pizza
Mis(s) Match press meet
`మిస్ మ్యాచ్` ప్రెస్‌మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us


2 July 2019
Hyderabad

Miss Match is an out-and-out family entertainer, says Movie team

When I was busy doing handfull of Tamil movies, I was happened to meet producer of powerstar superhit movie Thoriprema's producer GVG Raju sir who suggested me to do Miss Match. All my films were different. And I have been very choosy when it comes to script and my character. Dharma Dhurai and Vada Chennai all were superhit movies, when Miss Match was narrated to me, I could connect with my earlier roles. I play the role of a wrestler in the movie — she is very innocent, bold yet strong and determined. Director NIrmal Kumar pulled off a very good family entertainer. Although the movie appears to be a small one, but the director made it with all cinematic elements to appeal that granduer look in the end. I used to have a fear initially, but he has done a great job. Ganesh's cinematography was top-notch and music from Gifton Elias was simply amazing. From the Telugu blockbuster movie from Pawan Kalyan - Tholiprema, Ee manase se is remade after two days of rehearsals in Ramoji Film City. The song was shot in single take.

Adhiroh creative signs LLP
‘MIS(S)MATCH:

Cast:
Uday Shankar
Aishwarya Rajesh
Pradeep rawath
Sanjay Swaroop
Master Adhiroh
Naga Mahesh
Ravulapati venkata ramarao.
Malakpet shailaja
Badhram
Roopa Laxmi
Sandhya Janak
Sharanya
Padma Jayanthi
Laxman
Munna

Technicians:
Ganesh chandrra(DOP)
Story, screen play: Bhupathi Raja
Music: Gifton Elias
Dialogues: Rajendra Kumar, Madhu
Lyricists: Sirivennela Seetharam Shastri
Suddhaala Ashok Teja, Dharma Teja
Editor: SP Raja Sethupathi
Dance master: shiva shankar,
Fight master: Vijay
Director: NV. Nirmal Kumar
Producers: G srirama raju, Bharath ram

`మిస్ మ్యాచ్` ప్రెస్‌మీట్‌

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్‌.ఎల్‌.పి స‌మ‌ర్ప‌ణ‌లో ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌టించిన చిత్రం `మిస్ మ్యాచ్‌`. జి.శ్రీరామ రాజు, భ‌ర‌త్ రామ్ నిర్మాత‌లు. ఎన్‌.వి.నిర్మ‌ల్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...

ద‌ర్శ‌కుడు ఎన్‌.వి.నిర్మ‌ల్‌కుమార్ మాట్లాడుతూ - ``ఈ సినిమాకు భూప‌తిరాజాగారు మంచి క‌థ‌, స్క్రీన్‌ప్లే అందించారు. ఓ ద‌ర్శ‌కుడిగా ఆయ‌న స‌పోర్ట్‌తో నా వ‌ర్క్ సుల‌భం అయ్యింది. అలాగే నాకేం కావాలో వాట‌న్నింటినీ నిర్మాలు స‌మ‌కూర్చారు. అందుకు వారికి నా కృత‌జ్ఞ‌త‌లు. గిఫ్ట‌న్ మంచి సంగీతాన్ని అందించారు. మంచి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం. త‌ప్ప‌కుండా మీ ఆద‌ర‌ణ ఉంటుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు.

నిర్మాత శ్రీరామరాజు మాట్లాడుతూ - ``నిర్మ‌ల్‌కుమార్‌గారు సినిమాను తెర‌కెక్కించిన విధానం చాలా బావుంది. ఉద‌య్‌శంక‌ర్‌, ఐశ్వ‌ర్యా రాజేశ్ అద్భుతంగా న‌టించారు. ఆట‌గ‌ద‌రాశివ‌లో న‌టించిన ఉద‌య్‌శంక‌ర్ పెర్ఫామెన్స్ న‌చ్చి ప‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతార‌ని న‌చ్చి పెట్టుకున్నాం. ఇక ఐశ్వ‌ర్య స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ రోల్‌లో ఎక్స్‌ట్రార్డిన‌రీగా న‌టించింది. గిఫ్ట‌న్ ఎక్స‌లెంట్ రీరికార్డింగ్‌, మ్యూజిక్ ఇచ్చారు. సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది`` అన్నారు.

నిర్మాత భ‌ర‌త్ రామ్ మాట్లాడుతూ - ``రీరికార్డింగ్ స‌మ‌యంలో సినిమా చూశాను. ఉద‌య్ శంక‌ర్‌, ఐశ్వ‌ర్య అద్భుతంగా న‌టించారు. కొన్ని స‌న్నివేశాల్లో వారి న‌ట‌న చూసి ఏడ్చాను. డైరెక్ట‌ర్ నిర్మ‌ల్‌కుమార్‌గారు సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఈ సినిమాకు ప‌నిచేసిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు.

ఐశ్వ‌ర్యారాజేశ్ మాట్లాడుతూ - ``జీవీజీ అంకుల్ గారికి ఉన్న ప‌రిచ‌యంతో ఈసినిమా చేశాను. అస్స‌లు డేట్స్ ఖాళీ లేవు అని చెప్పినా.. నువ్వు చేయాలని చెప్పారు. భూప‌తిరాజాగారు స్క్రిప్ట్ చెప్పిన త‌ర్వాత సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. స్క్రిప్ట్స్ ఎంపిక‌లో నేను చూసీగానే ఉంటాను. నా తొలి చిత్రం `కాకాముట్టై`లోనే ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా న‌టించాను. ఆ సినిమాకు అంత‌ర్జాతీయంగా మంచి పేరుని తెచ్చిపెట్టింది. ముందు నుండి డిఫ‌రెంట్ సినిమాల‌నే చేస్తూ వ‌చ్చాను. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఉండే పాత్ర‌. అమాకయంగా, ధైర్యంగా ఉండే లేడీ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. త‌మిళంలో క‌నా సినిమాను తెలుగులో కౌస‌ల్య కృష్ణ‌మూర్తిగా చేస్తున్నాం. ఈ సినిమాలో నేను లేడీ క్రికెట‌ర్‌గా క‌న‌ప‌డ‌తాను. ఆ సినిమా కోసం ఆరు నెల‌లు ట్ర‌యినింగ్ తీసుకున్నాను. నాకు రెజ్లింగ్ రాదు.. కాబ‌ట్టి కాస్త స‌మ‌యం తీసుకుని రెజ్లింగ్ ట్రైనింగ్ తీసుకుని న‌టించాను. నిర్మ‌ల్‌గారు స్పాట్‌లో చాలా వ‌యొలెంట్‌గా ఉంటారు. సినిమా చూస్తే మీకు సినిమా ఏంటో అర్థ‌మ‌వుతుంది. సినిమా చూడ‌టానికి ఈరోజు చిన్న‌దిగా అనిపించొచ్చు కానీ నిర్మ‌ల్‌గారు సినిమాను చాలా పెద్ద సినిమాగా చేశారు. నిర్మ‌ల్‌గారు ఎలా చేస్తారో? అని అనుకున్నాను. కానీ అద్భుతంగా తెర‌కెక్కించాను. కెమెరా మెన్ గ‌ణేశ్ అద్భుత‌మైన సినిమాటోగ్ర‌ఫీ అందించారు. గిఫ్ట‌న్ ఎక్స‌లెంట్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో తొలిప్రేమ సాంగ్‌ను సింగిల్ టేక్‌లో చేశాం. విజ‌య్ మాస్ట‌ర్ గారి నేతృత్వంలో ఆ సాంగ్‌ను చాలా గ్రాండియ‌ర్‌గా చేశాం. సినిమా ఆడియెన్స్‌ను డిసప్పాయింట్ చేయ‌దు. సినిమాలో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉద‌య్‌శంక‌ర్‌గారి రెండో చిత్ర‌మిది. అంద‌రూ అద్భుతంగా న‌టించారు. తెలుగులో నేను ఇప్ప‌టికి మూడు తెలుగు సినిమాల్లో న‌టించాను. న‌న్ను త‌ప్ప‌కుండా ఆద‌రిస్తార‌ని న‌మ్మ‌కంగా ఉన్నాను`` అన్నారు.

హీరో ఉద‌య్ శంక‌ర్ మాట్లాడుతూ - ``మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావాల‌ని అనుకుంటున్న స‌మ‌యంలో భూప‌తిరాజాకు చెప్పిన కథ బాగా న‌చ్చింది. ఇలాంటి క‌థ‌ను హ్యాండిల్ చేయ‌డానికి ద‌మ్మున్న డైరెక్ట‌ర్ ఉండాల‌నుకున్నాం. ఆ స‌మ‌యంలో నిర్మ‌ల్‌గారు ముదుకు వ‌చ్చారు. రేపు సినిమా చూస్తే ఆయన మేకింగ్ స్టైల్‌ను అప్రిషియేట్ చేస్తారు. గ‌ణేశ్ చాలా మంచి విజువ‌ల్స్ అందించారు. చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వ‌ర్యా రాజేశ్‌తో న‌టించ‌డం ఆనందంగా ఉంది. త‌న‌తో న‌టించ‌డం చాలెంజింగ్‌గా అనిపించింది. నా ఆల్ టైం ఫేవ‌రేట్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారి తొలి ప్రేమ‌లో ఈ మ‌న‌సే.. సాంగ్‌ను సింగిల్ షాట్‌లో రీమేక్ చేశాం. ఈ సాంగ్ కోసం రెండు, మూడు రోజులు ప్లాన్ చేసి నాలుగు నిమిషాల పాట‌ను షూట్ చేశాం. సాంగ్ స్పీడ్‌గా ఉంటుంది. నా పెర్ఫామెన్స్ స్లోగా ఉంటుంది. ఒరిజిన‌ల్ సాంగ్‌ను ఎంత మేర రీమేక్ చేయాలో అంత మేర చేశాను. గిఫ్ట‌న్‌కు థాంక్స్‌. జీవీజీగారు స‌హా స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved