శ్రీకాంత్ హీరోగా రాజ ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు సుబ్రమణ్యేశ్వర్ ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘మెంటల్’. కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ...
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ``ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతాను. రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరూ నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. ఆగస్టు 12న సినిమా విడుదలవుతుంది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కోర్టు కేసు అయ్యింది. ఇప్పుడు సినిమా మెంటల్ అనే టైటిల్‌తో విడుదలవుతుంది. పోలీసులు గర్వంగా ఫీలయ్యే సినిమా. అలాగే నేను నెగటివ్ రోల్స్ చేయలేదు. నన్నెవరూ సంప్రదించలేదు. భవిష్యత్‌లో ఎవరైనా సంప్రదించి, నాకు నచ్చితే తప్పకుండా చేస్తాను. ఇక మా అబ్బాయి నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం విడుదల నిర్మాత నాగార్జునగారి చేతుల్లో ఉంది. బహుశా వచ్చే నెలలో ఉండవచ్చునని అనుకుంటున్నాను`` అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జీ మాట్లాడుతూ ``టైటిల్ కోర్టులో ఉండటం వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. ఇందులో శ్రీకాంత్‌గారు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతారు. చచ్చినా, బ్రతికినా పోలీస్‌గానే బ్రతకాలనే పాత్రలో శ్రీకాంత్‌గారు అద్భుతంగా నటించారు`` అన్నారు.
శ్రీకాంత్ సరసన అక్ష హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుహాసిని, గోరటి వెంకన్న తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.