప్పుడు అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్నారు. స్త్రీ అయినా నాకే అది నచ్చలేదు. స్త్రీ, పురుషులెవరైనా ప్రేమ స్వచ్చంగానే ఉండాలి. ఈ విషయాన్ని నేను సినిమాగా చూపిస్తున్నాను. నెలాఖరున సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు`` అన్నారు.

ప్రిన్స్‌, వ్యోమ‌నంది(ప‌రిచయం), పూజారామ‌చంద్ర‌న్‌, స‌మీర్‌, ర‌వివ‌ర్మ‌, ఫ‌ణి, సాయి, సౌమ్య‌, క‌ల్ప‌ల‌త‌, పావ‌ని రెడ్డి, అను, రియ‌, ర‌మ్య త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి మాటలు: నివాస్‌. వాణి.యం.కొస‌రాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, కెమెరా: రాజశేఖ‌ర్‌.య‌స్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌: శ్రీనివాస్ ఊడిగ‌, నిర్మాణం: శ్రీ చైత్ర చ‌ల‌న చిత్ర‌, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం: వాణి.యం.కొస‌రాజు.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved